వైరల్.. ట్రాఫిక్‌లోనే కూరగాయలు తరిగిన మహిళ

ఒక్కో సారి ట్రాఫిక్‌ లో ఇరుక్కుంటే ఎప్పుడు ఇంటికి వెళ్తామో చెప్పలేము. ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యే లోపు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం.. మన  హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు.. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఇంతకు మించి ఉంటుంది. ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది వర్ణించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇంటి నుంచి బయటికి కాలు పెట్టిన వ్యక్తి గమ్యస్థానానికి చేరాలంటే గంటల తరబడి ఆ ట్రాఫిక్‌లోనే ప్రయాణించాల్సి […]

Share:

ఒక్కో సారి ట్రాఫిక్‌ లో ఇరుక్కుంటే ఎప్పుడు ఇంటికి వెళ్తామో చెప్పలేము. ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యే లోపు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం.. మన  హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు.. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఇంతకు మించి ఉంటుంది. ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది వర్ణించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇంటి నుంచి బయటికి కాలు పెట్టిన వ్యక్తి గమ్యస్థానానికి చేరాలంటే గంటల తరబడి ఆ ట్రాఫిక్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. 

బెంగళూరు నగరం అంటేనే ఐటీ కంపెనీలకు ఎంతో ఫేమస్. ఈ నగరంలో ట్రాఫిక్‌ ను దాటుకొని తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు నగర ప్రజలు ప్రతీ రోజూ గంటల తరబడి ఎదురు చూడాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అయితే బెంగళూరు ట్రాఫిక్ గురించి ట్రోల్స్, మీమ్స్ ఎన్నో వచ్చాయి. బెంగళూరు ట్రాఫిక్ జామ్ వల్ల ఏడాదికి వేలాది కోట్ల నష్టం వాటిల్లుతోందని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. 

దీంతో పాటే బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాల గురించి కథలు కథలుగా ఎన్నో విషయాలు మనం ఇంతకు ముందు  విన్నాం కూడా… తాజాగా ఓ మహిళ చేసిన పనికి మరోసారి బెంగళూరు ట్రాఫిక్ వార్తల్లోకి ఎక్కింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ మహిళ.. బెంగళూరు ట్రాఫిక్‌‌లో చిక్కుకుపోయింది. ఏం చేయాలో తెలియక గంటల తరబడి ఆ క్యాబ్‌లో కూర్చోలేక తన వద్ద ఉన్న కూరగాయలను ఆ కారులోనే కట్ చేసింది. అయితే మహిళ చేసిన పని ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. 

ప్రియ అనే మహిళ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినా తన సమయాన్ని ఏ మాత్రం వేస్ట్ చేయకుండా కూరగాయలు తరిగింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో ఉంచింది. దాంతో పాటు ఆమె కట్ చేసిన కూరగాయలకు సంబంధించిన ఫోటోను కూడా ఆ ట్వీట్‌లో ఉంచింది. సమయాన్ని వృథా చేసుకోకుండా.. ఏదైనా పనిని చేసుకోవచ్చు అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ట్వీట్‌తో ట్విటర్‌లో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ హైడ్రోపోనిక్స్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మొక్కలను తీసుకుని బెంగళూరు నగరంలో వెళ్తే.. ట్రాఫిక్‌ను దాటి గమ్యస్థానానికి చేరుకునే లోపే అవి పెరిగిపోతాయేమో అంటూ ఒకరు సరదాగా రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌ను తన మేనేజర్‌కు పంపుతానని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ ఆలోచన ఏదో బాగుందే.. ఇకపై ట్రాఫిక్‌‌లో చిక్కుకుపోయినపుడు చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసుకునే అవసరం ఉండదు అని పోస్టు చేశారు.

అయితే గతంలో కూడా బెంగళూరు ట్రాఫిక్‌కు సంబంధించి ఎంతో మంది ట్వీట్లు, పోస్టులు పెట్టారు. మరికొంతమంది ఆ పరిస్థితిని తెలియజేసే సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. బైక్‌పైనే ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకోవడం.. ఓ బస్సు డ్రైవర్ ఏకంగా టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి అన్నం తినడం.. ఇలా రకరకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో బెంగళూరు ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందన్నది ప్రపంచం మొత్తం తెలిసింది. మరోవైపు.. బెంగళూరు ట్రాఫిక్‌కు సంబంధించి ఓ సంస్థ సర్వే చేసి రిపోర్ట్‌ను విడుదల చేసింది. ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం, సిగ్నల్‌ వద్ద ఆగడం కారణంగా సమయం, పెట్రోల్, డీజిల్ వేస్ట్ కావడంతో బెంగళూరు నగరానికి ప్రతీ సంవత్సరానికి దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం వస్తోందని ఆ సంస్థ తన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.