జగదీష్ శెట్టర్ ఎవరు, బీజేపీని ఎందుకు వదులుకున్నారు?

మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు ప్రముఖ లింగాయత్‌లు బీజేపీ నుండి వెళ్ళిపోయినట్టయింది. అటు మాజీ సీఎం యడ్యూరప్ప ఇప్పటికే ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగగా, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి..  కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు హుబ్బళ్లి- ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేయనున్నారు. అసలు జగదీష్ శెట్టర్ ఎవరు? జగదీష్ శివప్ప […]

Share:

మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు ప్రముఖ లింగాయత్‌లు బీజేపీ నుండి వెళ్ళిపోయినట్టయింది. అటు మాజీ సీఎం యడ్యూరప్ప ఇప్పటికే ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగగా, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి..  కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు హుబ్బళ్లి- ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేయనున్నారు.

అసలు జగదీష్ శెట్టర్ ఎవరు?

జగదీష్ శివప్ప షెట్టర్.. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకులలో ఒకరు. హుబ్బల్లి ధార్వాడ్ నియోజకవర్గంలోని లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతని తండ్రి.. SS షెట్టర్ అప్పటి జన్ సంఘ్ పార్టీ నుండి హుబ్బల్లి – ధార్వాడ్ మేయర్ మరియు నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు.

1994లో జగదీష్ షెట్టర్ తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో కీలక పదవుల్లో కొనసాగించారు. 2012 – 2013 మధ్య కాలంలో BS యడియూరప్ప సీఎం పదవి నుండి వైదొలగవలసి వచ్చినప్పుడు.. జగదీశ్ శెట్టర్ కర్ణాటక 15వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ముందే తాను 2008లో కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. తర్వాత ఆయన అప్పటి బీజేపీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సదానంద గౌడ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పని చేశారు. 

జగదీష్ షెట్టర్ బీజేపీని ఎందుకు వీడవలసివచ్చింది?

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా పని చేశారు. బీజేపీ పార్టీ తరపున పలు కీలక పదవుల్లో పనిచేసిన.. జగదీశ్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

అయితే.. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసినప్పుడు రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలకు బీజేపీ టిక్కెట్లు నిరాకరించింది. టిక్కెట్టు నిరాకరించిన సీనియర్‌ సభ్యుల్లో శెట్టర్‌ కూడా ఒకరు. దీంతో అసంతృప్తి చెందిన ఆయన.. కారణాలు తెలుసుకోవడానికి హైకమాండ్‌తో సమావేశమయ్యారు. అందుకు సమాధానమిచ్చిన బీజేపీ హైకమాండ్.. ఆయనకు న్యూఢిల్లీలో కీలక పదవితో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి శాసనసభ టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే.. హుబ్బళ్లి- ధార్వాడ సెంట్రల్ టికెట్ విషయంలో ఆయన పట్టుదలతో ఉండటంతో..  బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ తిరస్కరించారు. అదే పట్టుదలతో ఉన్న బీజేపీ పెద్దలు కూడా అతని షరతులపై అంగీకరించలేదు. అయితే హుబ్బళ్లి- ధార్వాడ సీట్ తనకు కావాలని కాంగ్రెస్ పార్టీని కోరిన శెట్టర్.. ఆ పార్టీ అంగీకరించడంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు

మరోవైపుమాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడికి కూడా బీజేపీ టికెట్ నిరాకరించడంతో నిరాశ చెందిన ఆయన కూడా పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాగా.. జగదీశ్ శెట్టర్‌పై బీజేపీ ఇంకా అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇంకా బీజేపీ ఉంది ఎవరు పోటీ చేస్తారో అని ఆ నియోజకవర్గ ఓటర్లతో పాటు, రాష్ట్ర రాజకీయ విశేషకులు కూడా ఎదురు చేస్తున్నారు. మరోవైపు ప్రముఖ పార్టీలన్నీ ఇప్పటి నుండే ప్రచారం మొదలెట్టాయి.

అయితే.. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవడానికి మే 13 వరకు ఆగాల్సిందే.

Tags :