భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 

ఆగస్టు 17వ తేదీన గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న మహాత్మా మందిర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టేడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆయుర్వేద దేవతగా భావించే ధన్వంతరీ పవిత్ర శ్లోకాలను వినిపించారు.  75 కి పైగా దేశాల వైద్య ప్రతినిధులు పాల్గొన్న ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ […]

Share:

ఆగస్టు 17వ తేదీన గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న మహాత్మా మందిర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టేడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆయుర్వేద దేవతగా భావించే ధన్వంతరీ పవిత్ర శ్లోకాలను వినిపించారు. 

75 కి పైగా దేశాల వైద్య ప్రతినిధులు పాల్గొన్న ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ ఇదే మొదటి సారి భారతదేశంలో జరగడం. ఈ గొప్ప కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, గుజరాత్ ముఖ్యమంత్రి భూపెంద్ర రజనీకాంత్ పటేల్ మరియు కేంద్ర ఆయుష్ మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర భాయ్ కళూ భాయ్ కూడా హాజరయ్యారు. 

డాక్టర్ టేడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తులసి భాయ్ అని నిక్ నేమ్ పెట్టారు అని వెల్లడించారు. ట్రెడిషనల్ మెడిసిన్ మానవత్వం అంత పురాతనమైనది ఇది కేవలం చరిత్ర కాదు, నేటి సమాజంలో కూడా విలువైనది అని ఆయన వెల్లడించారు. అలాగే భారతదేశం ట్రెడిషనల్ మెడిసిన్ కోసం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఆయన ప్రశంసించారు. ఈ చారిత్రాత్మక చొరవకు భారతదేశానికి అభినందనలు అని ఆయన అన్నారు. 

భవిష్యత్తులో జి 20 అధ్యక్ష పదవిలో ప్రత్యేక ఫోరం కోసం సిఫార్సులను ప్రతిపాదించడం ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. ఎయిమ్స్ సంస్థల్లో ప్రత్యేక ఆయుష్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయాలి అని తన ఉద్దేశాన్ని ఆయన ఈ సందర్భగా వెల్లడించారు. 

గుజరాత్ సీఎం రజనీకాంత్ పటేల్ మాట్లాడుతూ ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క ఆవశ్యకత ను మరియు ప్రధానికి దీనిపై ఉన్న నమ్మకం వలనే ఈ రోజు ఇన్ని దేశాలను అనుసంధానం చేసే కార్యక్రమం నిర్వహించడానికి కారణం అయ్యింది అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చొరవ వలనే ఈ రోజు మొట్ట మొదటి ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది అని అన్నారు. 

దేశ నిర్మాణానికి మహాత్మా గాంధీ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ మాండ్వియా గుర్తు చేసుకున్నారు. ఫార్మా మరియు కాస్మొటిక్ పరిశ్రమలు రెండిటికీ ప్రయోజనం చేకూర్చే ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా భారతదేశం మరగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. 170 కి పైగా దేశాలు ట్రెడిషనల్ మెడిసిన్ ను ఉపయోగిస్తున్నారు అని అంతర్జాతీయ సహకారానికి మరియు ఉత్తమ పద్ధతుల మార్పిడికి ఈ సమ్మిట్ వేదికగా నిలుస్తోంది అని ఆయన అన్నారు. 

ఈ సమ్మిట్ లో ఆరు ప్రాంతాల నుండి సేకరించిన సంప్రదాయ ఔషద మొక్కల ఎగ్జిబిషన్ ను కూడా WHO ప్రతినిధులు సందర్శించారు. ‘ ఆయుష్ ఫర్ ప్లానెటరీ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ‘ అనే కార్యక్రమం విద్యా , ఆరోగ్య సంరక్షణ, ప్రజల ఆరోగ్య రీసెర్చ్ లో ఆయుష్ మంటిత్వ శాఖ సాధించిన విజయాలను గుర్తించింది. ఆయుర్వేదంలో ఉపయోగించే మొక్కల ఎగ్జిబిషన్ ఈ సమ్మిట్ లో ప్రధానమైన ఆకర్షణ గా నిలిచింది. ఈ మొక్కలను ఉపయోగించి మెడిసిన్ తయారు చేయడం వలన ఎటువంటి వ్యర్థ పదార్థాలు ఉండవు అని వారు తెలిపారు.