SIM Swapping Scam: సిమ్‌  స్వాపింగ్ స్కామ్ అంటే ఏమిటి..

సిమ్‌ స్వాప్‌(SIM Swap) పేరుతో ఖాతాల్లోని డబ్బులను దోచేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమైన ఈ రోజుల్లో దానిని తమ నేరానికి వస్తువుగా మార్చుకుంటున్నారు. సిమ్‌ కార్డు (SIM Card) ద్వారా కొత్త నేరానికి తెర తీశారు. ఇతంకీ సిమ్‌ స్వాప్‌ అంటే ఏంటి.? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..  రోజురోజుకీ టెక్నాలజీ(Technology) ఎంతలా అభివృద్ధి చెందుతుందో సమానంగా సైబర్ నేరాలు(Cyber Crimes) కూడా […]

Share:

సిమ్‌ స్వాప్‌(SIM Swap) పేరుతో ఖాతాల్లోని డబ్బులను దోచేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమైన ఈ రోజుల్లో దానిని తమ నేరానికి వస్తువుగా మార్చుకుంటున్నారు. సిమ్‌ కార్డు (SIM Card) ద్వారా కొత్త నేరానికి తెర తీశారు. ఇతంకీ సిమ్‌ స్వాప్‌ అంటే ఏంటి.? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.. 

రోజురోజుకీ టెక్నాలజీ(Technology) ఎంతలా అభివృద్ధి చెందుతుందో సమానంగా సైబర్ నేరాలు(Cyber Crimes) కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఏ టెక్నాలజీ అయితే మనిషి జీవితాన్ని సులభం చేసిందో అదే టెక్నాలజీ నిండా ముంచేస్తుంది. రక రకాల మార్గాలను ఎంచుకుంటూ దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల ఓ కొత్త సైబర్‌ నేరం వెలుగులోకి వచ్చింది. సిమ్ స్వాపింగ్ స్కామ్(SIM Swapping Scam) కారణంగా ఢిల్లీకి చెందిన మహిళ రూ. 50 లక్షలు పోగొట్టుకుంది. ఆమెకు తెలియని నంబర్ నుండి మూడు మిస్డ్ కాల్‌లు వచ్చాయి. దాంతో ఆమెకు అనుమానం వచ్చి వేరే నంబర్ నుండి తిరిగి కాల్ చేసింది. అటువైపు వ్యక్తి ఇలా చెప్పాడు. మీకు కొరియర్(Courier) వచ్చింది అందుకే కాల్ చేశాను, అడ్రస్ కోసమని అని చెప్పాడు. దాంతో ఆ మహిళ తన ఇంటి చిరునామాను పంచుకుంది. వివరాలను పంచుకున్న తర్వాత, తన బ్యాంక్ ఖాతా నుంచి రెండు సార్లు నగదు డ్రా అయినట్లు గుర్తించింది. ఓటీపీ వంటి ఎలాంటి సమాచారాన్ని సదరు మహిళ స్కామర్‌తో పంచుకోలేదని ఢిల్లీ పోలీసు సైబర్ విభాగం(Cyber ​​Division) తెలిపింది.

అసలేంటీ స్విమ్‌ స్వాప్‌..

సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో యూజర్ల మొబైల్‌ నెంబర్‌(Mobile Number) సమచారాన్ని సేకరిస్తున్నారు. ఏ వివరాలతో సిమ్‌ కార్డు (SIM Card) ను తీసుకున్నారు.? ఎవరి పేరుపై సిమ్‌ కార్డు ఉంది.? ఇలాంటి వివరాలను సేకరించిన తర్వాత.. మొబైల్‌ ఫోన్‌ పోందనో, సిమ్‌ కార్డ్ పోయిందన్న కారణం చెబుతూ కస్టమర్‌ కేర్‌(Customer care)కు కాల్ చేస్తారు. సంబంధిత వివరాలను తెలిపి కొత్త సిమ్‌ కావాలని కోరుతారు. ఇందుకోసం యూజర్ల ఫేక్‌ ఐడీ(Fake Id)ను రూపొందిస్తున్నారు.

