ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన వాట్సాప్ ప్రైవసీ ఫీచర్లు..

భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ యాప్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. 400 మిలియన్లకు పైగా భారతీయులు వాట్సాప్ యాప్‌ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రతి రోజు మెసేజ్ చేయడం ద్వారా, వీడియోలు పంపడం ద్వారా ఇంకా పలు విధాలుగా ఉపయోగిస్తున్నందున వాట్సాప్ ముందంజలో ఉంది. అనేక సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్ ఎన్నో వినూత్న ఫీచర్లను ప్రారంభించింది, డిఫాల్ట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అన్ని సందేశాలను […]

Share:

భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ యాప్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.

400 మిలియన్లకు పైగా భారతీయులు వాట్సాప్ యాప్‌ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రతి రోజు మెసేజ్ చేయడం ద్వారా, వీడియోలు పంపడం ద్వారా ఇంకా పలు విధాలుగా ఉపయోగిస్తున్నందున వాట్సాప్ ముందంజలో ఉంది. అనేక సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్ ఎన్నో వినూత్న ఫీచర్లను ప్రారంభించింది, డిఫాల్ట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అన్ని సందేశాలను కాపాడటంతో పాటు,  ఇక్కడ ప్రైవసీకి ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఈ సంవత్సరం థీమ్‌కి అనుగుణంగా, మార్చి 8న ప్రతి ఒక్కరికీ ప్రైవసీ ప్రైవేట్‌గాను, సురక్షితంగాను ఉండేలా ‘డిజిట్ ఆల్: ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ’, అనే ఒక ఫీచర్‌ను అందిస్తోంది. ముఖ్యంగా నేటి డిజిటల్ ప్రపంచంలోని మహిళల కోసం.

ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన కొన్ని అత్యంత ముఖ్యమైన వాట్సాప్ ప్రైవసీ ఫీచర్లు ఇక్కడ మీ కోసం:

రెండు-దశల ధృవీకరణ (టు స్టెప్ వెరిఫికేషన్): ఈ ఫీచర్ మీ అకౌంటుకి ఒక అదనపు భద్రతను అందిస్తుంది. మీరు గనక ఈ టు స్టెప్ వెరిఫికేషన్ ప్రారంభించినట్లయితే, మీ అకౌంటుకి లాగిన్ చేసేటప్పుడు మీ ఫోన్ నంబర్ ఇంకా పాస్‌వర్డ్‌తో పాటు ఒక ఆరు అంకెల పాస్‌కోడ్‌ను ఎంటర్  చేయమని మిమ్మల్ని అడుగుతుంది.

బ్లాక్ చేయడం ఇంకా రిపోర్ట్ చేయడం: ఎవరైనా మీకు తప్పుడు విషయాలను, లేదా అసభ్యకర సందేశాలను మెసేజ్ చేస్తున్నా లేదా మిమ్మల్ని వేధిస్తున్నా మీరు వారిని బ్లాక్ చేయవచ్చు లేదా రిపోర్ట్ చేయవచ్చు. వారి ప్రొఫైల్‌కు వెళ్లి, “బ్లాక్ “ని ఎంచుకుని, ఆపై వారిని రిపోర్ట్ చేయాలా వద్దా అనే విషయాన్ని ఎంచుకోండి.

మీ ప్రొఫైల్ పిక్చర్‌ ఎవరు చూడవచ్చనే దాన్ని నియంత్రించండి: మీరు సెట్టింగ్స్ > అకౌంట్ > ప్రైవసీ > ప్రొఫైల్ ఫోటోకు వెళ్లడం ద్వారా మీ ప్రొఫైల్ పిక్చర్ ఎవరు చూడవచ్చు లేదా ఎవరు చూడకూడదు అనేదానిని మీరు ఎంచుకోవచ్చు. మీరు దీన్ని మీ కాంటాక్ట్స్‌లోని వారికి లేదా ఎవరికీ కనిపించకుండా కూడా సెట్ చేయవచ్చు.

మీ ‘లాస్ట్ సీన్’ ఎప్పుడు కూడా ఎవరు చూడవచ్చా లేదా అని నియంత్రించడం: మీరు సెట్టింగ్స్ > అకౌంట్ > ప్రైవసీ > లాస్ట్ సీన్  ని ఎంచుకోవడం ద్వారా మీరు చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నది ఎప్పుడనేది ఎవరు చూడవచ్చో లేదో కూడా ఎంచుకోవచ్చు. మీరు దీన్ని ప్రతి ఒక్కరికీ లేదా మీ కాంటాక్ట్స్‌లోని వారికి లేదా ఎవరికీ కనిపించకుండా కూడా సెట్ చేయవచ్చు.

కొంతమందికి మీ స్టేటస్ కనిపించకుండా హైడ్ చేయడం: కొంతమందికి మీ స్టేటస్ కనిపించకుండా మీ స్టేటస్ అప్డేట్స్ చూడకూడదనుకుంటే, మీరు వారి నుండి మీ స్టేటస్ హైడ్ చేయవచ్చు. సెట్టింగ్స్ > అకౌంట్ > ప్రైవసీ > స్టేటస్ కి వెళ్లి, “ఓన్లీ షేర్ విత్” అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు.

చాట్‌లను మ్యూట్ చేయడం: మీరు నిర్దిష్ట చాట్ నుండి తప్పైన మెసేజ్ లు లేదా నోటిఫికేషన్‌లను రిసీవ్ చేసుకున్నట్లయితే, మీరు చాట్‌ను మ్యూట్ చేయవచ్చు. చాట్‌ని ఓపెన్ చేసి, మ్యూట్ చేయాలనుకొనే చాట్ పేరుపై నొక్కి, “మ్యూట్ నోటిఫికేషన్స్” అనే ఆప్షన్ సెట్ చేయవచ్చు.

మీ చాట్స్ ని బ్యాకప్ చేయడం: మీరు ఫోన్‌ మార్చుకున్నా లేదా అనుకోకుండా మీ వాట్సాప్  అకౌంట్ తొలగించినా ఇబ్బంది లేకుండా ఉండటానికి మీ చాట్స్ బ్యాకప్ చేయడం చాలా ముఖ్యం. దీనిని చేయడానికి మీరు సెట్టింగ్స్ > చాట్స్ > చాట్ బ్యాకప్‌ సెలెక్ట్ చేస్తే మీ చాట్స్ ని బ్యాకప్ చేయవచ్చు.

మొత్తంమీద, ఈ ప్రైవసీ ఫీచర్‌లు మహిళలు తమ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం కోసం సహాయపడతాయి. తద్వారా మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు సురక్షితంగా ఉంటారు.