మైనర్ బాలికలకు వాతలు పెట్టిన పైలట్

ఈ మధ్యకాలంలో హింస అనేది ప్రతి చోట ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద దురుసుగా ప్రవర్తించే తీరు కనిపిస్తుంది. ఇటువంటిదే ప్రస్తుతం ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మైనర్ బాలికను బాధడమే కాకుండా వాతలు కూడా పెట్టారు. అయితే బాలిక ఒంటి మీద చాలాసార్లు వాతలు కనిపించినట్లు బాలిక బంధువులు వాపోతున్నారు.  మహిళా పైలట్ నిర్వాకం:  ఒక ప్రముఖ ఎయిర్ లైన్స్ లో పైలెట్గా పనిచేస్తున్న ఒక మహిళ తన […]

Share:

ఈ మధ్యకాలంలో హింస అనేది ప్రతి చోట ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద దురుసుగా ప్రవర్తించే తీరు కనిపిస్తుంది. ఇటువంటిదే ప్రస్తుతం ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మైనర్ బాలికను బాధడమే కాకుండా వాతలు కూడా పెట్టారు. అయితే బాలిక ఒంటి మీద చాలాసార్లు వాతలు కనిపించినట్లు బాలిక బంధువులు వాపోతున్నారు. 

మహిళా పైలట్ నిర్వాకం: 

ఒక ప్రముఖ ఎయిర్ లైన్స్ లో పైలెట్గా పనిచేస్తున్న ఒక మహిళ తన ఇంట్లో పని చేసేందుకు ఒక మైనర్ బాలికను ఎంచుకుంది. అయితే బాలిక సంబంధించిన బంధువులు కూడా చుట్టుపక్కలే ఇళ్లల్లో పని చేస్తూ ఉండగా, చాలాసార్లు బాలికను కొడుతూ కనిపించారని ,పైలెట్ మహిళ తన భర్త కలిసి పిల్లని హింసించేవారని వారికి తగిన బుద్ధి చెప్పాలని బంధువులు కోరుతున్నారు. 

అయితే ఆ మైనర్ బాలికను, పైలెట్ భార్యాభర్తలు తమ పిల్లల్ని చూసుకోవడానికి పనిలో కుదుర్చుకున్నారు. కానీ చిన్నపిల్లనీ చూసుకునే పని కాకుండా ఇంట్లో పని కూడా తనకి అప్పగించేవారు. అయితే ఈ క్రమంలోనే ఇంట్లో పని చేస్తున్న 10 సంవత్సరాల మైనర్ బాలిక ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ, వెంటనే ఇంటి యజమాని అయినా పైలెట్ మహిళ అరుస్తూ ఆ చిన్న పిల్ల మీద దాడి చేసేది. అంతేకాకుండా ఆ పిల్లని చిత్రహింసలు చేసి వాతలు కూడా పెట్టేవారు. 

పోలీసులు అరెస్ట్ చేశారు: 

కౌశిక్ బాగ్చి (36), భార్య పూర్ణిమ బాగ్చీ (33) భార్యాభర్తలు తన ఇంట్లో పని చేసేందుకు కుదుర్చుకున్న మైనర్ బాలిక సుమారు రెండు నెలలుగా వారింట్లో పని చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే చాలాసార్లు ఇంటికి తిరిగి వచ్చిన మైనర్ బాలిక ఒంటిమీద కాలిన గాయాలు కనిపించాయని బంధువులు చెప్తున్నారు. చాలాసార్లు దెబ్బలతో తిరిగి వచ్చిన చిన్న పిల్లని ప్రశ్నించినప్పటికీ నోరు విప్పలేదు. అయితే ఇటీవల, మైనర్ బాలిక పనిచేస్తున్న ఇంటికి కాస్త దూరంలోనే మైనర్ బాలిక బంధువు పనిచేస్తుంది. అయితే పని మీద అటుగా వెళ్లిన మైనర్ బాలిక బంధువు చూసిన దృశ్యాన్ని పోలీసులకు చెప్పింది. అటుగా వెళుతున్న తనకి, పనిలో కుదుర్చుకున్న పూర్ణిమ, ఆ మైనర్ బాలికను కొడుతూ, తిడుతూ బాల్కనీలో కనిపించింది. 

అయితే వెంటనే మైనర్ బాలిక బంధువు, బాలిక మీద జరుగుతున్న హింసని తట్టుకోలేక, తనతో పాటు చాలామందిని తీసుకుని పూర్ణిమ వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది. అయితే భార్యాభర్తలను ప్రశ్నించేందుకు బయటకు పిలిచినప్పటికీ ఎంత సేపటికి తలుపు తీయలేదని, చాలాసేపటికి తలుపు తెరిచిన తర్వాత, ఆ మైనర్ బాలిక ఏడుస్తూ కనిపించిందని, ఆ పాపని ఎందుకు హింసిస్తున్నారు అని తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వడానికి భార్యాభర్తలు నిరాకరించినట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే మైనర్ బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకున్నందుకు, అదే విధంగా హింసించినందుకు కౌశిక్ బాగ్చి (36), భార్య పూర్ణిమ బాగ్చీ (33) భార్యాభర్తలను అరెస్టు చేశారు పోలీసులు. పూర్ణిమ ఒక ఎయిర్లైన్స్ లో పైలెట్ గా పని చేస్తూ ఉండగా, భర్త కూడా మరో ఎయిర్ లైన్స్ కంపెనీలోనే పనిచేస్తున్నట్టు సమాచారం. 

అంతేకాకుండా మరొకరు ఇచ్చిన వాంగ్మూలం ద్వారా, మైనర్ బాలికను ఇంట్లోకి పనికి కుదుర్చుకున్నప్పుడు, ఒకసారి పైలెట్ యూనిఫామ్ ఐరన్ చేస్తూ ఉండగా పొరపాటున, బట్ట చిన్నది కాలడం గమనించిన పైలెట్ ఆ ఐరన్ బాక్స్ తోనే ఆ మైనర్ బాలిక చేతి మీద వాతలు పెట్టింది. అంతేకాకుండా చిన్న పిల్ల అని చూడకుండా గట్టిగా కొట్టడం వల్ల కంటికి గాయాలు కూడా అయ్యాయి. అంతేకాకుండా ఆ చిన్న పిల్లకి ఎప్పుడూ తినడానికి పాడైపోయిన తిండే పెట్టేవారని కూడా వాంగ్మూలంలో మెన్షన్ చేశారు ఆ మైనర్ బాలిక బంధువులు.