మూడు రోజులు లిఫ్ట్ లో ఇరుక్కుని చనిపోయిన మహిళ 

ఈ ప్రపంచంలో పుట్టడం గిట్టడం మన చేతుల్లో లేనివి. ప్రస్తుతం అనేక రకాలైన యాక్సిడెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. కొందరు కొండ చర్యలు విరిగిపడి, మట్టిలో ఇరుక్కుపోయి చనిపోయిన వాళ్ళని చూశాం. ఇదే తరహాలో అనుకోకుండా ఒక మహిళ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి చనిపోయింది. మహిళ కనిపించట్లేదని మహిళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో మూడు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది. అసలేం జరిగింది:  ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌కు చెందిన ఓల్గా లియోన్టీవా అనే పోస్ట్‌వుమన్, […]

Share:

ఈ ప్రపంచంలో పుట్టడం గిట్టడం మన చేతుల్లో లేనివి. ప్రస్తుతం అనేక రకాలైన యాక్సిడెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. కొందరు కొండ చర్యలు విరిగిపడి, మట్టిలో ఇరుక్కుపోయి చనిపోయిన వాళ్ళని చూశాం. ఇదే తరహాలో అనుకోకుండా ఒక మహిళ లిఫ్ట్ లో ఇరుక్కుపోయి చనిపోయింది. మహిళ కనిపించట్లేదని మహిళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో మూడు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి ఆలస్యంగా వచ్చింది.

అసలేం జరిగింది: 

ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌కు చెందిన ఓల్గా లియోన్టీవా అనే పోస్ట్‌వుమన్, ఏడంతస్తుల భవనంలో ఒకరికి పోస్ట్ ఇవ్వడానికి వెళ్లి, అనుకోకుండా లిఫ్ట్ లో మూడు రోజులుగా చిక్కుకుపోయి లిఫ్ట్‌లో శవమై కనిపించింది.

ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో ఓల్గా లియోన్టీవా అనే 32 ఏళ్ల పోస్ట్‌వుమన్ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె తన రోజు వారి పనిలో భాగంగా ఒక భవనంలో పోస్ట్ ఇవ్వడానికి వెళ్లి,  లిఫ్ట్‌లో చిక్కుకుంది. మూడు రోజుల పాటు ఇరుక్కుపోయింది. ఆమె ఆర్తనాదాలు చేసినప్పటికీ, సహాయం కోసం ఆమె విపరీతమైన కేకలు వేసినప్పటికీ, పై అంతస్తులో నివసిస్తున్న వారికి వినిపించలేదు.దురదృష్టవశాత్తు, అలారం సిస్టమ్ ఆ సమయంలో పనిచేయలేదు. దురదృష్టవశాత్తు, ఆమె చివరకు చనిపోయిందని పోలీసు వారు నిర్ధారించారు. 

ఓల్గా ఎప్పటిలాగే తన పని నుండి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు జూలై 24న తప్పిపోయినట్లు పోలీసులను ఆశ్రయించారు. ఆమెకు ఒక బిడ్డ కూడా ఉన్నట్లు సమాచారం. కానీ ఆమె తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయిందని తెలిసి కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ సంఘటన జరగడానికి గల కారణం ఉన్న పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించింది. ఓల్గా లియోన్టీవా ఆరేళ్ల కుమార్తె, తల్లి లేకుండా మిగిలిపోయింది, ప్రస్తుతం ఆమె బంధువులు ఆమె లేక పోవడానికి జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం, చైనాలో తయారు చేయబడిన లిఫ్ట్ సంఘటన సమయంలో బాగానే పని చేస్తున్నట్లు తెలిసింది. విషాదం సంభవించిన రోజున విద్యుత్తు అంతరాయాలు లేదా అంతరాయాలు లేవని ప్రాంతీయ ఎలక్ట్రిసిటీ నెట్‌వర్క్స్ ఎంటర్‌ప్రైజ్ ప్రతినిధి చెప్పడం జరిగింది. ఫక్రిద్దీన్ నురలియేవ్ మాట్లాడుతూ, 

లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడం కారణంగానే సంఘటన సంభవించిందని వెల్లడించారు. 

ఇలాంటి సంఘటన మరొకటి: 

గత వారం, ఇటలీలోని సిసిలీలోని పలెర్మోలో ఫ్రాన్సెస్కా మార్చియోన్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. జూలై 26న రెసిడెన్షియల్ బిల్డింగ్‌ లో విద్యుత్ కోత కారణంగా, మార్చియోన్ అనే మహిళ లిఫ్ట్‌లో చిక్కుకొని చనిపోయింది. విద్యుత్ వైఫల్యం కారణంగా, అత్యవసర సేవలను సంఘటనా స్థలానికి పిలిపించారు, కానీ దురదృష్టవశాత్తు, వారు ఆమెను రక్షించలేకపోయారు, ఆమె అప్పటికే చనిపోవడం జరిగింది. 

టెక్నాలజీ పరంగా, ప్రపంచం ఎంత ముందుకు వెళుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో నలుమూలల నుంచి వెలుగులోకి వస్తున్నాయి. అనుకోని సంఘటనలు కారణంగా జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వారు ఎప్పటికప్పుడు లిఫ్ట్ సర్వీస్ చేయించుకుంటూ ఉండాలి. లేదంటే అనుకోని సంఘటనలు చూడక తప్పదు. ముఖ్యంగా పవర్ కట్టుకున్న సమయంలో మెట్లను ఉపయోగించడం ఎంతో మేలు. కానీ మూడు రోజులపాటు లిఫ్ట్ లో ఉండి నరకయాతన చూసిన ఆ మహిళ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధాకరం.