ఈ రోజు రాత్రే ‘సూపర్ బ్లూమూన్’.. చూసేయండి!

అరుదైన సూపర్ బ్లూ మూన్ ఈ రోజు కనువిందు చేయబోతోంది. ఒక నెలలో రెండోసారి వచ్చిన పౌర్ణమి కావడం, భూమికి దగ్గర వచ్చినప్పుడు ఏర్పడటంతో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, పెద్దగా కనిపించనున్నాడు ‘నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు’ అన్నాడో సినీ రచయిత. పున్నమి చంద్రుడు అంత స్పెషల్ మరి. కటిక చీకటిలో చల్లని వెన్నెలనిస్తాడు. ఈ మధ్య నారింజ రంగును కప్పుకుని కనువిందు చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి సూపర్‌‌గా కనిపించబోతున్నాడట. అది కూడా ఎప్పటిలా కాకుండా […]

Share:

అరుదైన సూపర్ బ్లూ మూన్ ఈ రోజు కనువిందు చేయబోతోంది. ఒక నెలలో రెండోసారి వచ్చిన పౌర్ణమి కావడం, భూమికి దగ్గర వచ్చినప్పుడు ఏర్పడటంతో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, పెద్దగా కనిపించనున్నాడు

‘నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు’ అన్నాడో సినీ రచయిత. పున్నమి చంద్రుడు అంత స్పెషల్ మరి. కటిక చీకటిలో చల్లని వెన్నెలనిస్తాడు. ఈ మధ్య నారింజ రంగును కప్పుకుని కనువిందు చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి సూపర్‌‌గా కనిపించబోతున్నాడట. అది కూడా ఎప్పటిలా కాకుండా మరింత కాంతివంతంగా దర్శనమివ్వబోతున్నాడట. 

ఆగస్టు 30న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. అరుదైన సుపర్‌‌ బ్లూ మూన్ కనువిందు చేయబోతోంది. రోజులా కాకుండా.. పెద్దగా, కాంతివంతంగా చందమామ కనిపించబోతున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత వచ్చిన సమయంలోనే పౌర్ణమి రావడంతో ఇలా జరుగుతుంది. చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించనున్నాడు. ఇక్కడ ఇంకో విషయం.. బ్లూమూన్ అంటే చంద్రుడు నీలి రంగులో కనిపించడం కాదు.. నారింజ రంగులో దర్శనమివ్వనున్నాడు.

ఈ నెలలో రెండోసారి

ఆగస్టులో ఫుల్‌ మూన్ కనిపించడం ఇది రెండో సారి. 1వ తేదీన తొలి పౌర్ణమి ఏర్పడింది. ఇప్పుడు మరోసారి రావడంతో బ్లూమూన్ అంటున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది. గురువారం ఉదయం 6.46 గంటల వరకు బ్లూమూన్ కొనసాగనుంది. బయట వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో ఈ మూన్ అందంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత ప్రజలు తెల్లవారుజామున చూడటం మంచిదని అంటున్నారు. సాధారణంగా ఏడాదికి ఒకటీ లేదా రెండు బ్లూ మూన్‌లు ఏర్పడుతుంటాయి. 

బ్లూ మూన్‌ అంటే ఏమిటి?

బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. సాధారణంగా ప్రతి నెలలో ఒకసారి పౌర్ణమి ఏర్పడుతుంటుంది. అదే ఒకే నెలలో రెండోసారి పౌర్ణమి వస్తే అప్పుడు కనిపించే చంద్రుడిని బ్లూ మూన్ అంటారు. ఇక ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్‌‌ మూన్‌లు కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు కనిపించే బ్లూమూన్.. నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్‌లో అదనంగా కనిపించేది. ఇక బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్ కాస్త ప్రత్యేకం. మరోవైపు ఏటా 12 నెలల్లో 12 సార్లు పౌర్ణమి ఏర్పడుతుంది. కానీ ప్రతి 2.5 సంవత్సరాలకు అదనపు పౌర్ణమి ఏర్పడుతుంది. అది 13వ పౌర్ణమి. దీన్నికూడా బ్లూమూన్ అని పిలుస్తారు. చంద్రుడు భూమికి దగ్గరరావడం కూడా మరో కారణం. 

సూపర్ బ్లూ మూన్ అని ఎందుకు అంటున్నారు?

ఉత్తర అర్ధ గోళంలో వేసవిలో వచ్చే మూడో, చివరి పౌర్ణమి సూపర్ బ్లూ మూన్ అవుతుంది. అలానే ఒక నెలలో రెండో పౌర్ణమి అవుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరిగే 29 రోజుల కక్ష్య ప్రకారం.. ఇది ఒక సూపర్ మూన్. సాధారణ పౌర్ణమితో పోలిస్తే ఈ రోజు చంద్రుడు ప్రకాశవంతంగా, భారీ పరిమాణంతో కనిపిస్తాడు. 16 శాతం అధిక వెన్నెలను పంచుతాడు. సూపర్‌‌ బ్లూ మూన్‌గా పిలవడానికి ఇదో కారణం. 

అరుదుగా బ్లూ సూపర్ మూన్

నాసా ప్రకారం బ్లూ సూపర్‌‌ మూన్ చాలా అరుదుగా ఏర్పడుతుంటుంది. ఖగోళ పరిస్థితుల కారణంగో పదేళ్లకు ఒకసారి ఇలాంటిది ఏర్పడుతుంటుంది. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ ఏర్పాడటానికి 20 ఏళ్లు కూడా పట్టొచ్చు. మళ్లీ 2037 జనవరి లేదా మార్చిలో కనిపించే అవకాశం ఉంది. అంటే మళ్లీ 14 ఏళ్ల వరకు బ్లూ సూపర్‌‌ మూన్‌ను చూడలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు