ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణేంటి?

ముంబైలో ఆగస్టు 31న ఇండియా కూటమి భేటీ అయింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి మూడో మీటింగ్ ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీన ముంబైలో నిర్వహిస్తున్నారు. ఈ కూటమి తొలి సమావేశం పాట్నాలో, రెండో మీటింగ్ బెంగళూరులో నిర్వహించారు. ఇప్పుడు ముంబైలో జరుగుతున్న కీలకమైన మూడో సమావేశంలో అందరూ కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రతిపక్షాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసే […]

Share:

ముంబైలో ఆగస్టు 31న ఇండియా కూటమి భేటీ అయింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి మూడో మీటింగ్ ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీన ముంబైలో నిర్వహిస్తున్నారు. ఈ కూటమి తొలి సమావేశం పాట్నాలో, రెండో మీటింగ్ బెంగళూరులో నిర్వహించారు. ఇప్పుడు ముంబైలో జరుగుతున్న కీలకమైన మూడో సమావేశంలో అందరూ కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రతిపక్షాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది. 

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’ కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ధృవీకరించారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై అధ్యయనం చేసే కమిటీపై కూడా నివేదిక సమర్పించనున్నారు. ఇదిలావుండగా, 28 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలు హాజరైన భారత కూటమి సమావేశం రెండో రోజు ముంబైలో ప్రారంభమైంది. నిన్న జరిగిన డిన్నర్ భేటీలో కూటమికి లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

రెండో రోజు ఎజెండాలో ఏముంది?

కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఎజెండాను ఏర్పాటు చేయడం, అధికార ప్రతినిధుల నియామకం, సోషల్ మీడియా మరియు రీసెర్చ్ టీమ్‌లను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఇండియా సదస్సులో చర్చ జరిగే అవకాశం ఉంది. కూటమికి కన్వీనర్ నియామకం వివాదాస్పద ప్రతిపాదనగా మిగిలిపోయే అవకాశం ఉంది, ఈ పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది నాయకులు పోటీ పడుతున్నారు. మొదటి రోజు, మూడవ భారత కూటమి సమావేశం యొక్క ఎజెండాను అండర్‌లైన్ చేయడానికి ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు.

ఎవరు  ఏం మాట్లాడారు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి విపక్షాల ‘ఇండియా’ కూటమి బలం… ఆందోళన కలిగిస్తోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము ఒక్కటయ్యామని, దేశాన్ని ఏకం చేసేందుకు కూటమి కృషి చేస్తోందని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని.. ప్రతిపక్ష కూటమి నేతలు ప్రతీకార రాజకీయాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముంబయిలో జరుగుతున్న విపక్షాల మూడో సమావేశంలో ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.          

గత తొమ్మిదేళ్లలో బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ వ్యాప్తి చేసిన మతపరమైన విషం.. ఇప్పుడు రైలు ప్రయాణికులు, స్కూల్​ విద్యార్థులపై జరుగుతున్న దారుణాల్లో కనిపిస్తోందని ఖర్గే ఆరోపణలు చేశారు. ఇటీవలే హోమ్​వర్క్​ పూర్తి చేయనందుకు గాను ముస్లిం చిన్నారికి చెప్పుతో కొట్టమని మిగతా విద్యార్థులకు టీచర్​ చెప్పిన ఘటనను ఖర్గే పరోక్షంగా ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వ పగ రాజకీయాల కారణంగా రానున్న నెలల్లో మరిన్ని దాడులు, అరెస్టులకు ప్రతిపక్ష నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. విపక్ష కూటమి ఎంత పుంజుకుంటే బీజేపీ ప్రభుత్వం అంతలా ఇండియా కూటమి నాయకులపై దాడులకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్​డౌన్​ ప్రారంభమైందని ఖర్గే తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు సమావేశమైన ఇండియా కూటమి నేతల గ్రూప్ ఫొటోను ఖర్గే ఎక్స్​లో పోస్ట్​ చేశారు. “జుడేగా భారత్, జీతేగా ఇండియా. ప్రగతిశీల, సంక్షేమ ఆధారిత, సమ్మిళిత భారతదేశం కోసం మేము ఐక్యంగా ఉన్నాం. 140 కోట్ల మంది భారతీయులు మార్పును తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వ నిష్క్రమణ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది!” అని రాసుకొచ్చారు.

అంతకుముందు.. ముంబయిలోని గ్రాండ్‌హయత్‌లో విపక్షాల కూటమి శుక్రవారం ఉదయం భేటీ అయింది. చంద్రయాన్-3 మిషన్​ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను అభినందిస్తూ విపక్ష కూటమి తీర్మానం ఆమోదించింది. అందులో ఇస్రో సామర్థ్యాలను విస్తరించడానికి ఆరు దశాబ్దాలు పట్టిందని పేర్కొంది. ఇలాంటి అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయని.. యువత సైన్స్​లో రాణించడానికి స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆదిత్య-ఎల్​1 మిషన్​ ప్రయోగానికి ప్రపంచమంతా ఆసక్తిగా వేచి చూస్తోందని చెప్పింది.

రౌత్ మాట్లాడుతూ.. “ఒక దేశం, ఒకే ఎన్నికలు” సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి కమిటీకి నాయకత్వం వహించే బాధ్యతను అప్పగించిన కొన్ని గంటల తర్వాత, శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఈ చర్యను “ఎన్నికల వాయిదాకు కుట్ర” అని అన్నారు. 

“మాకు ఇప్పుడు జరగని నిష్పక్షపాత ఎన్నికలు కావాలి. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదన ఎన్నికలను వాయిదా వేసే కుట్ర. రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం గౌరవించలేదని రౌత్ అన్నారు. “ఇప్పుడు వారు అతనిని ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ యొక్క అవకాశాన్ని అన్వేషించడానికి ఒక కమిటీతో బిజీగా ఉన్నారు,” అని అతను చెప్పాడు.

అక్టోబర్ 2నాటికి ఇండియా కూటమి తన మేనిఫెస్టోని విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీకి హాజరైన నాయకులను కోరారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా కామన్ అజెండాను రూపొందించాలని కోరారు. 

నిన్న రాత్రి శివ సేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని డిన్నర్ భేటీలో కూటమి నాయకులందరు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రానున్నాయని కొందరు నాయకులు అంచనా వేశారు. ఎన్డీయే వేసే ఎత్తులకు ధీటైన జవాబు ఇవ్వాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు.