వాటర్బాటిల్ బిల్లు చూసి షాక్ అయిన యువతి

చాలామంది రెస్టారెంట్లకు వెళుతూ ఉంటారు కదా.. కానీ కొన్ని కొన్ని సార్లు మనకి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. రెస్టారెంట్లో తిన్న దాని కన్నా ఆ పక్కన మనం యూస్ చేసిన వాటర్ బాటిల్ రేట్ ఎక్కువ ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?? ఇదే పరిస్థితి ఒక యువతికి ఎదురైంది. రెస్టారెంట్లో డిన్నర్ చేయడానికి వెళ్ళిన తనకి, డిన్నర్ చేసిన తర్వాత కళ్ళు చెదిరే బిల్లు కళ్ళ ముందు కనిపించింది. తాను తిన్న దానితో పోలిస్తే వాటర్ బాటిల్ […]

Share:

చాలామంది రెస్టారెంట్లకు వెళుతూ ఉంటారు కదా.. కానీ కొన్ని కొన్ని సార్లు మనకి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. రెస్టారెంట్లో తిన్న దాని కన్నా ఆ పక్కన మనం యూస్ చేసిన వాటర్ బాటిల్ రేట్ ఎక్కువ ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?? ఇదే పరిస్థితి ఒక యువతికి ఎదురైంది. రెస్టారెంట్లో డిన్నర్ చేయడానికి వెళ్ళిన తనకి, డిన్నర్ చేసిన తర్వాత కళ్ళు చెదిరే బిల్లు కళ్ళ ముందు కనిపించింది. తాను తిన్న దానితో పోలిస్తే వాటర్ బాటిల్ రేట్ చూసి ఆశ్చర్యపోయింది. 

అసలు ఏం జరిగింది: 

హాయిగా ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్లిన యువతికి వాటర్ బాటిల్ బిల్లు చూసి షాక్ తగిలిన పని జరిగింది. ఆ రెస్టారెంట్ లో వాటర్ బాటిల్ విలువ 350 రూపాయలు. అవునండి, మీరు విన్నది నిజమే, వాటర్ బాటిల్ బిల్లు చూసే ఆ యువతి కూడా మనలాగే షాక్ అయింది. అంతేకాదు, ఆ యువతకి ఆ వాటర్ బాటిల్ బిల్లు చూసి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఈ రెస్టారెంట్ లో ఏమి చేయలేక, తాను ఈ పొరపాటు మళ్ళీ ఎప్పుడు చేయకూడదని తన మనసులోనే అనుకుని, అంతేకాకుండా ఆ రెస్టారెంట్ నుంచి 350 రూపాయల వాటర్ బాటిల్ తనతో పాటే ఇంటికి తీసుకువచ్చింది ఆ అమ్మాయి. 

ట్విట్టర్ పోస్ట్: 

అంతేకాదు తనతో పాటు ఇంటికి తీసుకువచ్చిన ఆ ఓటర్ బాటిల్ ఫోటో తీసి, రెస్టారెంట్లో తనకి ఎదురైన సంఘటనను అందరికీ చెబుతూ, ఇలాంటి సంఘటన మీకు ఎదురైతే ఏం చేస్తారు? మీరు కూడా బాటిల్ ని ఇంటికి తీసుకువస్తారా? అనే ప్రశ్న కూడా వేసింది ఆ యువతీ. రితిక అనే యువతి తన ట్విట్టర్లో వాటర్ బాటిల్ గురించి పోస్ట్ పెట్టింది. ట్విట్టర్లో జులై 10న తన పోస్ట్ చేసిన పోస్ట్ని సుమారు 1.7 లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా, ఆ పోస్ట్ కి రెండు వేల మంది లైక్స్ కూడా కొట్టారు. ఈ పోస్టులో మనకి కనిపిస్తున్న వాటర్ బాటిల్ 600ml క్వాంటిటీ తో ఉన్న బాటిల్. అయితే ఫ్రెండ్ తో కలిసి హాయిగా భోజనం చేయడానికి వెళ్ళిన తనకి, బాటిల్ రేట్ చూసి షాక్ అయ్యా అంటూ ట్విట్టర్ లో రాసుకోవచ్చు. 

అయితే ప్రస్తుతం ఈ ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చాలా మంది రితిక చేసిన పోస్ట్ చూసి వారికి కూడా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఇదే తరహాలో బాటిల్ రేట్ చూసి షాక్ అయ్యామంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. చాలామంది వారు కూడా తమతో పాటు ఆ వాటర్ బాటిల్ ని ఇంటికి తీసుకువచ్చాము అని రిప్లై పెట్టారు.

మరికొంతమంది ఆ ట్విట్టర్ పోస్ట్ కి రిప్లై ఇస్తూ, తాము రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు తమతో పాటు వాటర్ బాటిల్ తీసుకువెళ్తున్నామని, వాటర్ బాటిల్ కోసం 350 రూపాయలు ఖర్చు పెట్టడం వ్యర్థం అంటూ కామెంట్ చేశారు. మరి కొంతమంది,’ ధనవంతులు వాటర్ బాటిల్ కోసం ఇలాగే ఖర్చు చేస్తారు అంటూ చిలిపిగా రిప్లై ఇస్తున్నారు. మరి కొంతమంది కూడా వారు ఇంటికి తీసుకువచ్చిన వాటర్ బాటిల్ ఫోటోలు పెడుతూ, రెస్టారెంట్లో వారికి ఎదురైనా సంఘటనని వివరిస్తూ రాశారు. 

ఏది ఏమైనాప్పటికీ, ఒక చిన్న వాటర్ బాటిల్ కోసం 350 రూపాయల ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్ మనతో తీసుకువెళ్లడం ఉత్తమం.