పైలట్ కారణంగా జైపూర్‌లో ఇబ్బంది పడిన ప్రయాణికులు

వాతావరణం అనుకూలంగా లేనందువలన, జైపూర్‌లో లండన్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ చేయడం జరిగింది మరియు ఆలస్యం కారణంగా పైలట్ ఫ్లైట్ ని నడిపేందుకు నిరాకరించాడు. దాదాపు 350 మంది ప్రయాణికులు జైపూర్ విమానాశ్రయంలో 5 గంటలపాటు ఇబ్బంది పడ్డారు. ఢిల్లీకి చేరుకోవడానికి వేరే మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది. జైకిషన్ శర్మ చెప్పిన దాని ప్రకారం:  ఆదివారం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా లండన్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని జైపూర్ లో అత్యవసరంగా […]

Share:

వాతావరణం అనుకూలంగా లేనందువలన, జైపూర్‌లో లండన్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ చేయడం జరిగింది మరియు ఆలస్యం కారణంగా పైలట్ ఫ్లైట్ ని నడిపేందుకు నిరాకరించాడు. దాదాపు 350 మంది ప్రయాణికులు జైపూర్ విమానాశ్రయంలో 5 గంటలపాటు ఇబ్బంది పడ్డారు. ఢిల్లీకి చేరుకోవడానికి వేరే మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది.

జైకిషన్ శర్మ చెప్పిన దాని ప్రకారం: 

ఆదివారం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా లండన్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని జైపూర్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత, పైలెట్ విమానాన్ని నడపడానికి నిరాకరించాడు. ఫ్లైట్ డ్యూటీ సమయ పరిమితులు మరియు డ్యూటీ సమయం కూడా ఫ్లైట్ నడిపేందుకు నిరాకరించడానికి కారణమని అతను పేర్కొన్నాడు.

ఆ పైలెట్ ఫ్లైట్ ని నడిపేందుకు నిరాకరించిన కారణంగా, దాదాపు 350 మంది ప్రయాణికులు జైపూర్ విమానాశ్రయంలో 5 గంటలపాటు ఇబ్బంది పడ్డారు. ఢిల్లీకి చేరుకోవడానికి వేరే మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది.  ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, వాస్తవానికి తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సిన AI-112 విమానం జైపూర్‌కు మళ్లించబడింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన తరువాత జైపూర్‌కు మళ్లించారు.

సుమారు రెండు గంటల తర్వాత, లండన్ వెళ్లే విమానం ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుండి ఢిల్లీకి తన ప్రయాణాన్ని పునఃప్రారంభించటానికి అనుమతిని పొందింది, దానితో పాటు మరికొన్ని విమానాలు కూడా జైపూర్‌కు మళ్లించినట్లు సమాచారం. అయితే పైలట్ విమానాన్ని నడిపేందుకు నిరాకరించి, దిగిపోయాడు.

దీంతో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 350 మంది ప్రయాణికులకు ఢిల్లీ వెళ్లడానికి వేరే ఏర్పాట్లు చేసుకోమని అనౌన్స్ చేయడం జరిగింది. సుమారు మూడు గంటల తర్వాత, వారిలో కొందరిని రోడ్డు మార్గంలో ఢిల్లీకి పంపించారు, సిబ్బందిని ఏర్పాటు చేసిన తర్వాత అదే విమానంలో మరికొందరిని ఢిల్లీకి పంపించగలిగారు.

అయితే, ఎయిర్ ఇండియా తన అధికారిక ప్రకటనలో స్పందిస్తూ, లండన్-ఢిల్లీ AI112 విమానాన్ని ఢిల్లీలో ప్రతికూల వాతావరణం, విమానాన్ని నడిపేందుకు అనుకూలంగా లేనందు కారణంగా ఉదయం 4 గంటలకు జైపూర్‌లో ల్యాండ్ చేయడానికి దారి మళ్లించామని పేర్కొంది. 

ఎయిర్ లైన్ వివరణ: 

“ఢిల్లీ వాతావరణం మెరుగుపడి టేకాఫ్ కోసం విమానం వేచి ఉండగా, కాక్‌పిట్ సిబ్బంది FDTL కిందకు వచ్చారు, అది సిబ్బంది టైమింగ్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు నిర్దేశించిన ప్రకారం, FDTL పరిధిలోకి వచ్చిన తర్వాత పైలట్లు విమానాన్ని నడపలేరు. ఎయిర్ ఇండియా దాని ప్రయాణీకులు మరియు సిబ్బంది యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, అంతేకాకుండా ముఖ్యంగా ఆపరేషన్ నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు, అందుకనే వెంటనే విమానాన్ని నడపడానికి కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసింది” అని ఎయిర్‌లైన్ తెలిపింది. 

నిజానికి చాలా విమానాలు కూడా ఇలాగే అత్యవసరంగా ల్యాండ్ చేబడుతూ ఉంటాయి. ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా లేనప్పుడు అత్యవసర లాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు కూడా వాటిళ్లే అవకాశం లేకపోలేదు. అందుకే ముందుగానే అలర్ట్ గా ఉండే పైలెట్లు అలాగే ఎయిర్ లైన్ సిబ్బంది, విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లీంచేందుకు ఎక్కువగా అవకాశాలు చూస్తారు. ఇందులో ప్రయాణికులకు కాస్త సమయం వరకు ఇబ్బంది ఏర్పడినప్పటికీ, ప్రయాణికుల సేఫ్టీ కోసం ఎక్కువగా ఎయిర్లైన్ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే విమానాలను అత్యవసర లాండింగ్ చేయాల్సి వస్తుంది.