చంద్రయాన్-3: సీమా హైదర్ ఏం చేసిందో తెలుసా..

సీమా హైదర్ అనే పేరు గత కొద్ది రోజులుగా మార్మోగుతూ ఉంది. పాక్ నుంచి ఇండియాకు తన లవర్ కోసం వచ్చిన సీమా విషయం ప్రతి రోజూ ట్రెండింగ్ లో ఉంటుంది. సీమా హైదర్ ఏం చేసినా కానీ ఆ నిర్ణయం కాస్త పని కాస్త వైరల్ గా మారుతోంది. చంద్రయాన్-3 అనేది సక్సెస్ కావాలని ఇండియా మొత్తం ప్రార్థించింది. కేవలం ఇండియా ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ మిషన్ సక్సెస్ […]

Share:

సీమా హైదర్ అనే పేరు గత కొద్ది రోజులుగా మార్మోగుతూ ఉంది. పాక్ నుంచి ఇండియాకు తన లవర్ కోసం వచ్చిన సీమా విషయం ప్రతి రోజూ ట్రెండింగ్ లో ఉంటుంది. సీమా హైదర్ ఏం చేసినా కానీ ఆ నిర్ణయం కాస్త పని కాస్త వైరల్ గా మారుతోంది. చంద్రయాన్-3 అనేది సక్సెస్ కావాలని ఇండియా మొత్తం ప్రార్థించింది. కేవలం ఇండియా ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ మిషన్ సక్సెస్ కోసం ప్రార్థనలు చేశారు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే పాక్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్ చేసిన పని వైరల్ అవుతోంది.  

నీళ్లు కూడా తాగలేదట..

చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ సీమా హైదర్ ఉపవాస దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సీమా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయింది. సీమాకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా కానీ తన ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి చంద్రయాన్ -3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయ్యే వరకు సీమా నిరాహార దీక్ష చేసింది. ఇప్పుడు సీమా నిర్ణయం అందరి చేతా వావ్ అనిపిస్తుంది. 

ల్యాండ్ అయ్యాకే విరమణ..

చంద్రుని ఉపరితలం మీద చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అవ్వాలని పాక్ మహిళ సీమా హైదర్ చేపట్టిన నిరాహార దీక్షకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సీమా మాట్లాడుతూ.. రాధే-కృష్ణ భగవానున్ని తాను గాఢంగా విశ్వసిస్తానని, మిషన్ విజయవంతానికి దేవతలందరి ఆశీర్వాదాలు కోరానని తెలిపింది. అంతే కాకుండా ప్రధాని మోదీని కూడా సీమా హైదర్ పొగడ్తలతో ముంచెత్తింది. చంద్రయాన్ -3 యొక్క విజయం దేశం యొక్క ఖ్యాతిని పెంచుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె రాధే-కృష్ణా, రాధే-కృష్ణా అని జపిస్తూ చంద్రయాన్ -3 సక్సెస్ కోసం చేసిన నిరాహార దీక్ష వైరల్ అవుతోంది.

ఉవ్వెత్తున ఎగిసిపడిన దేశభక్తి.. 

చంద్రయాన్-3 కోసం కేవలం సీమా హైదర్ మాత్రమే కాకుండా దేశం మొత్తం ప్రార్థించింది. అందరి ప్రార్థనల ఫలితంగా చంద్రయాన్ మిషన్ ఫుల్ సక్సెస్ అయింది. ఈ మిషన్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు. చంద్రయాన్ -2 మిషన్ ఫెయిల్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు మరింత కసిగా చంద్రయాన్ -3 కోసం పని చేశారు. అందుకోసమే వారు చంద్రుడి మీదకి మన మువ్వన్నెల జెండాను పంపించగలిగారు. చంద్రయాన్-3 సక్సెస్ కావాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షించాడు. ఒక్కసారి మిషన్ సక్సెస్ అయిన తర్వాత ఇస్రోను అభినందిస్తూ సోషల్ మీడియాను హోరెత్తించారు. 

సీమా నేపథ్యమిదే.. 

కరోనా మహమ్మారి సమయంలో PUBG గేమ్ ఆడుతూ గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న 22 ఏళ్ల భారతీయ వ్యక్తి సచిన్ మీనాతో ప్రేమలో పడిన 30 సంవత్సరాల పాకిస్తాన్ మహిళే సీమా హైదర్. ఇప్పటికే ఈమెకు గులాం హైదర్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అంతే కాకుండా ఆమెకు గులాం హైదర్ కు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ సీమా వారందరిని వదిలేసి సీమా.. తాను ప్రేమించిన సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్‌ను వదిలి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆమె ఓ చిత్రంలో కూడా నటిస్తోంది. తొలి చిత్రం ‘కరాచీ టు నోయిడా’ షూటింగ్‌లో ఉంది. అయితే ఈమెకు శిక్ష విధించాలని కొంత మంది డిమాండ్ చేస్తుంటే కొంత మంది మాత్రం వారిది గ్రేట్ లవ్ అంటూ పొగుడుతున్నారు.