ట్రీట్మెంట్ తీసుకున్న ఏడాదికే 6.5% కోవిడ్ పేషెంట్లు మృతి

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కనుక్కొన్నా కానీ ఎక్కడో ఓ చోట పంజా విసురుతూనే ఉంది. నిత్యం అనేక మంది కరోనాతో భయం భయంగా జీవనం గడుపుతున్నారు. ఎక్కడో ఓ చోట ఇది పంజా విసిరిందనే వార్తలను మనం నిత్యం చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ వ్యాదికి సంబంధించి షాకింగ్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఈ వ్యాధి బారిన పడిన అనేక మంది తర్వాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది మాత్రమే […]

Share:

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కనుక్కొన్నా కానీ ఎక్కడో ఓ చోట పంజా విసురుతూనే ఉంది. నిత్యం అనేక మంది కరోనాతో భయం భయంగా జీవనం గడుపుతున్నారు. ఎక్కడో ఓ చోట ఇది పంజా విసిరిందనే వార్తలను మనం నిత్యం చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ వ్యాదికి సంబంధించి షాకింగ్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఈ వ్యాధి బారిన పడిన అనేక మంది తర్వాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా వేరే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అనేక మంది వైద్యులు తెలిపారు. ఇక ఇప్పుడు బయటికొచ్చిన షాకింగ్ సర్వేతో అందరూ వామ్మో అంటూ గుండెలు పట్టుకుంటున్నారు.  

అంత మంది మరణించారు.. 

కరోనా నుంచి కోలుకుని మృత్యుంజయులుగా తిరిగెళ్లిన వారిలో దాదాపు 6.5 శాతం మంది మరణించారని ఇటీవల విడుదల అయిన సర్వే వివరాలు తెలిపాయి. వారంతా డిశ్చార్జి అయిన ఏడాదిలోపే కోవిడ్ సంబంధిత పరిస్థితులతో మరణించారని నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కోవిడ్ -19 అధ్యయనం వెల్లడించింది. చిన్న రోగాల బారిన పడిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా స్త్రీల కంటే ఎక్కువగా పురుషులే ఇందుకు సరెండర్ అవుతున్నారని షాకింగ్ నిజాలను బయట పెట్టింది. ఈ వివరాలను NCRC ఏదో ఆషామాషీగా చెప్పలేదు. కరోనా నుంచి కోలుకుని వెళ్లిన వారిలో ఒక సంవత్సరం తర్వాత మరణించిన వారి లెక్కలను తీసి ఈ విషయాలను వెల్లడించింది. NCRC సెప్టెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2023 వరకు డేటాను సేకరించింది.

అదే కారణం.. 

కరోనా సమయంలో కోలుకునేందుకు వైద్యులు అనేక విధాలుగా సేవలు చేస్తారు. వారికి అనేక రకాల మందులు కూడా అందిస్తారు. అయినా కానీ వారు అలా చనిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇందుకు కూడా కారణం లేకపోలేదు. కోవిడ్ అనంతర పరిస్థితులు (PCC) లే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక తెలియజేపింది. అలసట మరియు కీళ్ల నొప్పులు కాకుండా గుండె ఆగిపోవడం వంటివి సంభవిస్తున్నాయని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఈ మరణాలకు మొదటి కారణం కోవిడ్ అనంతర గుండె సమస్యలే అని చాలా మంది వైద్యులు చెబుతున్నారు. ఇతర ప్రధాన పోస్ట్-కోవిడ్ సమస్యలు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల శ్వాసకోశ వైఫల్యం కావచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

NCRC ట్రాక్ చేసిన 14,419 మంది రోగులలో, డిశ్చార్జ్ అయిన ఒక సంవత్సరంలోనే 942 మంది మరణించారట. వారిలో 325 మంది మహిళలు మరియు 616 మంది పురుషులు ఉన్నారు. వారు మొత్తం సంఖ్యలో దాదాపు 6.5 శాతం. అది కాకుండా వారిలో 175 మంది (18.6 శాతం) 18-45 ఏళ్ల మధ్య వయస్కులే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 40 ఏళ్లు పైబడిన మగవారిలో డిశ్చార్జి అయిన తర్వాత ఒక సంవత్సరంలోపు మరణానికి ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనం తేటతెల్లం చేసింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు డిశ్చార్జి అయిన తర్వాత ఒక సంవత్సరంలో చనిపోయే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం షాకింగ్ నిజాన్ని వెల్లడించింది.

అంతే కాకుండా ఈ అధ్యయనం మరో విషయాన్ని కూడా బహిర్గతం చేసింది ఇలా చనిపోయే వారిలో స్త్రీల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిపింది. మామూలుగా స్త్రీలతో పోలిస్తే పురుషులు చాలా స్ట్రాంగ్ గా ఉంటారని చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి తారుమారైంది. స్త్రీలు తక్కువగా ఈ కారణం వల్ల చనిపోతుంటే పురుషులు మాత్రం ఎక్కువ సంఖ్యలో మరణిస్తుండడం గమనార్హం. ఈ పరిస్థితి మీద అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకోగానే మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని.. భవిష్యత్ లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.