కోటాలో ఎక్కువ అవుతున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు

బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలి అని తల్లి తండ్రులను బంధు మిత్రులను వదిలి పై చదువుల కోసం ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉంటూ చదువుకునే విద్యార్థులు చాలా మంది ఉంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రాంక్ ల మోజులో పడి కోచింగ్ సెంటర్లు లేదా ఎద్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లు విద్యార్థుల మీద తీవ్ర ఒత్తిడి కలుగ జేస్తున్నాయి. విద్యార్థులకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం రాంక్ కోసం మార్కుల కోసం చదివే […]

Share:

బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలి అని తల్లి తండ్రులను బంధు మిత్రులను వదిలి పై చదువుల కోసం ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉంటూ చదువుకునే విద్యార్థులు చాలా మంది ఉంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రాంక్ ల మోజులో పడి కోచింగ్ సెంటర్లు లేదా ఎద్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లు విద్యార్థుల మీద తీవ్ర ఒత్తిడి కలుగ జేస్తున్నాయి. విద్యార్థులకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం రాంక్ కోసం మార్కుల కోసం చదివే మిషన్ లాగా వారిని తయారు చేస్తున్నాయి. బట్టీ పట్టి చదివే విధానం వలన విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదు అని తెలిసినా కూడా విద్యార్థులను మార్కుల కోసం తీవ్రమైన పోటీ కి గురి చేస్తున్నాయి. కేవలం రాజస్థాన్  రాష్ట్రం లోని కోటా జిల్లాలోనే జనవరి నుండి 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 

తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ 

చదువు కోసం అని ఇల్లు వదిలి వెళ్ళిన విద్యార్థులు హాస్టల్ లేదా పీజీ లో పడే బాధలు లేదా వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అందరూ తల్లి తండ్రులతో చెప్పుకోలేక పోతున్నారు. కొంతమంది తల్లి తండ్రులు పిల్లలను అర్థం చేసుకోవడం లేదు కూడా. ఇలాంటి సమయాల్లో విద్యార్థులు మానసిక సంఘర్షణ కు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడానికి కోటా జిల్లా కలెక్టర్ ఓపీ బంకర్ ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఆలస్యం చేయకుండా ఈ విధానాన్ని అమలు పరచాలి అని అన్ని కోచింగ్ సెంటర్ లను, పీజీ లను, హాస్టల్ లను సూచించారు. 

15 రోజులకు ఒకసారి మానసిక పరీక్షలు

ఇంటికి దూరంగా హాస్టల్ లేదా పేజీలో ఉంటున్న విద్యార్థుల మానసిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రతీ 15 రోజులకు వారికి మానసిక పరీక్షలు నిర్వహించాలి అని నిర్ణయించారు. జిల్లాలో చదువుతున్న పిల్లల తల్లి తండ్రుల ప్రతినిధులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రతినిధుల బృందం విద్యార్థుల తల్లి తండ్రుల తో సన్నిహితంగా ఉండాలి అని పేర్కొన్నారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ లు, హాస్టళ్లు, పీజీ లలో విద్యార్థులకు అందించే సౌకర్యాలలో ఖచ్చితమైన మార్గదర్శకాలు అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ప్రతీ 15 రోజులకు విద్యార్థులతో మాట్లాడడం ద్వారా డిప్రెషన్ లో ఉన్న విద్యార్థులను గుర్తించవచ్చు అని ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ అందించవచ్చు అని వెల్లడించారు. తద్వారా విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

తల్లి తండ్రులు కూడా ఆలోచించాలి

విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడికి కేవలం కోచింగ్ సెంటర్లు మాత్రమే కారణం కాదు. చాలా మంది విద్యార్థులు వారి తల్లి తండ్రులతో మనసు విప్పి మాట్లాడుకోవడం కూడా ఒక కారణమే. డబ్బు కడుతున్నాం కదా ఎలాగైనా రాంక్ సాధించాలి అని చెప్పే తల్లి తండ్రుల ధోరణి కూడా ఎక్కువ అయిపోయింది. పరీక్షలో ఫెయిల్ అయితే ఇంట్లో చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. పరీక్షలో ఫెయిల్ ఐతే జీవితం అక్కడితో ఆగిపోదు అనే దైర్యం తల్లి తండ్రులే పిల్లలకు ఇవ్వాలి. లక్షలాది మంది పోటీ పడుతున్న పరీక్షలో అందరికీ టాప్ ర్యాంక్ లు రావు అని కూడా తల్లి తండ్రులు గమనించాలి. కోటా జిల్లా కలెక్టర్ ఓపీ బంకర్ గారు నిర్ణయం చాలా మంచిది అని దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.