అసలెవరీ  ప్రేమోదయ్ ఖాఖా..

ఢిల్లీలో ఓ మైనర్ బాలికను ప్రభుత్వ అధికారి రేప్ చేయడం సంచలనం సృష్టించింది. మైనర్ బాలిక అని తెలిసి కూడా అతడు ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక్కడ మరింత ఘోరమైన విషయం ఏమిటంటే.. ఇతడు ఇలా చేయడంతో ఆ అమ్మాయి గర్భం దాల్చగా.. నిందితుడి భార్యతో కలిసి నిందితుడు ఆమెకు గర్భ నిరోధక మాత్రలు ఇచ్చాడు. ఒక మహిళ అయి ఉండి నిందితుడి భార్య మరో మహిళ పట్ల ఇలా చేయడం దారుణమని అంతా […]

Share:

ఢిల్లీలో ఓ మైనర్ బాలికను ప్రభుత్వ అధికారి రేప్ చేయడం సంచలనం సృష్టించింది. మైనర్ బాలిక అని తెలిసి కూడా అతడు ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక్కడ మరింత ఘోరమైన విషయం ఏమిటంటే.. ఇతడు ఇలా చేయడంతో ఆ అమ్మాయి గర్భం దాల్చగా.. నిందితుడి భార్యతో కలిసి నిందితుడు ఆమెకు గర్భ నిరోధక మాత్రలు ఇచ్చాడు. ఒక మహిళ అయి ఉండి నిందితుడి భార్య మరో మహిళ పట్ల ఇలా చేయడం దారుణమని అంతా అంటున్నారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

స్నేహితుడి కూతురే..   

ప్రేమోదయ్ ఖాఖా ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టింది తన స్నేహితుడి కుమార్తె మీదనే కావడం గమనార్హం. స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతడి కూతురు బాగోగులు చూసుకుంటానని తీసుకెళ్లిన ప్రేమోదయ్ ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఆమె మధ్యలో ఒకసారి గర్భం దాల్చడంతో నిందితుడి భార్య, అతడు కలిసి ఆ బాలికకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చారు.

వెల్ఫేర్ ఆఫీసర్ అయి ఉండి..

ఇంతటి దారుణానికి ఒడి గట్టిన ప్రేమోదయ్ ఖాఖా ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు 1998లో ఢిల్లీ ప్రభుత్వంలో వెల్ఫేర్ ఆఫీసర్‌గా నియమితుడయ్యాడు. అతను గత 25 సంవత్సరాలుగా స్త్రీ, శిశు సంక్షేమం మరియు సాంఘిక సంక్షేమ శాఖలలో పనిచేశాడు. ప్రేమోదయ్ సోషల్ మీడియా ప్రొఫైల్‌లు మరియు అధికారిక పత్రాల ప్రకారం, బలహీన సమూహాలు మరియు పిల్లల హక్కులు మరియు సంక్షేమం గురించి కూడా అతడు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రేమోదయ్ లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అతడి ప్రొఫైల్ లో ఉన్న కోట్స్ ను మనం కనుక చూస్తే ఇతను ఎంత పెద్ద మానవ మూర్తి అని తప్పకుండాఅనుకుంటాం. మానవత్వాన్ని రక్షించడానికి సంబంధాలను నిర్మించడమే  లక్ష్యంగా పెట్టుకున్నట్లు అతడి ప్రొఫైల్ ఉంది. 

వామ్మో ఇదేం ప్రొఫైల్

ఇంత దారుణానికి ఒడిగట్టిన ప్రేమోదయ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలగక మానదు. అతడి ప్రొఫైల్ లో పిల్లల రక్షణ, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం మరియు లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే చట్టంపై రిసోర్స్ ట్రైనర్ అని రాసుకున్నాడు. చెప్పేవి శ్రీ రంగ నీతులు చేసేవి చిల్లర పనులు అనే సామెత ప్రేమోదయ్ విషయంలో సరిగ్గా సరిపోతుందని అంతా కామెంట్ చేస్తున్నారు. 

అప్పుడు సూపరింటెండెంట్

సంచలనం క్రియేట్ చేసిన ఢిల్లీ నిర్భయ కేసులో మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నపుడు ప్రేమోదయ్ జువైనల్ హోం సూపరింటెండెంట్ గా ఉన్నాడు. ఆ ఘటన చూసైనా మనోడు మారలే అని అంతా అంటున్నారు. మార్చి 2022లో, ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోట్ అభ్యర్థన మేరకు, అతను మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖలో తన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా నియమించబడ్డాడు. ఇన్ని దారుణాలు చేసే వ్యక్తి స్పెషల్ ఆఫీసరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  2023 మార్చిలో అతిషి ఈ మంత్రిత్వ శాఖను స్వీకరించినప్పుడు, ప్రేమోదయ్ పదవి నుంచి తొలగించబడ్డాడు. 

అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో…

ఎవరైనా ఏదో తెలియక క్షణికావేశంలో నేరాలు చేస్తుంటారు. కానీ ప్రేమోదయ్ ఖాఖా మాత్రం నేరం చేసినపుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరియు సోమవారం సస్పెండ్ చేయడానికి ముందు మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్‌లో ఉన్నారు. ప్రేమోదయ్ ఖాఖా జార్ఖండ్‌లోని హజీరాబాగ్‌కు చెందినవాడు మరియు ఉత్తర ఢిల్లీలోని బురారీలోని శక్తి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నాడు. అతడు అక్కడే మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అనేక సార్లు ఆమె మీద అత్యాచారం చేశాడు. POCSO యాక్ట్ కింద ఖాఖా తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు.