తెలంగాణా బిజేపీ లో మార్పు

తెలంగాణా బిజెపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ కుమార్ ని ప్రధాని మోదీ తొలగించడానికి కారణాలు ఏంటి?  హిందుత్వం అనే ఫిలాసఫీతో తెలంగాణలో బిజెపికి బండి సంజయ్ బూస్ట్ ఇచ్చాడు. ఈ ఐడియా నచ్చి ప్రజా సంగ్రామ యాత్రలో ప్రధాని మోదీ కూడా సంజయ్ ని పొగిడాడు. కానీ ఇప్పుడు బండి సంజయ్ ని బిజెపి అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ని నియమించారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు మార్పు: […]

Share:

తెలంగాణా బిజెపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ కుమార్ ని ప్రధాని మోదీ తొలగించడానికి కారణాలు ఏంటి?  హిందుత్వం అనే ఫిలాసఫీతో తెలంగాణలో బిజెపికి బండి సంజయ్ బూస్ట్ ఇచ్చాడు. ఈ ఐడియా నచ్చి ప్రజా సంగ్రామ యాత్రలో ప్రధాని మోదీ కూడా సంజయ్ ని పొగిడాడు. కానీ ఇప్పుడు బండి సంజయ్ ని బిజెపి అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ని నియమించారు.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు మార్పు:

తనని అధ్యక్ష పదవి నుంచి తప్పించలేదు అని బండి సంజయ్ కుమార్ చెప్పి రెండు రోజులు కూడా కాకముందే తనని అధ్యక్ష పదవి నుండి తొలగించారు. కొత్త అధ్యక్షుడిగా యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి ని నియమించారు. పోయిన సంవత్సరం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేశాడు. తన ఐడియాలు నచ్చి ప్రధానమంత్రి కూడా తనని మెచ్చుకున్నాడు. తను తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో ఈ ప్రజాసంగ్రామ యాత్రను కంప్లీట్ చేశాడు.బండి సంజయ్ కుమార్ తెలంగాణలో కడుతున్న కొత్త సెక్రటేరియట్ ముస్లిం స్టైల్ నిర్మాణంలో కడుతున్నారని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తనని చాలామంది ట్రోల్ చేశారు.

బిజెపి కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి:

బండి సంజయ్ కుమార్ ని అధ్యక్షుడిగా తొలగించి, కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.బండి సంజయ్ కుమార్ ఇంతకుముందు  ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ టైంలో కొమరం భీమ్  సన్నివేశాలు జాగ్రత్తగా తీయాలని దర్శకుడు రాజమౌళిని హెచ్చరించాడు. ఏదైనా తేడా వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు.తన సొంత పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ బండి సంజయ్ కుమార్ చేసిన కొన్ని వ్యాఖ్యలను తప్పు పట్టాడు. తెలంగాణలో 2020 నుండి బండి సంజయ్ మంచి సేవలు చేశాడు. తెలంగాణలో బీజేపీని నిలబెట్టింది బండి సంజయ్ కుమార్ ఏ. బండి సంజయ్ కుమార్ తన దూకుడుతో భారతీయ రాష్ట్ర సమితి కి కొరకరాని కొయ్యగా మారాడు. ఇప్పుడు తెలంగాణలో బిజెపి ఈ పొజిషన్లో ఉందంటే దానికి కారణం బండి సంజయ్ కుమార్ ఏ. తనని పదవి నుండి తప్పించినా పార్టీ కోసం ఏదైనా చేస్తానని బండి సంజయ్ కుమార్ తెలిపాడు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన జి కిషన్ రెడ్డి ఇంతకుముందు 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, తర్వాత 2019లో ఎంపీగా గెలిచాడు. 2019లో బిజెపి ఎంపీ సీట్లు గెలవడంతో బీఆర్ఎస్ కి గట్టి పోటీగా మారింది.తర్వాత 2020లో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచి బీఆర్ఎస్ కు తామే సరైన ప్రత్యర్థిమని ప్రజల్లో ఆశలు కలిగించింది. కానీ ఎలక్షన్స్ జరిగే ముందు బండి సంజయ్ కుమార్ ని అధ్యక్ష పదవి నుండి తీయడం వల్ల బిజెపికి నష్టం జరగవచ్చు. చెప్పాలంటే దీనివల్ల తెలంగాణాలో బిజెపి తన మనుగడ కోల్పోవచ్చు.ఒక మంచి లీడర్ ని ఇలా అధ్యక్ష పదవి నుండి తీసేయడం వల్ల పార్టీలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. వీటన్నింటినీ దాటుకొని కిషన్ రెడ్డి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూద్దాం. ఇప్పుడు బిజెపికి కావల్సిన దూకుడు ఎవరు ఇస్తారో చూద్దాం. రానున్న రోజుల్లో దీనివల్ల ఏ విధమైన ఫలితాలు వస్తాయో తెలిసిపోతుంది అంతవరకు వెయిట్ చేద్దాం.