మ‌హిళ‌పై మొద‌టి భార్య దాడి

ఎక్కడ చూసినా హింస కనిపిస్తుంది. ఒక మహిళను దారుణంగా మరో మహిళ గ్యాంగ్ తో వచ్చు మరి చితకబాదిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ లో రికార్డ్ అయిన ఘర్షణ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు ఆ మహిళ గ్యాంగ్ ఎవరు: అయితే ప్రస్తుతం ఈ ఘటన ఒక క్లినిక్ దగ్గర చోటు చేసుకుంది. ఆ క్లినిక్ మరెవరిదో కాదు ఖసీం అలీ అనే వ్యక్తిది. అయితే గ్యాంగ్ తో వచ్చిన […]

Share:

ఎక్కడ చూసినా హింస కనిపిస్తుంది. ఒక మహిళను దారుణంగా మరో మహిళ గ్యాంగ్ తో వచ్చు మరి చితకబాదిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ లో రికార్డ్ అయిన ఘర్షణ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

అసలు ఆ మహిళ గ్యాంగ్ ఎవరు:

అయితే ప్రస్తుతం ఈ ఘటన ఒక క్లినిక్ దగ్గర చోటు చేసుకుంది. ఆ క్లినిక్ మరెవరిదో కాదు ఖసీం అలీ అనే వ్యక్తిది. అయితే గ్యాంగ్ తో వచ్చిన మహిళ ఖసీం అలీ మొదటి భార్య అయిషా. ఇంక ఆ గ్యాంగ్ చితకబాదిన మహిళ మరెవరో కాదు ఖసీం అలీ రెండో భార్య ఫరహ్ అంజుమ్. మరి ఏం గొడవలు ఉన్నాయో ఏమో తెలీదు గానీ, అసిఫ్ మొదటి భార్య కొంతమంది మహిళలను తీసుకుని వచ్చి, తన భర్త డాక్టర్ గా పని చేస్తున్న క్లినిక్ ముందే, తన భర్త రెండో భార్యను గ్యాంగ్ తో కలిసి దారుణంగా చేతకబాదింది.

అయితే ఈ సంఘటన మొత్తం కూడా సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. అందులో కొంతమంది మహిళల గుంపు, అమానుషంగా మరో మహిళను కొడుతున్న దృశ్యాలు క్లియర్గా రికార్డయ్యాయి. అయితే అసిఫ్ భార్యల మధ్యన ఘర్షణ పోలీసుల వరకు చేరుకుంది.

అయితే ఘర్షణ జరుగుతున్న సమయంలో అసిఫ్ రెండో భార్య అరుపులు విని స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకోగా, ఆమె దెబ్బలతో బాధపడుతూ ఉండడం కనిపించింది, అయితే వెంటనే ఖసీం అలీ రెండో భార్యను స్థానిక హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం జరిగింది. మరి ముందు నుంచి ఎందుకు కక్ష పెట్టుకుందో తెలియని మొదటి భార్య మీద, ఆమెతో వచ్చిన గ్యాంగ్ మీద, అంతేకాకుండా తన భర్త అసిఫ్ మీద కూడా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది మొదటి భార్య.

 రెండో భార్యను చితకబాదిన మొదటి భార్య మరియు ఆమె గ్యాంగ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు అసలు ఈ సంఘటనకి కారణాలు ఏమిటో? గ్యాంగ్ తో వచ్చే మాజీ భార్య ఎందుకు హింసించారు? అంతేకాకుండా, తన భర్త మీద కంప్లైంట్ చేసిన మొదటి భార్య ఫిర్యాదు మీదగా దర్యాప్తు మొదలుపెట్టారు.

ఎందుకు హింస:

దేశంలో ఎక్కడ చూసినా సరే హింస చాలా ఎక్కువ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు హింస మీద దృష్టి పెడుతున్నారు. వారికి కావాల్సింది దక్కలేదు అంటే, ఎదుటివారిని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనలో మహిళ గ్యాంగ్ తో రావడం ఏమిటో? తన భర్త రెండో భార్యని ఎందుకు హింసించాలి అనుకుందో తెలియదు.. కానీ, గ్యాంగ్ తో వచ్చే ఒక మనిషిని కొట్టడం మాత్రం చాలా పెద్ద నేరం. నిజానికి ఏవైనా కుటుంబ కలహాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. 

శాంతమే మనకి సమాధానాన్ని ఇస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. ఒకవేళ పరిష్కరించుకోలేక పోతే, బంధువులను, బాగా కావాల్సిన వారినే సలహాలు అడగడం, లేదంటే కోర్టును ఆశ్రయించడం చేసుకోవాలి. అంతేగాని, ఒకరిని హింసించడం, ప్లాన్ చేసి మరి చంపడం ఇలాంటివి చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతం జరిగిన సంఘటన సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డు అయినందువలన, తప్పకుండా అసిఫ్ మొదటి భార్యకు అలాగే గ్యాంగ్ వారికి శిక్ష పడుతుందని తెలుస్తోంది.