మధ్యప్రదేశ్‌లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ చిక్కుల్లో పడ్డారా? సొంత పార్టీనే ఆయనకు ముకుతాడు వేయాలనుకుంటోందా? బీజేపీ సోమవారంనాడు విడుదల చేసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితాలో శివరాజ్ సింగ్ నియోజకవర్గాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించ లేదు.  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ చిక్కుల్లో పడ్డారా? సొంత పార్టీనే (బీజేపీ) ఆయనకు ముకుతాడు వేయాలనుకుంటోందా? బీజేపీ సోమవారంనాడు విడుదల చేసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ […]

Share:

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ చిక్కుల్లో పడ్డారా? సొంత పార్టీనే ఆయనకు ముకుతాడు వేయాలనుకుంటోందా? బీజేపీ సోమవారంనాడు విడుదల చేసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితాలో శివరాజ్ సింగ్ నియోజకవర్గాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించ లేదు.

 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ చిక్కుల్లో పడ్డారా? సొంత పార్టీనే (బీజేపీ) ఆయనకు ముకుతాడు వేయాలనుకుంటోందా? బీజేపీ సోమవారంనాడు విడుదల చేసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితా ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈసారి జాబితాలో కూడా శివరాజ్ సింగ్ నియోజకవర్గాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించ లేదు. దీనికి తోడు, మధ్యప్రదేశ్ సీనియర్ నేతల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి నియోజకవర్గాలు కేటాయించింది. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ ఈ అగ్రనేతలను నిలబెట్టడం ద్వారా ఆ సీట్లపై పట్టుసాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉందనే ఉషయం రెండో జాబితా చెప్పకనే చెపుతోంది. తద్వారా ఈసారి ముఖ్యమంత్రి రేసులో పలువురు ఉండబోతున్నారనే పరోక్ష సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 సీట్లకు గాను 76 మంది అభ్యర్థుల పేర్లను ఇప్పటి వరకూ బీజేపీ ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారం దక్కించుకోవాలనే బీజేపీ వ్యూహరచనలో భాగంగా ఏడుగురు లోక్‌సభ సభ్యులను ఎన్నికల బరిలోకి దింపింది. వారికి నియోజకవర్గాలు కేటాయించింది. వీరిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ కూడా ఉన్నారు. నలుగురు గతంలో ఎమ్మెల్యేలుగా కూడా సేవలందించారు. పార్టీ ప్రకటించిన ముగ్గురు కేంద్ర మంత్రుల్లో నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ సింగ్ కులస్తే ఉన్నారు.

కైలాష్ విజయవర్గీయ దశాబ్దం తర్వాత రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇండోర్ జిల్లాలోని మహు నియోజకవర్గం నుంచి 2013లో విజయవర్గీయ గెలిచారు. తాజాగా ఆయనకు ఇండోర్-1 సీటు కేటాయించారు. నరేంద్ర సింగ్ తోమర్ అయితే రెండు దశాబ్దాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. గ్వాలియర్ నుంచి ఆయన 2003లో వరుసగా రెండోసారి గెలిచారు. మధ్యప్రదేశ్‌కు చెందిన స్థానిక సీనియర్ నాయకులను ఎంపిక చేయడం ద్వారా వారి అనుభవం, ఆయా ప్రాంతాలు, కులాలను ప్రభావితం చేయగలరని బీజేపీ అంచనా వేస్తోంది. ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను ఎంపిక చేయడం వల్ల బలహీన స్థానాల్లో పార్టీ విజయావకాశాలు బలపడతాయని, పొరుగు నియోజకవర్గాల్లో కూడా వీరి పలుకుబడి పార్టీ విజయానికి దోహదపడుతుందని అంచనా వేస్తోంది.

శివరాజ్ సింగ్ చౌహాన్‌‍ నియోజకవర్గాన్ని ప్రకటించకపోవడం, ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంపై కాంగ్రెస్ వెంటనే స్పందించింది. బీజేపీ తన ఓటమిని ఒప్పుకుందంటూ ఈ పరిణామాన్ని విశ్లేషించింది. తమకు కోట్లాది కార్యకర్తలు ఉన్నారని, 18.5 ఏళ్లు బీజేపీ ప్రభుత్వంలో, ఇందులో 15 ఏళ్లకు పైగా శివరాజ్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని బీజేపీ చెబుతున్న మాటల్లో డొల్లతనం బీజేపీ అభ్యర్థుల జాబితాను చూస్తేనే అర్ధమవుతుందని, బీజేపీ ముందే ఓటమిని అంగీకరించిందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్‌నాథ్ ఓ ట్వీట్‌లో అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మరో అడుగు ముందుకు వేసి, రాష్ట్రంలో మునిగిపోతున్న పడవను కాపాడేందుకే కేంద్ర నాయకులందర్నీ బీజేపీ ఎన్నికల బరిలోకి దింపుతోందన్నారు. తాము ఓడిపోతామని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా తెలుసునన్నారు. అందుకే తనకు రాజకీయంగా పోటీదారులైన బడా నేతలను ఆయన బరిలోకి తెచ్చారని అన్నారు.

కాగా, బీజేపీ జాబితాలో ఉన్న తక్కిన నలుగురు లోక్‌సభ ఎంపీలలో నాలుగుసార్లు సాత్నా నియోజవర్గం ఎంపీగా ఉన్న గణేష్ సింగ్, రెండుసార్లు సిద్ధి నియోజకవర్గం నుంచి గెలిచిన రీతీ పాఠక్, నాలుగుసార్లు జబల్‌పూర్ ఎంపీగా ఉన్న రాకేష్ సింగ్, హోషంగాబాద్‌ నుంచి మూడు సార్లు ఎంపీగా ఉన్న ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. గణేష్ సింగ్‌కు సాత్నా నియోజకవర్గాన్నే తిరిగి కేటాయించగా, రీతి పాఠక్‌కు సిషి అసెంబ్లీ సీటు, రాకేష్ సింగ్‌కు జబల్‌పూర్-వెస్ట్, ఉదయ్ ప్రతాప్ సింగ్‌కు నర్సింగాపూర్ జిల్లాలోని గదర్‌వారా సీటు కేటాయించారు.