వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో మరో ముగ్గురు దుర్మరణం

వెస్ట్ బెంగాల్ పంచాయతీ ఎలక్షన్స్ లో చనిపోయిన వారి సంఖ్య 23 కు చేరింది. మరో ముగ్గురు హత్యకు గురయ్యారని టిఎంసి తెలియజేసింది. టైట్ సెక్యూరిటీ ఇచ్చిన  కూడా ముగ్గురు చనిపోవడం గమనార్హం.  ముర్సీదాబాద్ లో ఈ నెల 9న చనిపోయిన కాంగ్రెస్ వర్కర్ ఇంటికి గవర్నర్ సి వి ఆనంద్ వెళ్లి పరామర్శించాడు. శనివారం పొద్దున ఏడు గంటలకు గట్టి సెక్యూరిటీతో ఎలక్షన్స్ మొదలుపెట్టారు. అయినా కూడా ముగ్గురు చనిపోవడం గమనార్ధం. జూన్ 8న కూడా […]

Share:

వెస్ట్ బెంగాల్ పంచాయతీ ఎలక్షన్స్ లో చనిపోయిన వారి సంఖ్య 23 కు చేరింది. మరో ముగ్గురు హత్యకు గురయ్యారని టిఎంసి తెలియజేసింది. టైట్ సెక్యూరిటీ ఇచ్చిన

 కూడా ముగ్గురు చనిపోవడం గమనార్హం. 

ముర్సీదాబాద్ లో ఈ నెల 9న చనిపోయిన కాంగ్రెస్ వర్కర్ ఇంటికి గవర్నర్ సి వి ఆనంద్ వెళ్లి పరామర్శించాడు. శనివారం పొద్దున ఏడు గంటలకు గట్టి సెక్యూరిటీతో ఎలక్షన్స్ మొదలుపెట్టారు. అయినా కూడా ముగ్గురు చనిపోవడం గమనార్ధం. జూన్ 8న కూడా స్టేట్ లో చాలా చోట్ల ఇలాగే జరిగింది అప్పుడు కూడా చాలామంది చనిపోయారు. అందులో ముర్సీదాబాద్ కు చెందిన అబ్దుల్లా అలీ కూడా ఉన్నాడు. కూచ్బెహార్ లో పోలింగ్ స్టేషన్లో కొన్ని పత్రాలు కాల్చేశారు. త్రుణమూల్ కాంగ్రెస్  తమ పార్టీ వర్కర్స్ చనిపోయారని కన్ఫామ్ చేసింది. 

ఇక్కడ సెక్యూరిటీ సరిగా లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని టిఎంసి ట్వీట్ చేసింది. ప్రజలకంటే తమ సొంత ప్రయోజనాల కోసమే నేతలు చూసుకుంటున్నారని టీ ఎం సి ఆరోపించింది. కర్ గ్రామ్ లో 52 ఏళ్ల టీఎంసీ వర్కర్ సతేహుద్దీన్ షేక్ ని చంపేశారు. 

గవర్నర్ సివి ఆనంద బోస్ పరామర్శ :

బెంగాల్లో చనిపోయిన ప్రజలు అందరి ఇంటికి వెళ్లి గవర్నర్ సివి ఆనంద బోస్ పరామర్శించాడు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని తను తెలిపాడు. ఇక్కడ 2.06 లక్షల మంది క్యాండిడేట్స్ ఎలక్షన్స్ లో పాల్గొన్నారు.  73,887 పంచాయతీ సీట్స్ ఉన్నాయి. ఇందులో 63,229 గ్రామపంచాయతీ సీట్లు. 9730 పంచాయతీ సమితి సీట్స్ ఉన్నాయి. 

ఏది ఏమైనా పోలింగ్ బూత్ దగ్గర ఇప్పటికి పెద్దపెద్ద లైన్లు ఉన్నాయి. మన దేశంలో ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఏవో ఒక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఎంతో కొంత ప్రాణా నష్టం జరుగుతూనే ఉంది. 

ఎలక్షన్స్ టైంలో ప్రభుత్వాలు చేయాల్సిన పనులేంటి?: 

ఎలక్షన్స్ టైం లో ప్రభుత్వాలు ప్రజల గురించి కూడా కాస్త ఆలోచించాలి. ఓటింగ్ సమయంలో కలుగుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించాలి. ముఖ్యంగా కఠిన భద్రత మధ్య ఎలక్షన్స్ నిర్వహించాలి. అలా కాదని నిబంధనలు గాలికి వదిలేస్తే వెస్ట్ బెంగాల్లో జరిగినట్టే జరుగుతుంది. 

గవర్నమెంట్ తప్పిదం వల్ల ఇక్కడ 23 మంది చనిపోయారు. ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ప్రజలు ఓటెయ్యాలంటే కూడా భయపడతారు. అలా జరగకూడదంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ టైం లో టైట్ సెక్యూరిటీ ఇవ్వాలి. పోలింగ్ బూత్ ల దగ్గర ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా రౌడీ షీటర్ లను ముందుగానే అదుపు చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రజల్లో భయం పోయి ఓటు వేయడానికి ముందుకు వస్తారు. అప్పుడు మన సొసైటీలో ఒక మార్పు అనేది వస్తుంది. ఎలక్షన్ టైం లో డబ్బు పంపిణీ చేయకుండా అడ్డుపడాలి. ఇలా చేయడం వల్ల నిజమైన నాయకులు గెలుస్తారు. మన సొసైటీకి కావాల్సింది అలాంటి వాళ్లే కదా. ఇంకా ఓటు వేస్తే ఏదైనా ఇస్తామని చెప్పే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా మార్పు వస్తుంది. అప్పుడు ఇలాంటి ఘటనలు ఆగిపోతాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుకుందాం.