విజయవంతమైన WHO గ్లోబల్ సమ్మిట్

ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు డబ్ల్యూహెచ్‌ఓ సంయుక్తంగా ఏర్పాటు చేసిన WHO ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి భారత దేశంలో జరగబోయే మొదటి గ్లోబల్ సమ్మిట్, 2023 ఆగస్టు 17 మరియు 18 తేదీలలో భారతదేశంలోని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ట్రెడిషనల్ మెడిసన్ పై నిబద్ధత గురించి అదే విధంగా ఎవిడెన్స్ అలాగే లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి సమీకరించడానికి G20 ఆరోగ్య మంత్రివర్గ సమావేశంతో పాటు ఇది నిర్వహించబడిన్నట్లు సమాచారం. […]

Share:

ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు డబ్ల్యూహెచ్‌ఓ సంయుక్తంగా ఏర్పాటు చేసిన WHO ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి భారత దేశంలో జరగబోయే మొదటి గ్లోబల్ సమ్మిట్, 2023 ఆగస్టు 17 మరియు 18 తేదీలలో భారతదేశంలోని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ట్రెడిషనల్ మెడిసన్ పై నిబద్ధత గురించి అదే విధంగా ఎవిడెన్స్ అలాగే లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి సమీకరించడానికి G20 ఆరోగ్య మంత్రివర్గ సమావేశంతో పాటు ఇది నిర్వహించబడిన్నట్లు సమాచారం. గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలు వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సు అవసరాలను తీర్చడానికి నిర్వహించబడిన మొదటి సమ్మిట్.

 గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకతలు: 

గ్లోబల్ సమ్మిట్‌ను WHO అదే విధంగా 2023లో G20 అధ్యక్షత వహిస్తున్న భారత ప్రభుత్వం సహ-హోస్ట్ గా నిర్వహించడం జరిగింది. నార్మల్ ట్రెడిషన్ మెడిసన్ వర్కర్స్, వినియోగదారులు మరియు సంఘాలు, జాతీయ విధాన రూపకర్తలు, అంతర్జాతీయ సంస్థలు, సహా అన్ని వాటాదారులకు ఇది వేదికగా నిలిచింది. విద్యావేత్తలు, ప్రైవేట్ రంగం మరియు పౌర సమాజ సంస్థలు, ఆరోగ్యం మరియు స్థిరమైన అభివృద్ధికి ట్రెడిషనల్ మెడిసిన్ గురించిన మరింత సమాచారం, అదేవిధంగా, ట్రెడిషనల్ మెడిసన్ పై నిబద్ధత గురించి, ఎవిడెన్స్ అలాగే లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి సమీకరించడానికి G20 ఆరోగ్య మంత్రివర్గ సమావేశంతో పాటు నిర్వహించారు.

దాదాపు 40% ఫార్మసిటికల్ ప్రొడక్ట్స్ అనేవి నార్మల్ నాచురల్ ప్రోడక్ట్ బేసిస్ తో తయారు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే, ఆస్పిరిన్, ఆర్టెమిసినిన్ మరియు క్యాన్సర్ ట్రీట్మెంట్లతో సహా ట్రెడిషనల్ మెడిసిన్స్ నుంచి హెల్ప్ తీసుకోవడం జరిగింది. జన్యుశాస్త్రం మరియు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో సహా కొత్త పరిశోధనలు రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. మూలికా మందులు(హెర్బల్ మెడిసిన్), సహజ ఉత్పత్తులు, ఆరోగ్యం మరియు సంబంధిత ప్రయాణాల కోసం పరిశ్రమలు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం, 157 దేశాలలో సుమారు 97 సభ్య దేశాలు ట్రెడిషనల్ మెడిసిన్లు ఉపయోగిస్తున్నట్లు WHOకి నివేదించాయి. అయితే ట్రెడిషనల్ మెడిసన్ వాడకం వల్ల సురక్షితకు సంబంధించి, ఖర్చుకు సంబంధించి, అదే విధంగా సమానమైన ఉపయోగం కోసం విధానాలు, ప్రమాణాలు మరియు నియంత్రణను తెలియజేయడానికి కొన్ని ఎవిడెన్స్ అలాగే డేటాను ముందుగానే కలెక్ట్ చేశారు.

ఈ పెరిగిన గ్లోబల్ ఆసక్తి, ముఖ్యంగా డిమాండ్‌ చూసిన తర్వాత, WHO, భారత ప్రభుత్వ మద్దతుతో మార్చి 2022లో WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను నాలెడ్జ్ హబ్‌గా స్థాపించింది. WHO ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్ విషయంలో WHO యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆరు ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాలలో నిర్వహించబడే ఫంక్షణాలిటీ ప్రాసెస్, ప్రధాన WHO కార్యాలయాల ద్వారా జరుగుతున్నాయి. సమ్మిట్ థీమ్ గురించి చెప్పాలంటే, ఫార్మాట్, అంశాలు మరియు పరిష్కరించాల్సిన సమస్యలపై, క్రాస్-రీజనల్ నిపుణుల ప్యానెల్ ముఖ్యంగా చర్చించడం జరిగింది. 

ఆయుష్ శాఖ నిర్వహించిన సమ్మిట్: 

భారతీయ ట్రెడిషనల్ మెడిసిన్ కు సంబంధించిన మరిన్ని వ్యవస్థల సంఖ్యను మరింత విస్తరించేందుకు, ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను హైలైట్ చేస్తూ, నేపాల్, మలేషియా, ఖతార్, వెనిజులా మరియు క్యూబాలతో విజయవంతమైన సమావేశాలు జరిగాయి. ఆయుర్వేదం మరియు ఇతర ట్రెడిషనల్ మెడిసిన్ కు సంబంధించిన మరిన్ని వ్యవస్థలలో పరిశోధన, అభ్యాసాలు, విద్య మరియు శిక్షణపై ఉత్పాదక చర్చలను సులభతరం చేశాయి జరిగిన సమ్మిట్ సమావేశాలు. ఈ సమావేశాల ద్వారా, భారతదేశంతో సమావేశంలో పాల్గొన్న దేశాలకు, తమ వైపు నుంచి ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ లో వచ్చిన డెవలప్మెంట్ ను అందించడం కూడా ఈ సమ్మిట్ లో ఒక భాగం అంటూ సమావేశాలకు హాజరైన మినిస్టర్ సోనోవాల్ మాట్లాడారు.