రూ.200 కోట్ల కుంభకోణం.. నోరా ఫ‌తేహి ఏం చెప్పింది?

బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫ‌తేహి ఢిల్లీలోని ప‌టియాలా హైకోర్టులో హాజ‌ర‌య్యారు. మ‌రో బాలీవుడ్ న‌టి జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌పై వేసిన ప‌రువు న‌ష్టం దావా కేసులో భాగంగా వాద‌న‌లు వినేందుకు నిన్న ఆమె ప‌టియాలా హైకోర్టుకు వెళ్లారు. అస‌లు నోరా ఫ‌తేహి.. జాక్వెలీన్‌పై ఎందుకు దావా వేయాల్సి వ‌చ్చింది?  సుఖేష్ చంద్ర శేఖ‌ర్ అనే వ్య‌క్తి కార‌ణంగా నోరా ఫ‌తేహి, జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌లు ఇరుక్కున్నారు. అత‌ను ప్ర‌స్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్నాడు. ఇత‌ను రూ.200 […]

Share:

బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫ‌తేహి ఢిల్లీలోని ప‌టియాలా హైకోర్టులో హాజ‌ర‌య్యారు. మ‌రో బాలీవుడ్ న‌టి జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌పై వేసిన ప‌రువు న‌ష్టం దావా కేసులో భాగంగా వాద‌న‌లు వినేందుకు నిన్న ఆమె ప‌టియాలా హైకోర్టుకు వెళ్లారు. అస‌లు నోరా ఫ‌తేహి.. జాక్వెలీన్‌పై ఎందుకు దావా వేయాల్సి వ‌చ్చింది? 

సుఖేష్ చంద్ర శేఖ‌ర్ అనే వ్య‌క్తి కార‌ణంగా నోరా ఫ‌తేహి, జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌లు ఇరుక్కున్నారు. అత‌ను ప్ర‌స్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో శిక్ష అనుభ‌విస్తున్నాడు. ఇత‌ను రూ.200 కోట్ల వ‌ర‌కు దోపిడీకి పాల్ప‌డ్డాడు. పెద్ద పెద్ద పేరున్న వారి దగ్గ‌ర సీఎం కొడుకుని, మ‌న‌వ‌డిని అని చెప్పి కోట్లు కాజేసాడు. మోస‌పోయిన వారిలో బ‌డా వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు కూడా ఉన్నారు. 17 ఏళ్ల వ‌య‌సు నుంచే సుఖేష్ పేర్లు మార్చుకుంటూ దోపిడీల‌కు పాల్ప‌డుతున్నాడు. అలా అత‌ను రెండేళ్ల క్రితం రూ.200 కోట్ల దోపిడీ కేసులో దొరికిపోయాడు.

మరి సుఖేష్‌కి నోరా, జాక్వెలీల్‌ల‌కు సంబంధం ఏంటంటే.. సుఖేష్‌.. త‌న‌కు బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సౌత్ ఇండ‌స్ట్రీలో పెద్ద పెద్ద వారితో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని, టాలీవుడ్‌లో ఓ భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టించే ఛాన్స్ ఇప్పిస్తాన‌ని చెప్పి జాక్వెలీన్‌తో ఫ్రెండ్షిప్ చేసాడు. ఆ స్నేహం కాస్తా ప్రేమ‌గా మారింది. అలా సుఖేష్ జాక్వెలీన్‌కు ఖ‌రీదైన కార్లు, బంగ్లా, వాచీల‌ను కానుకలుగా ఇచ్చేవాడు. అవ‌న్నీ నిజ‌మే అనుకుని పాపం జాక్వెలీన్ అత‌నిపై ఇష్టం పెంచుకుంది. అలా ఇద్ద‌రూ కొంత‌కాలం పాటు ప్రేమించుకున్నారు. వారిద్ద‌రి పర్స‌న‌ల్ ఫొటోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి.

దాంతో పాపం జాక్వెలీన్ ప‌రువు మొత్తం పోయింది. అతన్ని న‌మ్మి బాలీవుడ్ కెరీర్‌ని వ‌దిలేసి పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకుంది. కానీ ఆమె ఆశ‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. సుఖేష్ ఓ పెద్ద మోస‌గాడు అని తెలిసి ఎంతో బాధ‌ప‌డింది. అయితే సుఖేష్‌పై విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో జాక్వెలీన్ పేరు కూడా బ‌య‌టికి రావ‌డంతో పోలీసులు ఆమెను కూడా కొన్ని రోజుల పాటు రిమాండ్‌కు త‌ర‌లించారు. ఆ స‌మ‌యంలో జాక్వెలీన్ నోరా ఫ‌తేహి గురించి పోలీసుల‌కు చెప్పారు. నోరా ఒక గోల్డ్ డిగ్గ‌ర్ అని సుఖేష్‌తో ఆమెకు మంచి స్నేహం ఉంద‌ని తెలిపింది. ఈ వార్త‌లు కాస్తా బ‌య‌టికి రావ‌డంతో పోలీసులు నోరాను కూడా పిలిపించి విచార‌ణ చేయాల్సి వ‌చ్చింది.

దాంతో నోరా జాక్వెలీన్‌పై ప‌రువు న‌ష్టం దావా కేసు వేసింది. జాక్వెలీన్ సుఖేష్ క‌లిసి తిరిగి చివ‌రికి త‌న‌ను బ‌లి ప‌శువుని చేసార‌ని, న‌లుగురిలో త‌ల‌దించుకునేలా చేసార‌ని కోర్టులో వాపోయింది. సెక్ష‌న్ 164 కింద నోరా త‌న స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసారు. ఈ కేసులోకి త‌న‌ను లాగ‌డం వ‌ల్ల ఎన్నో అవ‌కాశాలు కోల్పోయాన‌ని మానసికంగా ఎంతో కుమిలిపోయాన‌ని నోరా కోర్టులో చెప్పారు. అస‌లు సుఖేష్ ఎవ‌రో కూడా త‌న‌కు తెలీద‌ని, సంబంధం లేని కేసులోకి త‌న‌ను ఎలా లాగుతార‌ని మండిప‌డ్డారు. ఓ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్ల‌గానే త‌న గురించి తప్పుడు వార్తలు రావ‌డం మొద‌ల‌య్యాయ‌ని దీనిని బ‌ట్టి చూస్తే త‌ప్పుడు కేసులోత‌న‌ని ఇరికించ‌డం కోస‌మే ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆహ్వానించిన‌ట్లు క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు.

త‌న ఎనిమిదేళ్ల పేరు ప్ర‌తిష్ఠ‌ల‌ను పాడుచేసార‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. త‌న‌కు జరిగిన న‌ష్టాన్ని భరించి త‌న‌కు రూ.100 కోట్లు ఇవ్వాల్సిందేన‌ని నోరా కోర్టులో డిమాండ్ చేసారు. త‌న వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అనంత‌రం నోరా వెంట‌నే ముంబై బ‌య‌లుదేరి వెళ్లిపోయారు. ఇక ప‌టియాలా హై కోర్టు ఏమ‌ని తీర్పు వెలువ‌రిస్తుందో వేచి చూడాలి.