పాపుల‌ర్ ఎవ‌రు.. మోదీనా రాహులా?

2024 ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో భారత దేశంలో అత్యధిక స్థాయిలో రెండు అగ్ర ప్రధాన పార్టీలో తమ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి, ఎవరు ఆదిపద్యంలో ఉన్నారు, ఎవరు వెనకబడి ఉన్నారు అని ఇరు వైపుల నుంచి పార్టీలు తమ డేటాను షేర్ చేశాయి. ప్రస్తుతం ఈ డేటా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాన మంత్రి మోదీ ఆ.. లేదంటే రాహుల్ గాంధీ ఆ.. అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  సోషల్ […]

Share:

2024 ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో భారత దేశంలో అత్యధిక స్థాయిలో రెండు అగ్ర ప్రధాన పార్టీలో తమ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి, ఎవరు ఆదిపద్యంలో ఉన్నారు, ఎవరు వెనకబడి ఉన్నారు అని ఇరు వైపుల నుంచి పార్టీలు తమ డేటాను షేర్ చేశాయి. ప్రస్తుతం ఈ డేటా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాన మంత్రి మోదీ ఆ.. లేదంటే రాహుల్ గాంధీ ఆ.. అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

సోషల్ మీడియాలో చర్చ: 

తమ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి, ఎవరు ఆదిపద్యంలో ఉన్నారు ఎవరు వెనకబడి ఉన్నారు అని ఇరు వైపుల నుంచి పార్టీలు తమ డేటాను షేర్ చేశాయి. ప్రస్తుతం ఈ డేటా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాన మంత్రి మోదీ ఆ లేదంటే రాహుల్ గాంధీ ఆ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పార్లమెంటులో రాహుల్ గాంధీ స్పీచ్ కు ఎక్కువ వ్యూస్ అనేవి వచ్చాయని తమదే ఆధిపత్యం అని కాంగ్రెస్ పేర్కొంది.

మరోవైపు నరేంద్ర మోదీ: 

సోషల్ మీడియా ఫాలోవర్ల విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కంటే ప్రధాని మోదీ చాలా ముందున్నారు. ప్రధాని మోదీకి 90.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, గాంధీకి 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) రీసెర్చ్ ప్రకారం, X ప్లాట్‌ఫారమ్‌లోని PM అకౌంట్ కు గత మూడు నెలల్లో సుమారు 2.77 కోట్ల ఎంగేజ్‌మెంట్‌లు వచ్చాయి, అదే సమయంలో గాంధీ ఖాతాకు 58.23 లక్షల ఎంగేజ్‌మెంట్‌లు వచ్చాయి.

యూట్యూబ్‌లో 6.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ప్రధాని మోదీకి గత నెలలో 25.46 కోట్ల వ్యూస్ వచ్చాయి మరియు అదే సమయంలో గాంధీకి 4.82 కోట్ల వ్యూస్ వచ్చాయి. 

ఎలక్షన్ హడావిడి: 

ఎలక్షన్స్ సన్నాహాల సందర్భంగా ప్రజలు కూడా తమ ఓటు ఎవరికి వేయాలి అనే ఆలోచనలో పడ్డారు. ఇదే క్రమంలో అగ్ర పార్టీలుగా ఉన్న బిజెపి అలాగే కాంగ్రెస్ నాయకులు తమ వైపు నుంచి కొన్ని హామీలను చేయడం కూడా జరుగుతుంది. ఒకప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భాలలో ఉచిత వస్తువుల పంపిణీ హామీల గురించి అగ్ర పార్టీలు ఆలోచన పట్టినప్పటికీ, ప్రస్తుతం ఉచిత హామీల మీద కాకుండా అభివృద్ధి మీద దృష్టి ఎక్కువగా ఉంటుందని ప్రధాని మంత్రి స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రజలు, ఒకరు ఇచ్చే ఉచిత హామీలకు అలవాటు పడితే, దేశ అభివృద్ధి మీద ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు నరేంద్ర మోదీ.

మణిపూర్ గురించి మాట్లాడిన రాహుల్: 

ఇటీవల సుప్రీంకోర్టు ద్వారా ఊరట లభించిన రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానం గురించి పార్లమెంట్లో చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎలక్షన్లో సంగతి పక్కన పెడితే, ముఖ్యంగా మణిపూర్ విషయాల గురించి నరేంద్ర మోదీ నోరు మెదపటం లేదని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ ని మణిపూర్ అల్లర్లను చల్లార్చడానికి సిద్ధం చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన బీజేపీ నాయకుడు అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిస్వా, ఇండియన్ ఆర్మీ వల్ల మణిపూర్ లోని అల్లర్లు చల్లారే అవకాశం లేదని, 100 రోజులుగా జరుగుతున్న హింస ను ఆపేందుకు ఇండియన్ ఆర్మీ సరిపోదు అంటూ వాక్యానించారు. మణిపూర్ హింస గురించి మాట్లాడిన అస్సాం చీఫ్ మినిస్టర్, ఒకవేళ ఇండియన్ ఆర్మీ మణిపూర్ లో అడుగుపెడితే అది విద్వాంసానికి దారితీస్తుందంటూ, ప్రజల మీద బుల్లెట్లు వర్షం కురిపించి హింస ఆపడం తప్పిస్తే మరొకటి ఉండదు అంటూ రాహుల్ నిర్ణయాన్ని తిప్పికొట్టారు.