బిజెపి కార్యకర్తలకు దేవేంద్ర ఫ‌డణ‌వీస్ ఏం చెప్పారు?

బివాండీలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్.. బిజెపి కార్యకర్తలకు  ఓపికగా ఉండాలని.. బిజెపి పార్టీ పై విశ్వాసం ఉంచాలని కోరారు. ఎన్సిపి నాయకుడు అజిత్ పవార్, అతని ఎనిమిది మంది సహచరులు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన దాదాపు రెండు వారాల తర్వాత ఇది జరిగింది. ముస్తఫా షేక్ ద్వారా .. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్  అతని  సహచరులు ఏక్ నాథ్ షిండే  నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరిన తర్వాత […]

Share:

బివాండీలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్.. బిజెపి కార్యకర్తలకు  ఓపికగా ఉండాలని.. బిజెపి పార్టీ పై విశ్వాసం ఉంచాలని కోరారు. ఎన్సిపి నాయకుడు అజిత్ పవార్, అతని ఎనిమిది మంది సహచరులు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన దాదాపు రెండు వారాల తర్వాత ఇది జరిగింది.

ముస్తఫా షేక్ ద్వారా .. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్  అతని  సహచరులు ఏక్ నాథ్ షిండే  నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరిన తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్  మొదటిసారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో తన సహచరుల మధ్యలో చాలా సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయని అంగీకరించారు. అయితే వారు ఓపికగా ఉండాలని, పార్టీపై విశ్వాసాన్ని కొనసాగించాలని కోరారు. 2019లో బిజెపికి ద్రోహం చేసినా ఉద్దవ్ టాక్రేపై  ఫడ్నవిస్ మరోసారి నిందలు మోపారు. అన్యాయం జరిగినప్పుడల్లా కొత్త ఏక్ నాథ్ షిండే ఉద్భవిస్తారని పేర్కొన్నారు. బిజెపి 2024 ప్రచారంలో భాగంగా గురువారం బివాండిలో క్యాంపు నిర్వహించారు. 

ముఖ్యమంత్రి సీటు పంచుకోవడంపై ఎలాంటి చర్చ జరగలేదని దేవేంద్ర ఫడ్నవిస్ వివిధ కార్యాలయ బేరర్లకు వివరణాత్మక కథనాన్ని అందించారు. ఫడ్నవిస్ మాట్లాడుతూ, ప్రజలు తప్పుడు ప్రమాణాలు చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. 2019లో సంకీర్ణం గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఒక రాత్రి ఉద్దవ్ థాకరే  ఫోన్ చేసి, అమిత్ షా తో ఫోన్లో మాట్లాడారని ఆయన సీఎం కావాలని చెప్పారు. కొంతసేపటికి… ఈ నిర్ణయం తాను మాత్రమే తీసుకోలేనని అమిత్ షాకీ ఫోన్ చేసి కన్ఫామ్ చేశానని చెప్పాను….  ఒక గంటకు ఫోన్ చేసి సీఎం పదవి విషయంలో రాజీవ్ ఉండరని  చెప్పినప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కు ఫోన్ చేసి తెలియజేశారు. సంకీర్ణం జరగదని ఆయన చెప్పారు. మూడు రోజుల తర్వాత  సంకీర్ణ చర్చల కోసం పరస్పర పరిచయం ఏర్పడింది.

ఉద్ధవ్ ఇప్పుడు సీఎం పదవిపై మొండిగా లేరని నాకు చెప్పారు. అయితే ఆరు నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ఫాల్గర్  సీటును బిజెపి గెలవాలని ఆయన కోరుకున్నారు.  మేము దానికి అంగీకరించాము.  జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను మాత్రమే మాట్లాడతానని నిర్ణయించారు. బిజెపి తప్పేమీ లేదని చెప్పేందుకు పడ్నవిస్  ఈ వివరాలను పంచుకున్నారు. ఇదంతా నీతో చెప్పడానికి కారణం మన తప్పేమీ కాదు. పార్టీలు బద్దలు కొడుతున్నాయని జనాలు అంటున్నారు. అయితే ఇదంతా ఎవరు మొదలుపెట్టారు. మనం ధర్మాన్ని పాటిస్తున్నాం. కరణ్ కవచం తొలగిపోయే వరకు అతని ఓడించలేము అని..  శ్రీకృష్ణుడు తెలుసా..?  అని బిజెపి నేత అన్నారు.

 ఏక్నాథ్ షిండే అజిత్ పవర్ సీనియర్ రాజకీయ నాయకులు నేను చెబితే వాళ్ళు ఏమి చేయరు. తమకు అన్యాయం జరిగిందని వారికి తెలుసు. శివసేనతో ఇది మా భావోద్వేగ కూటమి మరియు ఎన్సీపీతో ఇది రాజకీయ క్యూటమే కానీ 10-15 ఏళ్లలో భావోద్వేగ కూటమిగా మార్చవచ్చు. అని దేవేంద్ర  పడ్నవిస్  అన్నారు. 2019 నుంచి వచ్చిన ప్రశ్నలను 2023ల పరిష్కరించామని 2023 ప్రశ్నలకు 2026ల సమాధానాలు లభిస్తాయని, ఫడ్నవిస్ తన సహోదకులకు హామీ ఇచ్చారు. పార్టీపై విశ్వాసాన్ని కొనసాగించాలని వారిని కోరారు. తన జవాబుదారీతనం గురించి వారికి హామీ ఇచ్చారు.

” మాపై నమ్మకం ఉంచండి. నేను మీకు జవాబుదారీగా ఉంటాను. అని బిజెపి నాయకుడు అన్నారు”. తదుపరి మంత్రివర్గం విస్తరణలో ఒక మహిళ ప్రమాణ స్వీకారం చేస్తుందని పేర్కొంటూ.. ఫడ్నవిస్ ముగించారు.