గెజిటెడ్ అధికారులు వాడే గ్రీన్ ఇంక్ పెన్స్ సంగతులు 

మనం చిన్నతనంలో చదువుకునేటప్పుడు మన స్కూల్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఆఫీసర్లు కొంతమంది కేవలం గ్రీన్ కలర్ ఇంక్ పెన్స్ మాత్రమే వాడుతూ ఉండడం మనం గమనించే ఉంటాం. అసలు ఇటువంటి గ్రీన్ ఇంక్ పెన్స్ ఎందుకు వాడుతారు? గెజిటెడ్ అధికారులు కేవలం గ్రీన్ ఇంక్ పెన్స్ తోనే సంతకం ఎందుకు పెడతారు ఇలాంటివి ఈరోజు తెలుసుకుందాం..  గ్రీన్ ఇంక్ పెన్స్:  ప్రిన్సిపాల్ నుండి ఉపాధ్యాయులు, విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ పెన్నుల వాడకంలో కొన్ని లిమిట్స్ అయితే […]

Share:

మనం చిన్నతనంలో చదువుకునేటప్పుడు మన స్కూల్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఆఫీసర్లు కొంతమంది కేవలం గ్రీన్ కలర్ ఇంక్ పెన్స్ మాత్రమే వాడుతూ ఉండడం మనం గమనించే ఉంటాం. అసలు ఇటువంటి గ్రీన్ ఇంక్ పెన్స్ ఎందుకు వాడుతారు? గెజిటెడ్ అధికారులు కేవలం గ్రీన్ ఇంక్ పెన్స్ తోనే సంతకం ఎందుకు పెడతారు ఇలాంటివి ఈరోజు తెలుసుకుందాం.. 

గ్రీన్ ఇంక్ పెన్స్: 

ప్రిన్సిపాల్ నుండి ఉపాధ్యాయులు, విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ పెన్నుల వాడకంలో కొన్ని లిమిట్స్ అయితే ఫాలో అవ్వడం జరుగుతుందని మీకు తెలుసా. ఉపాధ్యాయులు సాధారణంగా ఎరుపు-ఇంక్ పెన్నులను ఉపయోగిస్తుండగా, విద్యార్థులు నీలం మరియు నలుపు రంగు ఇంక్ పెన్స్ ప్రత్యేకంగా వాడుతూ ఉండడం కామన్. అయితే ఇక గెజిటెడ్ అధికారులు మాత్రమే గ్రీన్ కలర్ ఇంక్ పెన్స్ వాడటానికి అధికారం ఉంది. Quora వినియోగదారులు ఒకరు, క్షితిజ్ రాజ్, ఈ అధికారులు తమ అధికారిక పని కోసం ప్రత్యేకంగా ఆకుపచ్చ ఇంక్ పెన్నులను ఎందుకు ఉపయోగిస్తున్నారనే దానిపై చర్చను ప్రారంభించారు. అయితే ఈ గ్రీన్ కలర్ ఇంక్ పెన్సిల్ వాడకం వెనక అసలు కారణాల గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది.

అన్ని స్థాయిల్లో ఉండేటువంటి అధికారులు గ్రీన్ ఇంక్ పెన్నులను ఉపయోగించకుండా మినహాయింపు ఉంది, వాటిని గెజిటెడ్ అధికారులకు మాత్రమే రిజర్వ్ చేశారని క్షితిజ్ రాజ్ నొక్కి చెప్పారు. ఈ ప్రత్యేకమైన ఆప్షన్ వెనుక ఉన్న ప్రాథమిక కారణమేంటంటే, వారి సంతకాలను తిరిగి ఫోర్జరీ చేయకుండా ఉండేందుకు చాలా చక్కగా పనిచేస్తుంది అని నివేదికలు చెబుతున్నప్పటికీ.. కొన్నిసార్లు మాత్రం గ్రీన్ కలర్ ఇంక్ పెన్ తో కూడా చేసిన సంతకం ఫోర్జరీకి అవకాశం ఉందని క్షితిజ్ అంగీకరించడం జరిగింది.

నిజానికి గ్రీన్ కలర్ ఇంక్ పెన్ తో చేసే సంతకాలు ప్రామాణికతను కలిగి ఉంటాయని, వాటిని గెజిటెడ్ అధికారి మాత్రమే తమ పనుల్లో వాడే ముఖ్యమైన అంశమని చెప్పారు. అంతేకాకుండా, ఈ అధికారులు తమ సహోద్యోగుల నుండి తమను తాము సెపరేట్గా క్యాటగరైజ్ చేసేందుకు కూడా గ్రీన్ ఇంక్ పెన్స్ వాడకం సహాయపడతాయి.

స్పందించిన అధికారులు: 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఉద్యోగి, మధుకర్ పారే, Quoraలో ఈ గ్రీన్ ఇంక పెన్ వాడకం వెనక ఉన్న విషయాల గురించి ధృవీకరించడం జరిగింది. ఇటువంటి గ్రీన్ కలర్ ఇంక్ పెన్ వాడకం అనేది ప్రోటోకాల్ పాటించడం మరియు అధికారి హోదా గురించి తెలియచేయడం అంటూ పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు మరియు ఇన్‌స్పెక్టర్లు కూడా గ్రీన్ ఇంక్ పెన్నులను ఉపయోగిస్తున్నారని మధుకర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా, ఇతర స్థాయి బ్యాంకు ఉద్యోగులు, అధికారులు కూడా ముందుగా నిర్ణయించిన కలర్ ఇంక్ పెన్స్ మాత్రమే వాడడాన్ని కట్టుబడి ఉంటారని, అయితే ఈ ఏర్పాటు బ్యాంకు ప్రాంగణానికి మాత్రమే ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చారు మధుకర్.

అయితే, పేర్కొన్న Quora ద్వారా తెలియచేసిన ఈ అంశాలు ఫైనల్ అని ఉద్దేశపడకూడదని గుర్తించాలి. న్యూస్ 18 హిందీ ఈ విషయంపై తన రీసెర్చ్ అనేది మొదలుపెట్టింది. గెజిటెడ్ అధికారులు గ్రీన్ కలర్ ఇంక్ పెన్నులను ఉపయోగించాలని అధికారిక నియమం లేదని స్పష్టం అయింది. అయితే, చాలా మంది అధికారులు క్లరికల్ ఉద్యోగులు, జూనియర్ల ద్వారా చేసే సంతకాల విషయంలో వేరుగా ఉండేందుకు మాత్రమే గ్రీన్ కలర్ ఇంక్ పెన్స్ ఎంచుకుంటారు. డాక్యుమెంట్ అటెస్టేషన్ కోసం గ్రీన్ పెన్నులు కూడా ఉపయోగించబడుతున్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విషయానికి సంబంధించి ప్రత్యేకమైన ఆధారాలు కనిపించడం లేదని స్పష్టమైంది.