సీమా హైదర్ ని పాకిస్థాన్ బోర్డర్ అవతలకి విసిరివేస్తాము

అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ అమ్మాయి సీమా హైదర్ ని పాకిస్థాన్ బోర్డర్ అవతలకి విసిరివేస్తాము అంటూ కర్ణి సేన వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలం లో ఒక పాకిస్తాన్ యువతి సీమా హైదర్‌ ఇండియా లోని ఉత్తరప్రదేశ్‌లో తన ప్రేమికుడు సచిన్ ని కలవడం కోసం  అక్రమంగా భరత్- పాకిస్థాన్ వద్ద ఉన్న సరిహద్దులను దాటి వచ్చేసింది. ఈ సంఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అయితే సంప్రదాయవాద హిందూ సంస్థ కర్ణి సేన సీమా […]

Share:

అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ అమ్మాయి సీమా హైదర్ ని పాకిస్థాన్ బోర్డర్ అవతలకి విసిరివేస్తాము అంటూ కర్ణి సేన వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల కాలం లో ఒక పాకిస్తాన్ యువతి సీమా హైదర్‌ ఇండియా లోని ఉత్తరప్రదేశ్‌లో తన ప్రేమికుడు సచిన్ ని కలవడం కోసం  అక్రమంగా భరత్- పాకిస్థాన్ వద్ద ఉన్న సరిహద్దులను దాటి వచ్చేసింది. ఈ సంఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అయితే సంప్రదాయవాద హిందూ సంస్థ కర్ణి సేన సీమా హైదర్‌ పై కఠినమైన చర్యలు తీసుకోకపోతే చట్టాన్ని మేమె చేతుల్లోకి తీసుకొని ఆమెని బోర్డర్ సరిహద్దులో విసిరిపారేస్తాము అని హెచ్చరికలు జారీ చేసారు. 

ఎవరు పడితే వారు రావడానికి ఇండియా అనాదశరణాలయం కాదు : ముఖేష్‌ సింగ్‌ రావల్‌

కర్ణి సేన జాతీయ ఉపాధ్యక్షుడు ముఖేష్‌ సింగ్‌ రావల్‌ మాట్లాడుతూ ఎవరుపడితే వాళ్ళు తమ సౌలబ్యానికి తగ్గట్టుగా భారతదేశానికి రావడానికి మనది ఏమి అనాధశరణాలయం కాదని, సీమా హైదర్ భారతదేశంలోకి ప్రవేశించిన విధానం పూర్తిగా అనుమానాస్పదంగా ఉందని, అంతే కాకుండా ఆమె పాకిస్తానీ టెర్రరిస్ ఏజెంట్ కూడా అయ్యి ఉండొచ్చు అని ఈ సందర్భంగా ఆయన చెప్పకొచ్చాడు.ఇంకా ఆయన మాట్లాడుతూ  “పాకిస్థాన్ మరియు భారతదేశం మధ్య సంబంధాలు సరిగా లేవు, ఈమె ఇప్పుడు అక్రమంగా ప్రవేశించింది కాబట్టి ఆమెని కచ్చితంగా తనిఖీ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అప్పటి వరకు మేము  ఆమెని పాకిస్థాన్ ఉగ్రవాదులకు సంబంధించిన సీక్రెట్ ఏజెంట్ గానే పరిగణిస్తాము, ఆమె శరీరం ఎదో ఒక భాగం లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మైక్రో చిప్ అమర్చి ఉండొచ్చు ” అని ఆయన అన్నారు.

“యుపి ఎటిఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) సత్వరమే చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు  మేము స్వాగతిస్తాము. ఒకవేళ చర్య తీసుకోకపోతే, మేము ఆమెను (సీమా హైదర్) పాకిస్తాన్ సరిహద్దులో విసిరివేస్తాము.ఆగస్టు 15 వ తేదీ సమీపిస్తున్న ఈ సమయం లో ఎదో ఒక ప్రణాళిక తోనే ఇండియా లో దాడులు జరపడానికి ఈమె ఇలా అక్రమంగా ప్రవేశించి ఉండొచ్చు” అని కర్ణి సేన నాయకుడు అన్నారు.అంతకుముందు సోమవారం, గోరక్షా హిందూ దళ్ అనే రైట్‌వింగ్ సంస్థ సీమా హైదర్‌కు దేశం విడిచి వెళ్లాలని 72 గంటల అల్టిమేటం జారీ చేసింది.సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచారి కావచ్చని, దేశానికి ముప్పు వాటిల్లుతుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వేద్ నగర్ వీడియోను విడుదల చేశారు.“విద్రోహ దేశానికి చెందిన స్త్రీని మేము సహించము. 72 గంటల్లో సీమా హైదర్ దేశం విడిచి వెళ్లకుంటే ఆందోళన ప్రారంభిస్తాం’’ అని నగర్ చెప్పారు.

పాకిస్థాన్ కి వెళ్తే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు : సీమా హైదర్

సీమా హైదర్, ఆమె ప్రేమికుడు సచిన్ మరియు అతని తండ్రిని ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) నోయిడాలోని ఒక సీక్రెట్ ప్లేస్ లో  సోమవారం సుమారు ఆరు గంటల పాటు ఇంటరాగేషన్ చేసారు.ఇది ఇలా ఉండగా రీసెంట్ గా సీమా ఒక ప్రముఖ నేషనల్ మీడియా కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో లో మాట్లాడుతూ,తనను భారతదేశంలో ఉండటానికి అనుమతించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. ఇంకా ఆమె మాట్లాడుతూ “దయచేసి నన్ను సచిన్‌తో కలిసి భారత్‌లో ఉండనివ్వండి. మీరు నన్ను తిరిగి పాకిస్తాన్‌కు పంపితే, వారు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. నేను పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లడం కంటే ఇక్కడే చనిపోతాను” అని సీమా యూపీ ముఖ్యమంత్రిని అభ్యర్దించింది. అసలు ఈమె మాటల్లో నిజం ఉందా లేదా?, లేకపోతే ఇక్కడ సంఘాలు అనుమానిస్తున్నట్టు గానే ఈమె పాకిస్థాన్ టెర్రరిస్ట్ కి సంబంధించిన సీక్రెట్ ఏజెంట్ అయితే పరిస్థితి ఏమిటి..?, సరిగ్గా స్వతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న సమయం లోనే ఈమె ఇలా ఇండియా లోకి అక్రమంగా రావడానికి గల కారణం ఏమిటి?, ఇలాంటి సందేహాలు నెటిజెన్స్ లో కూడా ఉన్నాయి.