విడాకుల తర్వాత ఇన్సూరెన్స్ పథకం ఏమవుతుంది

విడాకులు: బీమా పథకాలు విడాకులు తీసుకోవడం అంత తేలికైన నిర్ణయం కాదు. భార్యాభర్తలిద్దరికీ ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నా కూడా.. అది చాలా ఒత్తిడి కలిగిస్తుంది. గందరగోళ పరిస్థితికి దారి తీస్తుంది. విడాకుల వల్ల గలిగే నష్టాలలో మొదటిది ఆర్ధిక అంశాలు. డివోర్స్ తీసుకున్నప్పుడు సాధారణంగా ఇప్పటికే ఉన్న ఆస్తులు, బాధ్యతలను పంచుకోవలసి వస్తుంది. ఇప్పటికే ప్రారంభించిన ఆర్థిక ప్రణాళికలు పట్టాలు తప్పవచ్చు. విడాకులు జీవితంలో ఒక పెద్ద మలుపు, అందువల్ల […]

Share:

విడాకులు: బీమా పథకాలు

విడాకులు తీసుకోవడం అంత తేలికైన నిర్ణయం కాదు. భార్యాభర్తలిద్దరికీ ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నా కూడా.. అది చాలా ఒత్తిడి కలిగిస్తుంది. గందరగోళ పరిస్థితికి దారి తీస్తుంది. విడాకుల వల్ల గలిగే నష్టాలలో మొదటిది ఆర్ధిక అంశాలు. డివోర్స్ తీసుకున్నప్పుడు సాధారణంగా ఇప్పటికే ఉన్న ఆస్తులు, బాధ్యతలను పంచుకోవలసి వస్తుంది. ఇప్పటికే ప్రారంభించిన ఆర్థిక ప్రణాళికలు పట్టాలు తప్పవచ్చు.

విడాకులు జీవితంలో ఒక పెద్ద మలుపు, అందువల్ల మొత్తం ఆర్థిక ప్రణాళిక ప్రక్రియను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆర్థిక ప్రణాళికలో ఉమ్మడి లక్ష్యాలు ఉంటాయి. అవి బహుశా జీవిత భాగస్వామితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. విడాకులు కాబట్టి, ఒక వ్యక్తిగా లక్ష్యాలు మళ్ళీ మొదటికి వస్తాయి. ఆర్థిక ప్రణాళికను మార్చడం లేదా కొత్తది రూపొందించడం చేయాలి.

దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ పాలసీ ఒక ముఖ్యమైన అంశం. ఇన్సూరెన్స్ ప్లాన్‌ గురించి పట్టించుకోకపోతే మనకు చాలా నష్టం. అందువల్ల దాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి.

కాబట్టి, విడాకుల తర్వాత కలిగే ఆర్థిక పతనాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో ఏమి చేయలో చూడండి.

లాయర్‌ని లేదా ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి

విడాకులు తీసుకుంటూ, మానసికంగా ఒత్తిడిలో, ఉద్విగ్న పరిస్థితిలో ఉన్నప్పుడు తొందరలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆర్థిక స్థిరత్వంపై చాలా ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో న్యాయవాదిని లేదా ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, నిర్ణయం తీసుకునే ప్రక్రియకు మార్గనిర్దేశం చేయడమే ఉత్తమమైన విధానం.

అన్ని ఆస్తులు, బాధ్యతలను జాబితా చేయండి

విడాకులు ఖరారు అయినప్పుడు, అది వివిధ రకాల ఆస్తులు, బాధ్యతలను ప్రభావితం చేస్తుంది. దంపతులు నివసించే దేశ చట్టాలపై ఆధారపడి ఆస్తులు, బాధ్యతల విభజన ఎక్కువగా కోర్టు ద్వారా నిర్ణయించబడుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్‌తో సహా అన్ని ఆర్థిక ఆస్తులను జాబితా చేయడం ముఖ్యం, తద్వారా ఆర్థిక వస్తువుల గురించి పూర్తి వీక్షణను కలిగి ఉంటారు. ఏవైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ఇన్సూరెన్స్ – బెనిఫిషరీని అప్‌డేట్ చేయాలి:

ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కుటుంబాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడానికి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. చాలా సందర్భాలలో, ఇన్సూరెన్స్ పాలసీలో తమ జీవిత భాగస్వామిని బెనిఫిషరీగా పేర్కొంటారు. విడాకుల తర్వాత పిల్లలను, లేదా మీ తల్లిదండ్రులను బెనిఫిషరీగా అప్‌డేట్ చేస్తే మంచిది.

బెనిఫిషరీని మార్చలేకపోతే:

కొన్ని సందర్భాల్లో బెనిఫిషరీని మార్చడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఉదాహరణకు.. వివాహిత మహిళల ఆస్తి చట్టం కింద ఇన్సూరెన్స్ పాలసీని కొన్నట్లయితే, ఏ సమయంలోనైనా భర్త బెనిఫిషరీని మార్చలేరు. విడాకుల తర్వాత కూడా భార్యకు ఆ డబ్బు వస్తుంది. వివాహిత మహిళల ఆస్తి చట్టం భర్తకు అప్పులు, భర్త ఆస్తులను క్లెయిమ్ చేసే బంధువులు మొదలైన వాటి నుండి స్త్రీ ఆర్థిక భద్రత పొందడానికి సహాయపడుతుంది. ఒకవేళ, పాలసీదారు కంటే ముందే భర్త చనిపోతే, పాలసీదారు యొక్క వారసుడికి క్లెయిమ్ సొమ్ము లభిస్తుంది. 

ఉమ్మడి పాలసీ తీసుకుంటే:

ఉమ్మడి పొదుపు పాలసీ ఉన్నట్లయితే, అంటే పాలసీలో ఇద్దరూ డబ్బును పెట్టుబడిగా పెడితే, పాలసీని సరెండర్ చేసి, ఫండ్ విలువను పొందడం, పంచుకోవడం మంచిది. లేదా సెటిల్‌మెంట్‌ చేసుకోవడం కూడా మంచిదే. 

విడాకుల ప్రక్రియ ముగిసిన తర్వాత.. వ్యక్తిగత లక్ష్యాలకు సరిపోయేలా ఆర్థిక ప్రణాళికను తిరిగి మార్చడం చాలా ముఖ్యం. వివాహం చేసుకున్నప్పుడు ఏవేవో ఆర్థిక ప్రణాళికలు చేసి ఉండవచ్చు. కానీ కొత్త జీవితం ఎలా ఉంటుందో చూసి, ఆ కోణం నుండి ఆర్థిక పోర్ట్‌ఫోలియో తయారు చేసుకోండి.

ఇన్సూరెన్స్‌తో సహా ఇతర ఆస్తుల పంపకాలు.. ప్రతి విడాకుల సెటిల్‌మెంట్‌లోనూ ఉంటాయి.  అందువల్ల దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా వ్యవహరిస్తే మంచిది.