జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పుల ఘ‌టన క‌థేంటి?

జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ పోలీస్ ఆఫీస‌ర్ కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. 12 రౌండ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. అస‌లు ఆ పోలీస్ ఎవ‌రు? ఎందుకు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది? ఎలా జ‌రిగింది? చేత‌న్ కుమార్ అనే వ్య‌క్తి రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. చేత‌న్‌తో పాటు టీకారామ్ అనే అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, మ‌రో ఇద్ద‌రు కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉన్నారు. ఈ టీంలో చేత‌న్ కుమార్ సెక్యూరిటీగా ఉన్నాడు. […]

Share:

జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ పోలీస్ ఆఫీస‌ర్ కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. 12 రౌండ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. అస‌లు ఆ పోలీస్ ఎవ‌రు? ఎందుకు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది?

ఎలా జ‌రిగింది?

చేత‌న్ కుమార్ అనే వ్య‌క్తి రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. చేత‌న్‌తో పాటు టీకారామ్ అనే అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, మ‌రో ఇద్ద‌రు కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉన్నారు. ఈ టీంలో చేత‌న్ కుమార్ సెక్యూరిటీగా ఉన్నాడు. రైలు సూర‌త్‌కు చేరుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత‌ పాల్ఘ‌ర్ స్టేష‌న్ దాట‌గానే చేత‌న్ కాల్పులు జ‌రిపాడు. సోమ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏకే-47తో కాల్పులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. మొత్తం 12 రౌండ్ల కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో టీకారామ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు ప్ర‌యాణికులు చ‌నిపోయారు.

ఎందుకు కాల్పులు జ‌రిపాడు? 

చేత‌న్ ఎందుకు కాల్పులు జ‌రిపాడ‌న్న‌ది పూర్తి స్థాయిలో విచార‌ణ చేస్తే కానీ చెప్ప‌లేమని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. చేత‌న్‌కి కొంత‌కాలంగా మానిసిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. ఒత్తిడి ఎక్కువ అవ్వ‌డం వ‌ల్లో లేదంటో ఇంటికి వెళ్లాల‌ని ఉన్నా వెళ్ల‌లేని ప‌రిస్థితుల వ‌ల్లో ఈ దారుణానికి పాల్ప‌డి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. పైగా చేత‌న్ నెల రోజుల పాటు లీవ్‌లో ఉండి ఇటీవల డ్యూటీలో జాయిన్ అయ్యాడ‌ట‌.

కాల్పుల త‌ర్వాత ఏం జ‌రిగింది?

రైలు విరాట్ స్టేష‌న్ దాట‌గానే చేత‌న్ ఎమ‌ర్జెన్సీ చేత‌న్ చైన్ లాగి రైలును ఆపాడు. అప్ప‌టికే రైలు మీరా రోడ్డు స్టేష‌న్‌లో ఆగింది. అక్కడి నుంచి చేత‌న్ పారిపోయేందుకు య‌త్నించాడు. కానీ ఇత‌ర ప్రయాణికుల సాయంతో అధికారులు వెంట‌నే అత‌న్ని పట్టుకోగ‌లిగారు. ఆ త‌ర్వాత అధికారులు మృత‌దేహాల‌ను బొరివ‌లి రైల్వే స్టేష‌న్‌కు త‌ర‌లించి ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌లో పోస్ట్ మార్టంకి పంపించారు. చేత‌న్ కుమార్ స్వ‌స్థ‌లం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని హ‌థ్రాస్‌. గుజ‌రాత్‌లో కొంత‌కాలం ప‌నిచేసాక ఇటీవ‌ల అత‌న్ని ముంబైకు బ‌దిలీ చేసార‌ట‌.

మ‌తం గురించి గొడ‌వ‌?

మ‌తం గురించి జ‌రిగిన గొడ‌వ వల్లే చేత‌న్ ఈ కాల్పుల‌కు పాల్ప‌డినట్లు తెలుస్తోంది. రైలులో ఉన్న ఇద్ద‌రు ముస్లిం ప్ర‌యాణికులు ఏదో మ‌తం గురించి చేత‌న్‌తో గొడ‌వ‌ప‌డ్డార‌ని దాంతో చేత‌న్ కోపంలో వారిపై కాల్పులు జ‌రిపార‌ని తెలుస్తోంది. టీకారామ్ అడ్డు రావ‌డంతో అత‌నికి కూడా బుల్లెట్ త‌గిలి ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జ‌రిపిన త‌ర్వాత మ‌తానికి సంబంధించిన విద్వేష‌పూరిత ప్ర‌సంగం ఇచ్చి మ‌రీ అక్క‌డి నుంచి ప‌రార‌య్యేందుకు య‌త్నించాడ‌ట‌.

ఉగ్ర కుట్రా?

మ‌రోప‌క్క ఈ కాల్పుల వెనక ఉగ్ర కుట్ర ఉండే అవ‌కాశం కూడా ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు. ఈరోజు చేత‌న్ కుమార్‌ను కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. చేత‌న్ కుమార్ పేరును బట్టి చూస్తే అత‌ను హిందునే అని తెలుస్తోంది. పైగా అత‌ను ముందు త‌న పై అధికారి అయిన టీకారామ్‌పై కాల్పులు జ‌రిపి ఆ త‌ర్వాత ఇద్ద‌రు ముస్లిం యువ‌కుల‌పై గ‌న్ను పెట్టి బెదిరించి మరీ కాల్పుల‌కు పాల్ప‌డినట్లు స‌మాచారం.

వేధింపులు?

చేత‌న్ కొన్ని నెల‌ల క్రితం త‌న పై అధికారులు వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని కంప్లైంట్ పెట్టాడ‌ట‌. పై అధికారులు టార్చర్ పెడుతున్నార‌న్న కార‌ణంతో అత‌ను బాధ‌ప‌డుతూ ఇత‌రుల‌తో కోపంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ట. రైల్లో ఉన్న తోటి పోలీసుల‌తో ఇదే విష‌య‌మై కోప‌గించుకుని వారిపై కాల్పులు జ‌రిపాడ‌ని అసలు ఆ స‌మ‌యంలో వారి మ‌ధ్య గొడ‌వ ఏమీ జ‌ర‌గలేద‌ని అధికారులు అంటున్నారు, దాంతో అస‌లు చేత‌న్‌ను వేధింపుల‌కు గురి చేసిన అధికారులు ఎవ‌రు అనేదానిపైనా విచార‌ణ జ‌రుగుతోంది.