ఇలా చేయగానే సదరు మొబైల్‌ యూజర్‌(Mobile User)కు తెలియకుండానే అతని నెంబర్‌ డీ యాక్టివ్‌ అవుతుంది. ఈ సమయంలో డూప్లికేట్‌ సిమ్‌ కార్డు(SIM Card) పొందిన సైబర్‌నేరగాళ్లు ఓటీపీ(OTP) సహాయంతో మీ ఖాతాల్లోని సొమ్మును దర్జాగా కొట్టేస్తున్నారు. ఇలాంటి నేరాలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ మహిళా లాయర్‌ సిమ్‌ స్వాప్‌ బారిన పడిన బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బును కోల్పోయింది.

ఈ మోసం బారిన పడకూడదంటే.. 

  •  మీ మొబైల్‌కు ఫోన్‌, మెసేజ్‌ రాక చాలా కాలం అయితే వెంటనే అలర్ట్ అవ్వాలి. మీ సిమ్‌ యాక్టివేట్‌లో ఉందో లేదో ఇతరులకు కాల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఒకవేళ మీ ఫోన్‌ నుంచి కాల్స్‌ వెళ్లకపోతే వెంటనే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి మీ సిమ్‌ యాక్టివేట్‌లో ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి.
  • ఇక సిమ్‌ స్వాపింగ్(SIM Swapping) కోసం మీరు అప్లై చేసుకుంటే టెలికాం సంస్థల నుంచి మీ ఫోన్‌కు ఒక మెసేజ్‌ వస్తుంది. కాబట్టి ఫోన్‌లో వచ్చిన టెక్ట్స్‌ మెసేజ్‌లను అలా వదిలేయకుండా అప్పుడప్పుడు వాటిని గమనిస్తుండాలి.
  • ఇక క్రమం తప్పకుండా మీ బ్యాంక్‌ అకౌంట్‌(Bank Accont)పై కూడా ఓ కన్నేసి ఉంచాలి. అప్పుడప్పుడు బ్యాలెన్స్‌ చెక్‌ చేయడం, ట్రాన్సాక్షన్‌ హిస్టరీ చూడడం వంటి చేస్తుండాలి.
  • ఇక మీ ఫోన్‌ను ఎక్కువ కాలం స్విఛ్‌ ఆఫ్‌ చేయడం కానీ, ఎక్కువ కాలం ఫ్లైట్‌ మోడ్‌లో ఉంచడం లాంటివి కానీ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ సిమ్‌ కార్డ్‌ స్వాపింగ్‌(SIM card swapping)కు గురైందన్న విషయం తెలిసే అవకాశం ఉండదు.

ఎంత సమయం పడుతుంది?

ఇటీవల, పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ(Vijay Shekhar Sharma) పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసేందుకు హ్యాకర్ ఎంత సమయం తీసుకుంటాడు అనే దానిపై మాట్లాడారు. పాస్‌వర్డ్‌ల ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పారు. అంతే కాదు.. పాస్‌వర్డ్ లెన్త్ చాలా ముఖ్యమైనదని (X) వేదికగా చార్ట్‌ను శర్మ షేర్ చేశాడు. పాస్‌వర్డ్ లెన్త్ చాలా ముఖ్యమైనది. అందులో కొన్ని స్మాల్, షార్ట్ క్యాపిటల్ లెటర్స్ ఉండేలా చూసుకోవాలి. నంబర్-ఓన్లీ పాస్‌వర్డ్‌ల కోసం హ్యాకర్ తీసుకునే సమయం క్యారెక్టర్‌లను బట్టి అప్పటికప్పుడు నుంచి 6 రోజుల వరకు మారవచ్చు.