సతీమాత కథ తెలుసుకుందాం రండి.. 

సతీసహగమనం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు సతీసహగమనం ఒక ఆచారంగా భావించి ప్రతి గ్రామంలోని కూడా చనిపోయిన తన భర్తతో సహా భార్య కూడా మంటల్లో కాలిపోవాలి. ఈ ఆచారాన్ని ఆపేందుకు చాలామంది కదం తొక్కారు.  ముఖ్యంగా రాజస్థాన్‌లో ఒకప్పుడు ప్రబలంగా ఉన్న సతి ఆచారం, ప్రతి గ్రామంలోని కూడా చనిపోయిన తన భర్తతో సహా భార్య కూడా మంటల్లో కాలిపోవాలి. రాచరికం సమయంలో ఇటువంటి ఆచారాలు సహజంగా జరుగుతూ ఉండేది, ముఖ్యంగా భర్త యుద్ధంలో […]

Share:

సతీసహగమనం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు సతీసహగమనం ఒక ఆచారంగా భావించి ప్రతి గ్రామంలోని కూడా చనిపోయిన తన భర్తతో సహా భార్య కూడా మంటల్లో కాలిపోవాలి. ఈ ఆచారాన్ని ఆపేందుకు చాలామంది కదం తొక్కారు. 

ముఖ్యంగా రాజస్థాన్‌లో ఒకప్పుడు ప్రబలంగా ఉన్న సతి ఆచారం, ప్రతి గ్రామంలోని కూడా చనిపోయిన తన భర్తతో సహా భార్య కూడా మంటల్లో కాలిపోవాలి. రాచరికం సమయంలో ఇటువంటి ఆచారాలు సహజంగా జరుగుతూ ఉండేది, ముఖ్యంగా భర్త యుద్ధంలో లేదా కరువులో చనిపోతే, భార్య కూడా భర్తతో సహా చనిపోవాల్సి ఉండేది. అయితే, నాగౌర్‌లోని అకాల గ్రామంలో జరిగిన ఒక విశేషమైన సంఘటన భిన్నమైన కథనాన్ని అందరికీ పరిచయం చేసింది. 

సతీ మాత ఎవరు?: 

దుండగుల భారీ నుండి రక్షించడానికి, సాంప్రదాయ సతీ పద్ధతిని ఎదిరించి తనను తాను త్యాగం చేసి ఆత్మగౌరవాన్ని ప్రదర్శించింది ఒక మహిళ. ఈ సంఘటన చారిత్రక కట్టుబాటును తిప్పికొడుతూ, ప్రత్యేకమైన బంధాన్ని మరియు పరస్పర త్యాగాన్ని నొక్కి చెబుతుంది.

సుమారు 500 సంవత్సరాల క్రితం, ఆకాల గ్రామంలో, ఒక అనుకోని సంఘటన వెలుగులోకి రావడం జరిగింది. కథనం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు బావ మరదలు కలిసి, వాళ్ళ గ్రామానికి చేరుకుంటున్నా సమయంలో, వారి మీద దాడి చేస్తారు దుండగులు. అయితే దాడి నుంచి ఆ అమ్మాయిని తప్పించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్న ఆమె బావ ప్రాణాలు కోల్పోతాడు.

ఆమె వేడుకున్నప్పటికీ, దుండగులు చాలా క్రూరంగా తన బావ మీద దాడి చేశారు. అయితే తరువాత జరిగిన విషయం ఏమిటంటే, బావని చంపినందుకు అంతే కాకుండా తన ఆత్మగౌరవాన్ని మరియు తన బావ త్యాగాన్ని మసకబారనివ్వకూడదని నిర్ణయించుకుంది. ధైర్యంగా, ఆమె గ్రామస్థుల నుండి కట్టలు సేకరించి, తన బావను చితిలో తగులబెట్టి, ఆ తర్వాత తాను కూడా ఆ చితిలోనే ఆహుతి అయిపోయింది. మనసులో భక్తితో మృత్యువులో తన బావతో కలిసిపోయింది. నేటికీ ఆ గ్రామంలో ఆమె మరణ అనంతరం సతీ మాతగా గౌరవించబడుతుంది.

గ్రామస్థుడైన మదన్‌లాల్ ప్రకారం, సతీదేవిగా మారిన ఆమె ప్రదర్శించిన సాహసోపేతమైన ఆత్మగౌరవం, నిజానికి పవిత్ర స్థలం స్థాపనకు దారితీసింది. గ్రామస్తులు ఏకమై ఆమె గౌరవార్థం ఒక వేదికను నిర్మించారు అయితే అది కాలక్రమేణా అది ప్రార్థనా స్థలంగా మారింది. అక్కడ దైవశక్తి ఉందని చాలా మంది నమ్ముతారు. ఇంకా చెప్పాలంటే, ఈ ప్రాంతం చుట్టూ నడవడం వల్ల శరీరంలోని మొటిమలను నయం చేయవచ్చని చెప్పబడింది. ప్రసాదం యొక్క నైవేద్యంగా, ప్రజలు సతీ మాతకు బూరి, చీపురు వంటి వస్తువులను ఇస్తారు. ఆమె కథ గ్రామస్తులు చాలా గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా సమస్యలతో ఉన్నవారు సతిమాత గుడికి వెళితే సమస్య తీరుతుందని భావిస్తారు.

సతి అనేది కొన్ని హిందూ సమాజాలలో కనిపించే ఒక ఆచారం, భర్త చనిపోయిన అనంతరం భార్య కూడా తన భర్తతో పాటు తన ఇష్ట పూర్వకంగానో లేకపోతే గ్రామస్తుల ఒత్తిడి కారణంగా, భర్త చితి మంటలలో చనిపోవాల్సి ఉంటుంది. లేదంటే భర్త సమాధి పక్కనే భార్య కోసం సమాధి కట్టించి, భార్య కూడా భర్తతో చనిపోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి ఆచారాలు లేనప్పటికీ, అక్కడక్కడ కొన్ని గ్రామాలలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న కొన్ని ఆచారాలు అయితే పాటించడం జరుగుతోంది. ప్రస్తుతం ఇటువంటి ఆచారాలు చర్చనీయంగా మారుతున్నాయి. ఒకప్పుడు సతీసహగమనాన్ని నివారించడానికి ఎంతోమంది పుణ్యాత్ములు పోరాడాల్సి వచ్చింది.