మద్యం మత్తులో వేధిస్తున్నాడని భర్తని చంపిన భార్య

కోనసీమ అయినవెళ్లి గ్రామంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త రోజు మద్యం తాగి వచ్చి అర్ధరాత్రిపూట్ల తనని హింసిస్తున్నాడని, ఇంక తట్టుకోలేక గురువారం రాత్రి తన భర్తను తన భార్య జాడితో తల మీద కొట్టి చంపేసింది.  బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో దారుణం:  పోలీసులు చెప్పిన దాని ప్రకారం, కోనసీమ డిస్ట్రిక్ట్ అయినవెళ్లి గ్రామంలో, దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ సత్యనారాయణమ్మ భార్యాభర్తలు. వారికి వివాహమై 15 సంవత్సరాలు అవుతుంది వారికి ఇద్దరు బిడ్డలు. […]

Share:

కోనసీమ అయినవెళ్లి గ్రామంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త రోజు మద్యం తాగి వచ్చి అర్ధరాత్రిపూట్ల తనని హింసిస్తున్నాడని, ఇంక తట్టుకోలేక గురువారం రాత్రి తన భర్తను తన భార్య జాడితో తల మీద కొట్టి చంపేసింది. 

బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో దారుణం: 

పోలీసులు చెప్పిన దాని ప్రకారం, కోనసీమ డిస్ట్రిక్ట్ అయినవెళ్లి గ్రామంలో, దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ సత్యనారాయణమ్మ భార్యాభర్తలు. వారికి వివాహమై 15 సంవత్సరాలు అవుతుంది వారికి ఇద్దరు బిడ్డలు. రామకృష్ణ రోజు వారి కూలీగా పని చేస్తున్నాడు. అయితే ప్రతిరోజూ తనకి తాగి ఇంటికి రావడం అలవాటుగా మారింది. తాగి ఇంటికి రావడమే కాకుండా తన భార్యని చిత్రహింసలకు గురి చేసేవాడు. మద్యం మత్తులో విచక్షణ రహితంగా తన భార్యతో ప్రవర్తించేవాడు. ప్రతిరోజు రాత్రి తనకి నరకాన్ని చూపించేవాడు. అయితే భార్య ఈ నరకం నుంచి బయటపడాలని ఒక నిర్ణయానికి వచ్చింది. 

గురువారం రాత్రి ఎప్పటిలాగే రామకృష్ణ మద్యం మత్తులో తూగుతూ ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే తనదైన శైలిలో భార్యని హింసించడం మొదలుపెట్టాడు. అయితే చిత్రహింసలు పడుతున్న భార్య ఇంక తట్టుకోలేక ఆ పక్కనే ఉన్న పచ్చడి జాడి తీసుకుని రామకృష్ణ తల మీద గట్టిగా కొట్టింది. అంతే కాకుండా, ఆ పక్కనే ఉన్న మరో రాడుతో రామకృష్ణ తల మీద మరోసారి గట్టిగా కొట్టడంతో, మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణమ్మని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాదులో ఇదే తరహాలో భార్య మరణం: 

బేగం, అజర్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అజర్ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా తమ కాపురం సాఫీగా సాగుతున్నప్పటికీ, మద్యం కాపురాన్ని కూల్చేసింది. 

చాలా రోజులుగా బేగం భర్త అయిన అజర్ మద్యం మత్తులో ఆఫీసుకు వెళ్లి పని చేస్తున్నట్లు గమనించిన ఆఫీస్ వాళ్లు, అజర్ ను ఉద్యోగం నుంచి మాన్పించేస్తారు. అయితే మద్యానికి బానిస అయిన అజర్, తన ఉద్యోగం పోగొట్టుకున్నప్పటినుంచి మద్యం కొనేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడేవాడు. ఈ విషయంలోనే చాలా రోజులుగా తన భార్యని వేధింపులకు గురి చేస్తున్నట్లు చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు తెలియజేయడం జరిగింది. 

మద్యానికి బానిసైన అజర్ మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియలేని పరిస్థితికి వెళ్లిపోయాడు. కరెక్ట్ గా మంగళవారం సాయంత్రం మద్యం కొనుక్కునేందుకు తన భార్య బేగంను 200 రూపాయలు అడగగా, బేగం తన భర్తకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. ఇదే క్రమంలో మద్యానికి బానిసైన అజర్, విచక్షణ కోల్పోయి తన భార్య అని చూడకుండా గొడవకు దిగి చివరికి టవల్తో తన భార్య గొంతు పిసికి చంపేశాడు. పక్కింట్లో ఉంటున్న జరీన అనే యువతీ, బేగం వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే సరికి, బేగం స్పృహ లేకుండా నేల మీద పడి ఉండడం చూసినట్లు చెప్పింది. ఈ విషయంపై పోలీసులు అజర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

మద్యం మహా చెడ్డది: 

చాలామంది కుటుంబాలు కూలిపోవడానికి, రోడ్డున పడడానికి కారణం ఇటువంటి మధ్యానికి బానిసలుగా మారడమే. ఎంతో ఆడుతూ పాడుతూ గడపాడాల్సిన జీవితాన్ని మద్యం కారణంగా చాలామంది తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇప్పుడు బేగం మరియు అజర్, రామకృష్ణ మరియు సత్యనారాయణమ్మ విషయంలో జరిగింది కూడా అదే. అందుకే మాదకద్రవ్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.