నెట్టింట వైరల్ ​ అవుతున్న పోలీస్​ ప్రీ వెడ్డింగ్​ షూట్​..

ప్రీ వెడ్డింగ్​ షూట్​.. ఇప్పుడు ఇదో ట్రెండ్​. పెళ్లి చేసుకునే జంటలకు ఇప్పుడు ఇదో ప్రత్యేకం. అదే షూట్​ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేస్తారు. అన్నింటి కన్నా భిన్నంగా ఉన్నవి నెట్టింట చక్కర్లు కొడతాయి. అయితే ఈ జంట చేసిన ప్రీ వెడ్డింగ్​ షూట్​ మాత్రం వైరల్​ అయింది. ఈ ఇద్దరి పోలీసు అధికారులు చేసిన వీడియో.. ఏకంగా హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ దృష్టికి వెళ్లి.. ట్వీట్​ కూడా చేశారు. ఈ మధ్య […]

Share:

ప్రీ వెడ్డింగ్​ షూట్​.. ఇప్పుడు ఇదో ట్రెండ్​. పెళ్లి చేసుకునే జంటలకు ఇప్పుడు ఇదో ప్రత్యేకం. అదే షూట్​ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేస్తారు. అన్నింటి కన్నా భిన్నంగా ఉన్నవి నెట్టింట చక్కర్లు కొడతాయి. అయితే ఈ జంట చేసిన ప్రీ వెడ్డింగ్​ షూట్​ మాత్రం వైరల్​ అయింది. ఈ ఇద్దరి పోలీసు అధికారులు చేసిన వీడియో.. ఏకంగా హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ దృష్టికి వెళ్లి.. ట్వీట్​ కూడా చేశారు.

ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు నూతన వధూవరులుగా కాబోయేవారు ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు చేయడం ఫ్యాషన్​గా మారిపోయింది. అందుకోసం వారు వివిధ ప్రాంతాలకు వెళుతూ.. విభిన్న రీతుల్లో ఫొటోలు, వీడియోలకు ఫోజ్​లు ఇస్తుంటారు. అందులో జీవిత భాగస్వామితో కలిసి ఉన్న ఓ మంచి వీడియోను షూట్​ చేసి.. దానినే ఆహ్వానంగా మిత్రులకు, బంధువులకు షేర్​ చేస్తుంటారు. ఇంకా ఆ షూట్​నే పదిరోజుల నుంచి వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, పేస్​బుక్​ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తారు. అయితే ఓ నూతన జంట మాత్రం వినూత్నంగా ఆలోచిస్తూ.. తమ వృత్తిని అందులో చూపించాలనే భావంతో ప్రీ వెడ్డింగ్​ షూట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనిపై కొందరు విమర్శలు చేస్తే.. మరికొంత మంది వారిని మెచ్చుకుంటున్నారు. అదే తెలంగాణ పోలీసు జంట చేసిన షూట్​.

త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న తెలంగాణ పోలీసు జంట ప్రీ వెడ్డింగ్​ షూట్ చేశారు. వారిద్దరూ పోలీసు అధికారులే కావడంతో ఆ అంశాన్ని ప్రతిబించేలా షూట్​లో పాల్గొన్నారు. పెళ్లికి ఆహ్వానం పంపుతూ బంధు, మిత్రులకు షేర్​ చేశారు. అది కాస్త సోషల్​ మీడియాలోకి వెళ్లడంతో ట్రెండ్​ అయి మిశ్రమ స్పందన వచ్చింది. దీనిపై కొంత మంది పోలీస్​ యూనిఫామ్​ను సొంత అవసరాలకు వాడుకుంటారా అంటూ విమర్శిస్తే.. మరికొంత మంది మాత్రం సపోర్టు చేశారు. ఈ విషయంపై తాజాగా హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్  తన ఎక్స్​​ వేదికగా స్పందించారు.

సీవీ ఆనంద్ స్పందన

‘‘నేను ఈ వీడియోకి సంబంధించి మిశ్రమ స్పందనలను చూశాను. నిజాయితీగా చెప్పాలంటే, పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంలో ఇద్దరు ఎస్సైలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ఇంకా అదో గొప్ప విషయం, కానీ కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. పోలీసు ఉద్యోగం అంటే కత్తిమీద సాములాంటింది… ముఖ్యంగా మహిళల విషయంలో మరింత కష్టం. అయితే, ఆమె పని చేస్తున్న డిపార్ట్‌మెంట్‌లోనే ఆమె తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొని మూడు ముళ్ల బంధంతో ఒక్కతవ్వడం సంతోషించాల్సిన విషయం. ఇద్దరు పోలీసు అధికారులు, పోలీసు డిపార్ట్‌మెంట్ వస్తువులు, గుర్తులను ఉపయోగించడాన్ని నేను తప్పుగా భావించడం లేదు. వారు మాకు ముందే తెలియజేసి ఉండి, అనుమతి కోరి ఉంటే మేం కచ్చితంగా షూట్‌కి పర్మిషన్ ఇచ్చి ఉండేవాళ్లం. దీనిపై మనలో కొందరికి కోపం రావచ్చు. వారు తమ పెళ్లికి నన్ను పిలవలేదు, అయినా నేను వారిని కలిసి, వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే, సరైన అనుమతి లేకుండా దీన్ని మరెవరూ రిపీట్ చేయవద్దని నేను కోరుతున్నాను’’ అని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా భావన అనే యువతి పనిచేస్తున్నారు. అదే స్టేషన్ లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్న రావూరి కిషన్ కూడా పని చేస్తున్నారు. కొంత కాలంగా వీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లికి కూడా సిద్ధం అయ్యారు. పెళ్లికి ముందు జరుపుకునే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పోలీస్ స్టేషన్ నే వేదికగా చేసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అది కూడా యూనిఫామ్ లోనే వీడియో షూట్ చేశారు. పైగా పోలీస్ వాహనంతో వెడ్డింగ్ షూట్ చేశారు. మూడు సింహాల బొమ్మను, యూనిఫాం, నేమ్ బ్యాడ్జ్, బెల్ట్ బకెట్ వంటివి కూడా ప్రీ వెడ్డింగ్ షూట్‌లో భాగం చేసేశారు. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ని ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్‌కి వాడుకోవడం విపరీతంగా విమర్శల పాలు అవుతోంది.