అసలు E-SIM అంటే ఏమిటి?

ప్రస్తుతం మనం వాడుతున్న ప్రతి ఫోన్ కు సిమ్ కార్డ్ ఉంటుంది. ఒకప్పుడు సిమ్ కార్డ్ లు లేకుండా ఫోన్స్ వచ్చేవి కానీ ప్రస్తుతం అన్ని రకాల ఫోన్లలో సిమ్ కార్డ్ లు వస్తున్నాయి. ఒకప్పుడు ఫిజికల్ సిమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం అన్ని ఫోన్లలోE-SIM లు వస్తున్నాయి. అసలు ఈ E-SIM అంటే ఏంటని అంతా ఆలోచిస్తారు. చాలా మందికి ఈ E-SIM గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలేంటీ ఇది అని అందరూ సెర్చ్ […]

Share:

ప్రస్తుతం మనం వాడుతున్న ప్రతి ఫోన్ కు సిమ్ కార్డ్ ఉంటుంది. ఒకప్పుడు సిమ్ కార్డ్ లు లేకుండా ఫోన్స్ వచ్చేవి కానీ ప్రస్తుతం అన్ని రకాల ఫోన్లలో సిమ్ కార్డ్ లు వస్తున్నాయి. ఒకప్పుడు ఫిజికల్ సిమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం అన్ని ఫోన్లలోE-SIM లు వస్తున్నాయి. అసలు ఈ E-SIM అంటే ఏంటని అంతా ఆలోచిస్తారు. చాలా మందికి ఈ E-SIM గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలేంటీ ఇది అని అందరూ సెర్చ్ చేస్తుంటారు. అసలు ఈ E-SIM అంటే ఏమిటో… అదెలా వర్క్  చేస్తుందో ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాం. 

E-SIM అంటే ఏంటంటే.. 

E-SIM (ఎంబెడెడ్ సిమ్) అనేది ఒక రకమైన సిమ్ కార్డ్.. మీరు దీనిని ఫిజికల్ రూపంలో చూడలేరు. మీ ఫోన్ లో దీనికి సంబంధించి ఎటువంటి స్లాట్ కూడా ఉండదు. కానీ ఇది మాత్రం వర్క్ చేస్తూనే ఉంటుంది. మీరు ఈ E-SIM ను విడిగా బయట కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. మీరు మీ ఆపరేటర్ కు కాల్ చేసి మీకు కావాల్సిన E-SIMను యాక్టివేట్ చేయించుకోవచ్చు. 

E-SIM ఎలా పని చేస్తుందంటే,.. 

E-SIM కూడా సంప్రదాయ సిమ్ కార్డ్ మల్లే పనిచేస్తుంది. ఇది వాస్తవానికి, ఫోన్‌లో నిర్మించిన చిన్న చిప్ వంటిది. ఇది మీ డేటాను సురక్షితంగా నిల్వ చేస్తుంది. ఇది మీకు మొబైల్ డేటాను కూడా అందిస్తుంది. E-SIMని ఉపయోగించడానికి, మీరు QR కోడ్‌ని స్కాన్ చేయాలి లేదా సేవలను ప్రారంభించడానికి ఆపరేటర్ మీకు అందించే డేటాను రాయాలి. మీరు ఫిజికల్ సిమ్ కార్డ్‌ తో ఇబ్బంది పడకుండా ఆపరేటర్‌ ని మార్చుకోవచ్చు. కావున ఇది మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. వర్చువల్ కార్డ్‌ లు బహుళ నెట్‌వర్క్ ప్రొఫైల్‌ లను నిల్వ చేయగలవు. ఈ ఫంక్షన్ SIM కార్డ్‌ను తీసివేయకుండా మరియు భర్తీ చేయకుండా వాటి మధ్య మారడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. తరచుగా విదేశాలకు వెళ్లే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మొబైల్ ఫోన్‌ కి లింక్ చేయకుండా మీకు అవసరం అయిన సేవలను పొందొచ్చు. లేదా అవసరం లేని సేవలను వద్దని చెప్పొచ్చు. 

E-SIM వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు

డిజిటల్ కార్డ్ అనేది ప్లాస్టిక్ కంటే ఉత్తమంగా ఉంటుంది. E-SIM కనెక్షన్ గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ప్రయోజనం… వేగవంతమైన కనెక్షన్. దీని వల్లే చాలా మంది E-SIM తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 

E-SIM అనేది కొన్ని విషయాలలో ప్రతికూలతలను కూడా కలిగి ఉంటుంది. అవేంటంటే.. 

ఫోన్ కనుక విచ్ఛిన్నమైతే.. మీరు E-SIM నుంచి డేటాను పూర్తిగా కోల్పోవచ్చు. డేటా సేకరణకు వ్యతిరేకంగా ఉన్న వినియోగదారులు E-SIM ని ఇష్టపడరు. మొత్తం ఓవరాల్ గా చెప్పకుండా మీకు వ్యక్తిగతంగా దీని వల్ల లాభాలు మరియు నష్టాలు ఏంటి అనేది ముందుగా చూసుకోండి. మీకు కనుక లాభాలు ఎక్కువగా ఉంటే మీరు E-SIMను తీసుకోవచ్చు. మీరు E-SIM ను కనెక్ట్ చేయడానికి మొబైల్ ఆఫీస్ కి వెళ్లడం అవసరం లేదు. మీరు ఇంటి నుంచి నేరుగా ఏర్పాటు చేసుకోవచ్చు మరియు కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, కొన్ని కారణాల వల్ల మీరు ఆపరేటర్‌ను మార్చవలసి వస్తే… అప్పుడు ఈ ప్రక్రియ కూడా చాలా సులభం. అని చాలా మంది అంటున్నారు.  E-SIMను వివిధ ఆపరేటర్ల నుంచి ఎంచుకోవచ్చు. మన ఫోన్ రకాన్ని బట్టి ఒక E-SIM ఎంచుకోవాలా,లేక రెండు E-SIM లు ఎంచుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి. 

E-SIMని ఇలా ప్రారంభించండి.. 

మీరు ఆపరేటర్ కార్యాలయంలో లేదా E-SIM ప్లస్ వంటి ఏదైనా ఆన్‌లైన్ సేవలో ఎలక్ట్రానిక్  SIM కార్డ్‌ ని కూడా కొనుగోలు చేయవచ్చు. చెల్లింపు విజయవంతం అయినపుడు, నంబర్‌ ను ఎలా యాక్టివేట్ చేయాలనే దానిపై సర్వీస్ మీకు సూచనలను పంపుతుంది. వాటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది.