Gaganyaan: సాంకేతిక లోపంతో నిలిచిన ఇస్రో గగన్‌యాన్‌ ప్రయోగం

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో(ISRO)కి అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్‌(Gaganyan) ప్రయోగంలో సాంకేతిక లోపం వచ్చినట్లు తెలిసింది. చంద్రయాన్-3 విజయంతో ఊపు  మీదున్న ఇస్రో(ISRO).. అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లడమే లక్ష్యంగా గగన్‌యాన్‌(Gaganyaan)  ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇస్రో కీలక పరీక్షలు నిర్వహిస్తోంది. గగన్‌యాన్‌ కోసం పీడ‌నం లేని క్రూ మాడ్యూల్‌లోనే వ్యోమ‌గాములు(Astronauts) నింగిలోకి వెళ్తారు. ప్ర‌స్తుతం టెస్టింగ్ కోసం ఆ మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, మ‌ళ్లీ భూమి పైకి సురక్షితంగా చేరేలా ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో. అందు కోసమే […]

Share:

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో(ISRO)కి అత్యంత ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్‌(Gaganyan) ప్రయోగంలో సాంకేతిక లోపం వచ్చినట్లు తెలిసింది.

చంద్రయాన్-3 విజయంతో ఊపు  మీదున్న ఇస్రో(ISRO).. అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లడమే లక్ష్యంగా గగన్‌యాన్‌(Gaganyaan)  ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇస్రో కీలక పరీక్షలు నిర్వహిస్తోంది. గగన్‌యాన్‌ కోసం పీడ‌నం లేని క్రూ మాడ్యూల్‌లోనే వ్యోమ‌గాములు(Astronauts) నింగిలోకి వెళ్తారు. ప్ర‌స్తుతం టెస్టింగ్ కోసం ఆ మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, మ‌ళ్లీ భూమి పైకి సురక్షితంగా చేరేలా ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో. అందు కోసమే ఈ కీలక పరీక్షను చేపట్టారు. కానీ, అది చివరి నిమిషంలో రద్దయ్యింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత మిషన్ గగన్‌యాన్‌(Gaganyaan) ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 వాహకనౌక పరీక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది. శ్రీహరి కోట(Sriharikota)లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(Satish Dhawan Space Centre) షార్‌లో శనివారం ఉదయం 8 గంటలకు ఈ పరీక్షను నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ సహా ఏర్పాట్లు కూడా పూర్తిచేసింది. అయితే, చివరి నిమిషంలో వాహక నౌకలో సాంకేతికలోపం తలెత్తెడంతో ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిలిపివేశారు.

సాంకేతికలోపంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్టు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్(Chairman S Somnath) వెల్లడించారు. తదుపరి ప్రయోగ తేదీని తర్వాత ప్రకటిస్తామని, సాంకేతిక సమస్య తలెత్తిందని చెప్పారు. సమస్య ఎక్కడ ఏర్పడిందో గుర్తించి, అన్ని సరి చూసుకుని పరీక్ష చేపడతామని  ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇగ్నిషన్(ignition) ప్రజ్వరిల్లే సమయంలో ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉదయం 10 గంటలకు పరీక్షను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. లోపాన్ని గుర్తించి సరిచేసినట్టు తెలిపింది. తొలుత షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణం వల్ల 8.30 గంటలకు వాయిదా వేశారు. ఇదే సమయంలో లోపాన్ని గుర్తించి.. ప్రయోగానికి 5 సెకెన్ల ముందు నిలిపివేశారు.

అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని మొదటిసి పంపేందుకు ఇస్రో గగన్‌యాన్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఈ గగన్‌యాన్(Gaganyaan) ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వ్యోమ గాములను నింగిలోకి పంపి.. సురక్షితంగా మళ్లీ భూమిపైకి తీసుకురావడం అత్యంత కీలకం. దీనికి సంబంధించిన సన్నాహక పరీక్షే టెస్ట్ ఫ్లైట్.

క్రూ మాడ్యూల్‌(Crew module)లో ప్రయాణించే వ్యోమగాములకు ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే తప్పించుకునే వ్యవస్థ పని తీరును పరీక్షించడమే దీని లక్ష్యం. మిషన్‌ ప్రయోగ క్రమంలో ఏదైనా వైఫల్యం తలెత్తితే దాని నుంచి సిబ్బంది సురక్షితంగా ఎలా తప్పించుకోవడం సహా క్షేమంగా భూమికి చేరడం ఈ పరీక్ష ఉద్దేశం. ఇక పూర్తి స్థాయిలో గగన్‌యాన్‌ ప్రయోగాన్నే చేపట్టే నాటికి ఇలాంటివి సుమారు 20 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇస్రో వర్గాలు చెబుతున్నాయి.
ప్రయోగంలో భాగంగా ఒకటే ఇంజిన్‌ ఉండే వాహక నౌక.. క్రూ మాడ్యూల్‌(Crew module), క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ను 17 కిలో మీటర్ల ఎత్తు వరకు మోసుకెళ్లిన అనంతరం.. అబార్ట్‌ సిగ్నల్‌ను పంపుతారు. ఈ సమయంలో రాకెట్‌(Rocket) నుంచి క్రూ మాడ్యూల్‌ విడిపోతుంది. తర్వాత దానికి ఉన్న పారాచూట్‌ సాయంతో ఆ క్రూ మాడ్యూల్ సముద్రంలో పడుతుంది. సముద్రంలో పడిన మాడ్యూల్2ను ఇండియన్ నేవీ(Indian Navy) .. సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చేలా.. మొత్తం ప్రయోగాన్ని కేవలం 8.5 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది ఇస్రో. కానీ, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ఆగిపోయింది. ప్రయోగ వాహకం సురక్షితంగానే ఉందని, అతిత్వరలో ప్రయోగాన్ని షెడ్యూల్ చేస్తామన్నారు.