అదానీ షెల్ కంపెనీలో 20000 కోట్లు ఎవరివి? రాహుల్ గాంధీ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెబుతుందా?

బీజేపీ నేతలు చెప్పిన మాటలే ఎందుకు అడుగుతున్నారని విలేఖరులకు కౌంటర్ ఇచ్చిన రాహుల్ కాంగ్రెస్ పార్టీ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తోందన్న భారతీయ జనతా పార్టీ ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. గౌతమ్ అదానీ వ్యవహారం విషయంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. గౌతమ్ అదానీ డొల్ల కంపెనీలలోని వేల కోట్ల షేర్లు గురించి ఎవరు మాట్లాడరేంటి అంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.. ఆ డొల్ల కంపెనీలో 20000 కోట్లు ఎవరు పెట్టుబడులు పెట్టించారు.. ఆ […]

Share:

బీజేపీ నేతలు చెప్పిన మాటలే ఎందుకు అడుగుతున్నారని విలేఖరులకు కౌంటర్ ఇచ్చిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తోందన్న భారతీయ జనతా పార్టీ ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. గౌతమ్ అదానీ వ్యవహారం విషయంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. గౌతమ్ అదానీ డొల్ల కంపెనీలలోని వేల కోట్ల షేర్లు గురించి ఎవరు మాట్లాడరేంటి అంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.. ఆ డొల్ల కంపెనీలో 20000 కోట్లు ఎవరు పెట్టుబడులు పెట్టించారు.. ఆ డబ్బు ఎవరివని రాహుల్ గాంధీ ప్రశ్నించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల తుది జాబితాను నిర్ణయించడానికి ఆయన ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయానికి రాగా అక్కడే మీడియాతో మాట్లాడారు.. 

రాహుల్ గాంధీ విమర్శలు..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రధాన నరేంద్ర మోదీ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్తున్న సమయంలో ఆయన మీడియాతో సమావేశమయ్యారు.. న్యాయవ్యవస్థ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ శ్రేణులతో సోమవారం సూరత్ కోర్టుకు వెళ్లారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి ఆయనను ప్రశ్నించారు. 

20వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి..?

అదానీ షెల్‌ కంపెనీలకు చేరిన రూ.20వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని.. ఈ సొమ్ము ఎవరిదని… కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. మోదీ సర్కార్‌ ను ప్రశ్నించారు. అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్‌ కాంగ్రెస్‌ కార్యాలయానికి వచ్చారు.. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్‌ ఒత్తిడి తీసుకొస్తున్నదన్న బీజేపీ ఆరోపణలపై స్పందించాలని విలేఖర్లు కోరగా.. “బీజేపీ చెప్పిన విషయాల గురించి ఎందుకు అడుగుతున్నారు? అదానీ షెల్‌ కంపెనీల్లో రూ.20వేల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయన్నది నా ప్రశ్న. దీనికి సమాధానం కావాలి” అని అన్నారు రాహుల్ గాంధీ..

వాళ్లు వేసిన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?

కాగా బీజేపీ నేతలు చెప్పిన మాటలే ఎందుకు అడుగుతున్నారని రాహుల్ విలేఖరులకు కౌంటర్ వేశారు.. “మీరు బీజేపీ చెప్పింది ఎందుకు ప్రతిసారి అడుగుతున్నారు?” అంటూ రాహుల్ గాంధీ వాళ్ళని నిలదీశారు. “అదానీకి చెందిన షెల్ కంపెనీలో 20000 కోట్లు ఎవరివి? ఆయన ఎవరి బినామీ” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై నరేంద్ర మోదీ  ఎందుకు స్పందించడం లేదని రాహుల్ గాంధీ తీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోని వెనుకబడిన వర్గాలను మీడియాను అవమానించడం రాహుల్ గాంధీ మనస్తత్వమని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.. అహంకార రాజవంశం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంపై రాహుల్ గాంధీ మళ్ళీ దాడి చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీజేపీ నేతలు రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు..

 దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తరచూ దాడి చేసే ధైర్యంతో అతను తన నానమ్మ అడుగుజాడల్లో నడుస్తున్నాడు.. అని రాహుల్ గాంధీపై బీజేపీ ప్రధాన అధికారిక ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు అనిల్ బులాని ట్వీట్ చేశారు. రాహుల్ ది దురహంకార వంశం అని బీజేపీ జాతీయా అధికార ప్రతినిధి పూనంవాలా అన్నారు. ఇటీవల మీడియా సమావేశంలో రాహుల్ గాంధీని ఓబీసీలను మోదీ  ఇంటి పేరుతో అవమానించారన్నా బీజేపీ ఆరోపణ గురించి అడిగిన తరువాత ఆయన జర్నలిస్టును చులకన చేయటం వివాదాస్పదంగా మారింది.  ఇప్పటికే రెండుసార్లు కాన్ఫరెన్స్ లో తనను ఈ ప్రశ్న అడిగారని రిపోర్టర్ బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపిస్తూ, జర్నలిస్టులా నటించవద్దని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ, అదానీ షెల్‌ కంపెనీ,  అదానీ షెల్‌ కంపెనీ 20వేల కోట్లు