కూటమిలో ప్రధాని అభ్యర్థి ఇతడేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎలాగైనా సరే గద్దె దించేందుకు దేశంలోని అనేక పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇండియా కూటమి ఎలాగైనా సరే ఈ సారి ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఓడిస్తుందని కూటమిలోని నేతలు చెబుతున్నారు. అది కాకుండా ప్రస్తుతం ఒక వార్తకు సంబంధించిన ప్రశ్నకు కూటమి నేతలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ ప్రశ్నను హైలెట్ చేస్తూ అధికార బీజేపీ కూటమిని […]

Share:

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎలాగైనా సరే గద్దె దించేందుకు దేశంలోని అనేక పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇండియా కూటమి ఎలాగైనా సరే ఈ సారి ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఓడిస్తుందని కూటమిలోని నేతలు చెబుతున్నారు. అది కాకుండా ప్రస్తుతం ఒక వార్తకు సంబంధించిన ప్రశ్నకు కూటమి నేతలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ ప్రశ్నను హైలెట్ చేస్తూ అధికార బీజేపీ కూటమిని విమర్శిస్తోంది. వారికి మోదీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించే సత్తా లేదని వారు కామెంట్లు చేస్తున్నారు. కానీ కూటమి నేతలు మాత్రం బీజేపీని తప్పక ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాల్లో సంచరించారు. దీని ఎఫెక్ట్ వల్ల తమకు అధికారం తప్పక దక్కుతుందని భావిస్తున్నారు. అది మాత్రమే కాకుండా భారత్ జోడో యాత్ర తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికలలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ను ఫామ్ చేసింది. దీంతో కూటమి నేతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ప్రధాని ప్రచారం చేసినా కానీ

కొద్ది రోజుల క్రితం కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్వయాన ప్రధాని అయిన మోదీనే బీజేపీ తరఫున ప్రచారం చేశారు. అంతే కాకుండా కర్ణాటక బీజేపీ పార్టీ సెలెబ్రెటీలతో కూడా ప్రచారం చేయించింది. అయినా కానీ అక్కడ ఆ పార్టీ ఓడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇదే రిపీట్ అవుతుందని ఇండియా కూటమి చెబుతోంది. ప్రధాని మోదీ చరిష్మా తగ్గిపోయిందని వాదిస్తోంది. ప్రధాని మొహం చూసి ఓట్లు వేసే రోజులు పోయాయని అంతా అంటున్నారు. ప్రస్తుతం అంతా కాంగ్రెస్ హవా నడుస్తోందని ఇండియా కూటమి విజయం తథ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు??

ఏదో బీజేపీ వారు విమర్శించారని మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా వస్తున్న ప్రశ్న ఇది. అసలు కూటమి విజయం సాధిస్తే ప్రధాని కుర్చీలో ఎవరు కూర్చుంటారని అంతా ప్రశ్నిస్తున్నారు. దీనికి త్వరలో సమాధానం లభిస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు కూటమి సమావేశాలు జరిగినా కానీ దీనికి మాత్రం సమాధానం లభించలేదు. తాజాగా ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రతిపాదిస్తూ.. ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రతిపాదనలు చేశారు. ఆమె ఇలా ప్రతిపాదనలు చేయడంతో వెంటనే ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ నిరంతరం ప్రజల ఆందోళనలను సమర్థిస్తారని, దేశ రాజధానిలో ద్రవ్యోల్బణం రేటును తగ్గించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇంకా ఇంతకంటే మంచి ప్రధాని అభ్యర్థి ఇండియా కూటమికి దొరుకుతాడా అని ఆమె కూటమి నేతలను ప్రశ్నించింది. అంతే కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను నియమించాలని తాను కూటమి నేతలను కోరుతున్నట్లు కక్కర్ తెలిపారు. ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల కూటమికి ప్రధానిగా కేజ్రీవాల్ ను ప్రతిపాదించాలని ఆమె డిమాండ్ చేశారు. 

ఖండించిన ఆప్ నేతలు

ఆమె ఇలా ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ ను ప్రకటించాలని కోరడంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై పలువురు ప్రతినిధులతో పాటు ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా మాట్లాడారు. ఎంపీ రాఘవ్ చద్దా కక్కర్ ప్రకటనను ఆమె డిమాండ్ ను ఖండిచారు. ఆయన ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ… ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానమంత్రి పదవి కోసం ఇండియా కూటమిలో చేరలేదని తెలిపారు. అంతే కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో లేరని స్పష్టం చేశారు. మెరుగైన ఇండియా కోసం బ్లూప్రింట్‌ను సిద్ధం చేయడానికే తాము కూటమికి మద్దతు తెలిపినట్లు ఆయన వివరించారు. అలాగే నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం మొదలైన సమస్యల సంకెళ్ల నుంచి భారత్ ను విముక్తి చేసేందుకు తాము కూటమితో చేతులు కలిపామని తెలిపారు. ఇలా రాఘవ్ చద్దా స్పందించిన తర్వాత.. ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి కూడా కక్కర్ ప్రకటనపై స్పందించారు. కేజ్రీవాల్‌కు అలాంటి కోరికలు ఏం లేవని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి మాత్రమే కాకుండా తమ కూటమి నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు ప్రతిపక్ష నాయకులు ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించాలని ఆమె తెలిపారు. కేజ్రీవాల్ ను కూటమిని ప్రధాని అభ్యర్థిగా చేయాలని ముంబైలో కూటమి సమావేశం కాబోయే ఒక రోజు ముందు వ్యాఖ్యలు రావడం గమనార్హం. అది కూడా కూటమిలోని పార్టీ జాతీయ అధికా ప్రతినిధి వంటి పొజిషన్ లో ఉన్న వారు చేయడం మరో విషయం. దీనిపై అందరూ కామెంట్లు చేస్తున్నారు.