లోక్ సభలో పెరగనున్న సీట్లు

పలుచోట్ల వినిపిస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. పార్లమెంటులోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎప్పటినుంచో, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవితతో సహా, చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోని మహిళా రిజర్వేషన్ బిల్లు (డబ్ల్యూఆర్‌బీ)కి సోమవారం కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ఓబిసీ వారికి కూడా, ఇప్పుడు ఆమోదించిన 33% […]

Share:

పలుచోట్ల వినిపిస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. పార్లమెంటులోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎప్పటినుంచో, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవితతో సహా, చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోని మహిళా రిజర్వేషన్ బిల్లు (డబ్ల్యూఆర్‌బీ)కి సోమవారం కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ఓబిసీ వారికి కూడా, ఇప్పుడు ఆమోదించిన 33% మహిళా రిజర్వేషన్ లో చోటు దక్కించాలని డిమాండ్ చేయడం జరిగింది. లోక్ సభలో డెలిమినేషన్ విధానం ప్రకారం, 543గా అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, 753 కు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే ముఖ్యంగా అధిక మొత్తంలో సీట్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి దక్కే అవకాశం ఉంది. 

డెలిమినేషన్ విధానం అంటే ఏమిటి?: 

డీలిమిటేషన్ అంటే ఒక దేశం లేదా శాసన సభలో ఉన్న ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులను నిర్ణయించే ఒక ప్రక్రియ. డీలిమిటేషన్ ప్రక్రియ నిజానికి అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఎక్కువ అధికారం ఉన్న కొంతమంది సభ్యులు ఉంటారు. అటువంటి కమిషన్ డీలిమిటేషన్ కమిషన్ లేదా సరిహద్దు కమిషన్ అంటారు. 

రాష్ట్రాలకి దక్కనున్న సీట్లు: 

2026లో, భారతదేశ జనాభా 1.42 బిలియన్లు ఉండొచ్చని అంచనా. నిజానికి భారతదేశ జనాభా డేటా డీలిమిటేషన్‌కు కీలకం, ఇది జనాభా ఆధారంగా నియోజకవర్గ పరిమితులను సెట్ చేసేందుకు హెల్ప్ అవుతుంది.  ఆ సంఖ్య ఆధారంగా, 2026లో కర్ణాటకలో లోక్‌సభ స్థానాలు 28 నుంచి 36కి పెరుగుతాయని అంచనా. అంటే నిజానికి కేవలం ఎనిమిది స్థానాలు మాత్రమే పెరిగాయి. తెలంగాణలో సీట్ల సంఖ్య 17 నుంచి 20కి, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 28కి, తమిళనాడులో 39 నుంచి 41కి పెరగనున్నాయి. 

జనాభా పెరుగుదలను ఉత్తమంగా నియంత్రించిన కేరళ స్థానాలు సంఖ్య తేడా ఒకటిగా కనిపిస్తుంది. అది కూడా కేరళకు సంబంధించి లోక్‌సభ స్థానాల సంఖ్య 20 నుండి 19కి పడిపోతుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 80 నుండి 128కి పెరుగుతుంది. 

వేగంగా పెరుగుతున్న జనాభా ఉన్న మరో రాష్ట్రం బీహార్, ప్రస్తుత 40 స్థానాల నుండి బీహార్ కు 70 స్థానాలు  దక్కనున్నాయ. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 29 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి, డీలిమిటేషన్ తర్వాత అవి 47గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో, డీలిమిటేషన్ తర్వాత 20 సీట్లు పెరుగుతాయని అంచనా, అంటే నిజానికి సీట్లు 48 నుండి 68కి పెరగనున్నాయి. రాజస్థాన్ కి సంబంధించిన సీట్ల సంఖ్య ప్రస్తుత 25 నుండి 44కి చేరుకుంటుంది. దేశంలోని ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య భారీ సంఖ్యా వ్యత్యాసం ప్రతిపక్షాల నుండి విమర్శలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. 

కేవలం నాలుగు సార్లు ఇలా జరిగింది: 

నిజానికి చెప్పాలంటే, 1977 నుంచి లోక్‌సభ స్థానాల సంఖ్య పెరగలేదు. ఇప్పటికి కేవలం నాలుగు సార్లు మాత్రమే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది — 1952, 1963, 1973, 2002. 1981, 1991 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగలేదు. 2001 జనాభా లెక్కల తర్వాత కూడా సీట్ల సంఖ్య పెరగలేదు. మహిళా రిజర్వేషన్ అమలులోకి వచ్చిన అనంతరం, లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య ప్రస్తుత 82 నుంచి 181కి పెరుగుతుంది. రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ దక్కనుంది.