తెలంగాణలో గెలవబోతున్నాం

దేశంలో ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకు బీజేపీ దారి మళ్లింపు వ్యూహాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వాటిని తిప్పి కొట్టి ప్రజలకు నిజా నిజాలు తెలియజేస్తామని అన్నారు. కర్నాటకలో బీజేపీ దారి మళ్లింపు రాజకీయాలు పని చేయలేదని చెప్పారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్‌లలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాకుండా 2024  లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యపోయేలా […]

Share:

దేశంలో ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకు బీజేపీ దారి మళ్లింపు వ్యూహాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వాటిని తిప్పి కొట్టి ప్రజలకు నిజా నిజాలు తెలియజేస్తామని అన్నారు. కర్నాటకలో బీజేపీ దారి మళ్లింపు రాజకీయాలు పని చేయలేదని చెప్పారు.

తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్‌లలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాకుండా 2024  లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యపోయేలా తమ ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తాము అధికారంలోకి వచ్చిన కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ చాలా నేర్చుకుందని అని చెప్పారు. కర్నాటకలో చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నామని, వేరే రాష్ట్రాల్లో కూడా కర్నాటకలో మాదిరే పనిచేసి గెలుస్తామని రాహుల్ స్పష్టం చేశారు. 

అస్సాంలోని ప్రతిదిన్ మీడియా నెట్ వర్క్ నిర్వహించిన కాన్‌క్లేవ్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అంశం తెరపైకి తెచ్చి, ప్రజల వాస్తవ సమస్యలపై దృష్టి మరల్చిందని ఆరోపించారు. ఇది బీజేపీ దారి మళ్లింపు  వ్యూహాలలో ఒకటి అని పేర్కొన్నారు. 

‘‘మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో మేము కచ్చితంగా గెలుస్తాం. రాజస్థాన్‌లో గెలుపునకు దగ్గరగా ఉన్నాం. అందుకే అక్కడ కూడా గెలుస్తామని భావిస్తున్నాం. బీజేపీ చేసిన అంతర్గత సర్వేల్లో కూడా ఇది తేలింది. తెలంగాణలో కూడా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి” అని రాహుల్ గాంధీ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. 

కర్నాటక నుంచి పాఠం నేర్చుకున్నాం..

‘‘కర్నాటకలో కాంగ్రెస్‌చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది. దృష్టి మరల్చడం ద్వారా మేం చేయాలనుకున్నది చెప్పనీయకుండా చేసి బీజేపీ గెలుస్తుందని గుర్తించాం. అందుకే మేము మా పార్టీ ఏం చేస్తుందో చెబుతూ ఎన్నికల్లో పోరాడాం. ఈ రోజు మీరు చూస్తున్నారు. ఉందు ఎంపీ బిధూరి, తర్వాత నిశికాంత్ దూబే వచ్చారు. ఇదంత కుల గణన ఆలోచన నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం. మేం ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తిన ప్రతిసారి.. వాళ్లు దృష్టి మరల్చడానికి ఇలా చేస్తారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మేం ఇప్పుడు నేర్చుకున్నాం. మేము కర్నాటక ప్రజలకు ఒక విజన్ ఇచ్చాం. ఇది మీ కోసం ఏర్పాటు చేయబోయే సామాజిక భద్రతా కార్యక్రమని చెప్పాం” అని అన్నారు. 

దేశంలో మీడియాపై బీజేపీ పట్టు సాధించిందని, ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడినా వక్రీకరిస్తున్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బీజేపీ తన స్వాధీనంలోకి తీసుకుందని, అందుకే ప్రజలతో మాట్లాడటం తమకు సాధ్యపడటం లేదన్నారు.

దేశంలో ప్రధాన సమస్యలు సంపద ఒకేచోట కేంద్రీకృతమై ఉండటం, సంపదలో భారీ అసమానతలు, భారీ నిరుద్యోగం, అట్టడుగు కులాలు, ఓబీసీ, గిరిజన వర్గాలకు అన్యాయం, ధరల పెరుగుల వంటి సమస్యలు ఉన్నాని, వీటి గురించి బీజేపీ పట్టించుకోకపోగా, జనాల దృష్టిని మళ్లించిందన్నారు. అలాగే, దేశం పేరు మార్పు కూడా అందులో భాగంగా జరిగిన కార్యక్రమేనన్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని తమకు అర్థం అవుతుందని, వాటిని తామే చేయనివ్వమని వెల్లడించారు. 

మరోవైపు మహిళా  రిజర్వేషన్ బిల్లును  ఆమోదించిన మరుసటి రోజు నుంచే అమలు చేయొచ్చని, కానీ, 2029 తర్వాత అమలు చేస్తామని చెప్పడం ఎంటని అని రాహుల్ అన్నారు. మహిళా రిజర్వేషన్కు జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పదేండ్ల తర్వాత రిజర్వేషన్ల వల్ల మహిళలు లబ్ధి పొందుతారని చెప్పే బదులు , ఇప్పుడే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.