2024లో మ‌ళ్లీ వ‌స్తాన‌న్న మోదీ

భారత ప్రధాని మోదీ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీద జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో దేశం సాధించిన విజయాలను గురించి వివరించడం మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీల వైఖరిని కూడా మోదీ ఖండించారు. వారు స్వార్థ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని గంటాపథంగా చెప్పారు.  మొదటే మణిపూర్ ఇష్యూ.. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గురించి అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ తన ప్రసంగాన్నిమణిపూర్ సమస్యను […]

Share:

భారత ప్రధాని మోదీ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీద జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో దేశం సాధించిన విజయాలను గురించి వివరించడం మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీల వైఖరిని కూడా మోదీ ఖండించారు. వారు స్వార్థ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని గంటాపథంగా చెప్పారు. 

మొదటే మణిపూర్ ఇష్యూ..

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గురించి అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ తన ప్రసంగాన్నిమణిపూర్ సమస్యను గురించి ప్రసంగించారు. మణిపూర్ రాష్ట్రంలో త్వరలో శాంతిస్థాపన జరుగుతుందని ఆయన తెలిపారు. తప్పకుండా మణిపూర్ లో చెలరేగుతున్న హింసను చల్లారుస్తామని ప్రకటించారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. మణిపూర్ గురించి విపక్షాలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. 

రూటు మార్చిన పీఎం

ఈ ఏడు పీఎం మోదీ ప్రసంగం మునుపటి సంవత్సరాలతో పోలిస్తే చాలా భిన్నంగా సాగింది. పాతరోజుల్లో ఆయన మాట్లాడే సమయంలో దేశ ప్రజలను సోదరులు, సోదరీమణులు అంటూ సంబోధించే వారు కానీ ఈ సారి మాత్రం నా ప్రియ కుటుంబ సభ్యులారా అని పదే పదే అనడం గమనార్హం. అసలు మోదీ ఇలా ఎందుకు మాట్లాడారబ్బా.. అని అంతా అనుకుంటున్నారు. ప్రధాని ఏది చేసినా దాని వెనకాల ఏదో కారణం తప్పక ఉండే ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. 

తమ హయాంలో ప్రభుత్వం సాధించిన విజయాలను గురించి మోదీ ఎక్కువగా హైలెట్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఇవి సాధించాం.. ఇవి సాధించాం అంటూ ఆయన ప్రజలకు వివరించారు. వచ్చే ఐదు సంవత్సరాలలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ఎన్నో చేస్తుందని ఆయన తెలిపారు. 

పేదరికం గురించి ప్రస్తావిస్తూ.. 

దేశంలో ఉన్న పేదరికం గురించి మోదీ ప్రస్తావిస్తూ గత ఐదు సంవత్సరాలలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ వివరించారు. దారిద్య్ర రేఖ నుంచి అంత మంది బయటపడడం చాలా ఆనందాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2047లో నిర్వహించుకునే వందో స్వాతంత్య్ర వేడుకలకు మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని మోదీ తెలిపారు. 

గ్రాండ్ వెల్ కమ్..,. 

వేడుకల కోసం ఎర్రకోటను ఘనంగా ముస్తాబు చేశారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ తో కలిసి అనేక మంది మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన సైనిక వందనాన్ని స్వీకరించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. 

డుమ్మా కొట్టిన ప్రతిపక్షాలు

ఈ వేడుకలకు ప్రతి పక్ష నాయకులు చాలా మంది హాజరు కాలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గేకు అక్కడ కేటాయించిన సీటు ఖాళీగా దర్శనం ఇచ్చింది. దీంతో ఆ ఖాళీ సీటు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు ఉన్న అనారోగ్యం కారణంగానే అక్కడకు రాలేకపోయినట్లు మల్లిఖార్జున్ ఖర్గే తర్వాత వివరణ ఇచ్చారు. మల్లిఖార్జున్ ఖర్గే రాకపోవడంతో అధికార పక్షానికి చెందిన అనేక మంది లీడర్లు ఆయన మీద విమర్శలు చేశారు. తర్వాత ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని ప్రధాని తన స్పీచ్ సందర్భంగా తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.