సూసైడ్ నోట్ రాసి యువ‌తి ఆత్మ‌హ‌త్మ‌

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో షకీబ్ అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న పింకీ గుప్తా  అనే 26 ఏళ్ల హిందూ యువతి ఆగస్టు 31న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహం పోలీసులకు ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు పింకీ గుప్తా నివాసంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఆ సూసైడ్ నోట్‌లో మృతురాలు తన మరణానికి తన భాగస్వామి షకీబ్ అనే వ్యక్తి కారణమని ఆరోపించినట్టు ఉంది. షకీబ్‌తో తాను […]

Share:

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో షకీబ్ అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న పింకీ గుప్తా  అనే 26 ఏళ్ల హిందూ యువతి ఆగస్టు 31న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహం పోలీసులకు ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు పింకీ గుప్తా నివాసంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఆ సూసైడ్ నోట్‌లో మృతురాలు తన మరణానికి తన భాగస్వామి షకీబ్ అనే వ్యక్తి కారణమని ఆరోపించినట్టు ఉంది. షకీబ్‌తో తాను చాలా గాఢంగా ప్రేమలో ఉన్నానని, అతని కోసం ఇస్లాం మతంలోకి మారడాకి కూడా సిద్ధంగా ఉన్నానని, ఆమె లేఖలో రాసింది. నాలుగు సంవత్సరాల బంధంలో అతని నుండి తాను ఎదుర్కొన్న మోసం మరియు ద్రోహంను ఆమె సూసైడ్ నోట్ లో వివరించింది.

ఆరోపించిన సూసైడ్ నోట్‌లో, పింకీ ఇలా రాసింది, “నా గురించి నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను నీ కోసం పోరాడాను, నీతోనే జీవితం అనుకున్నాను. కానీ నువ్వు  నా ప్రేమకు విలువ ఇవ్వలేదు. నేను చేసేది తప్పు అని అందరు నా కళ్ళు తెరిపించాలని చాలా ప్రయత్నించారు, కానీ నేను మీ ముందు ఏమీ చూడలేకపోయాను. నేను నా మతాన్ని మార్చుకోవాలని కూడా ఆలోచించాను, నిన్ను నాలాగా మార్చుకోవడం కోసం నీ గురించిన ప్రతి విషయాన్నీ అర్థం చేసుకున్నాను,  అయినా నువ్వు నా ఫీలింగ్స్ ని  గ్రహించలేదు. నేను ఇకపై దీన్ని భరించలేను… బై సాకిబ్.” అంటూ సూసైడ్ నోట్ రాసింది.

నివేదికల ప్రకారం, బాధితురాలు పింకీ గుప్తా ఒక జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసింది మరియు అక్కడ ట్రైనర్‌గా ఉన్న సాకిబ్ ఖాన్‌తో నాలుగేళ్లుగా రిలేషన్ షిప్ లో  ఉంది. పింకీ గుప్తా తనను వివాహం చేసుకోవాలని సాకిబ్‌పై ఒత్తిడి తెచ్చింది, అయితే అతను ఆమె మాటలను పట్టించుకోకుండా టైంపాస్ చేస్తూ వచ్చాడు.  అయితే,  సాకీబ్ అప్పటికే వేరొకరితో వివాహం చేసుకున్నందున, తన పెళ్లి గురించి ఆమెను తప్పుదారి పట్టించాడని గుప్తా తర్వాత తెలుసుకుంది. బాధితురాలు ఆ  మోసాన్ని భరించలేక ఆగస్ట్ 31 రాత్రి  తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని  తీవ్ర చర్యకు పాల్పడినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా, ఆమె తలపై గాయం గుర్తులు కూడా ఉన్నట్లు కనిపించడంతో ఈ భయంకరమైన సంఘటన గురించి తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడు మరియు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్ లో  హత్య కేసు పెట్టారు. ఆమె జీవితంలోని గత నాలుగేళ్లలో జరిగిన ప్రతి సంఘటన గురించి ఆమె రాసిన డైరీని ఆమె గదిలోంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెయిరీలో అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు సాకీబ్ అలీని అదుపులోకి తీసుకున్నారు.

 ఢిల్లీలోని ఘాజీపూర్‌కు చెందిన సాకీబ్ అనే అబ్బాయితో పింకీ గుప్తా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నట్లు ఆమె తల్లి  పేర్కొంది . “అతను పింకీ గుప్తాను  మోసగించడం ద్వారా తనతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంచి మోసం చేసాడని, అతని వల్లే అర్ధాంతరంగా తన కూతురు జీవితాన్ని ముగించుకుంది” అని ఆమె ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ గదిలోంచి డైరీని గుర్తించారు. దాని వివరాలు ఇంకా బహిరంగపరచబడలేదు. నిందితుడు పరారీలో ఉన్నప్పటికీ పోలీసులు పట్టుకున్నారు.

బాధితురాలి సోదరుడు రాజు గుప్తా, షకీబ్  తన   సోదరిని ప్రతి రోజు చిత్రహింసలకు గురిచేసేవాడని, అది ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిందని వెల్లడించాడు. ఆమె తనకు ఎదురైన కష్టాలను కుటుంబ సభ్యులకు వివరించిందని, షకీబ్ తన సోదరిని రోజూ చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపించాడు. అంతేకాకుండా, తన తండ్రి ముస్తఫా ఖాన్ కూడా ఆమెను వేధించడంలో హస్తం ఉందని,  పింకీ గుప్తా తాను చంపి, తమ కొడుకును విడిచి పెట్టేలా చేస్తానని, ఈ విషయం అతను తరచూ చెప్పాడని, ఈ విషయాలతో ఆమె విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడిందని రాజు గుప్తా తెలిపారు.