ప‌ర్స‌న‌ల్ ప్ర‌దేశాల్లో పోర్న్ చూడ‌టం త‌ప్పు కాదు

పోర్న్ వీడియోలు, ఫొటోలు చూడటం అసభ్యకరం.. అదో నేరం. అందరూ ఇదే అభిప్రాయపడుతున్నారు. కానీ కేరళ కోర్టు మాత్రం ఇలాంటి కేసులో కీలక తీర్పు ఇచ్చింది. అశ్లీల ఫోటోలు, వీడియోలను ఇతరులకు చూపించకుండా… ఒంటరిగా చూడటం చట్టం ప్రకారం నేరం కాదని పేర్కొంది. అది ప్రతి వ్యక్తి వ్యక్తిగత ఎంపిక అని చెప్పింది కేరళ  హైకోర్టు. అది నేరం అని చెప్పడం సరికాదని… ఒక వ్యక్తి గోప్యతలోకి చొరబడి.. అతని వ్యక్తిగత ప్రాధాన్యతల్లో జోక్యం చేసుకోవడమే అని […]

Share:

పోర్న్ వీడియోలు, ఫొటోలు చూడటం అసభ్యకరం.. అదో నేరం. అందరూ ఇదే అభిప్రాయపడుతున్నారు. కానీ కేరళ కోర్టు మాత్రం ఇలాంటి కేసులో కీలక తీర్పు ఇచ్చింది. అశ్లీల ఫోటోలు, వీడియోలను ఇతరులకు చూపించకుండా… ఒంటరిగా చూడటం చట్టం ప్రకారం నేరం కాదని పేర్కొంది. అది ప్రతి వ్యక్తి వ్యక్తిగత ఎంపిక అని చెప్పింది కేరళ  హైకోర్టు. అది నేరం అని చెప్పడం సరికాదని… ఒక వ్యక్తి గోప్యతలోకి చొరబడి.. అతని వ్యక్తిగత ప్రాధాన్యతల్లో జోక్యం చేసుకోవడమే అని చెప్పింది ధర్మాసనం. 33 ఏళ్ల తరుణ్‌పై  నమోదైన కేసును కేరళ హైకోర్టు రద్దు చేసింది.  అశ్లీల వీడియోలు, ఫొటోలను బహిరంగంగా ప్రదర్శించడం, సర్క్యులేట్‌ చేయడం, పంపించడం నేరమని తెలిపింది.

2016లో అలువ ప్యాలెస్‌ వద్ద రోడ్డు పక్కన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్న 33 ఏళ్ల తరుణ్ అనే యువకుడిని పట్టుకున్న కేరళ పోలీసులు.. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ IPC సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై కేసు కొట్టేయాలని నిందితుడు తరుణ్‌ కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై కోర్టులో జస్టిస్ పివి కున్హికృష్ణణ్‌ వాదనలు విన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ యుగంలో అశ్లీల కంటెంట్   ప్రబలంగా ఉందని కోర్టు పేర్కొంది. చిన్న పిల్లలు కూడా అశ్లీల కంటెంట్‌ను సులభంగా చూడగలిగేలా తయారైందన్నారు. ఈ సందర్భంలో ఒక వ్యక్తి తన ప్రైవేట్ సమయంలో అశ్లీల వీడియోను ఇతరులకు చూపించకుండా చూస్తే నేరంగా పరిగణించబడవచ్చా? అని జస్టిస్‌ కున్హికృష్ణణ్‌ ప్రశ్నించారు.

ఫోర్న్‌ వీడియోలు, ఫొటోలను ఒంటరిగా చూడటం తప్పుకాదని, ఏ కోర్టు దానిని నేరంగా పరిగణించదని తెలిపింది కోర్టు. నిందితుడు ఈ వీడియోను బహిరంగంగా ఎవరికీ  చూపించినట్లు ఎలాంటి ఆరోపణ లేవని ధర్మాసనం పేర్కొంది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమయంలో అశ్లీల ఫోటోలు, వీడియోలను చూడటం ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం నేరం కాదని తెలిపింది. ఏదైనా అసభ్యకరమైన వీడియో కానీ ఫొటో కానీ బహిరంగంగా ప్రదర్శించడం.. షేర్‌ చేయడం వంటివి చేస్తేనే సెక్షన్ 292 ప్రకారం నేరం అవుతుందని  కేరళ హైకోర్టు తెలిపింది.

స్త్రీ వారి గోప్యతలో ఏకాభిప్రాయంతో సెక్స్ చేయడం మన దేశంలో నేరం కాదని ప్రోమియల్ పాసేజ్‌లో కోర్టు పేర్కొంది. ఏకాభిప్రాయంతో కూడిన సెక్స్ లేదా గోప్యతలో పోర్న్ వీడియో చూడడాన్ని గుర్తించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఎందుకంటే ఇవి సమాజం యొక్క ఇష్టానికి, శాసనసభ నిర్ణయానికి సంబంధించినవని కోర్ట్ తెలిపింది. నిందితుడు ఐపీసీ సెక్షన్ 292 కింద ఎలాంటి నేరం చేయలేదని, కనుకు కేసుకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రొసీడింగ్‌లు రద్దు  చేయబడతాయని, నిందితుడిపై ప్రారంభించిన క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కేరళ హైకోర్టు తీర్పును వెలువరిచింది. 

అలాగే.. చిన్నపిల్లలు సెల్‌ఫోన్లు అలవాటు చేస్తున్న తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనలు చేశారు జస్టిస్ కున్హికృష్ణన్. పిల్లలను సంతోషంగా ఉంచడానికి మొబైల్ ఫోన్‌లు ఇవ్వడం సరికాదన్నారు. తల్లిదండ్రులు దీని వెనుక ఉన్న ప్రమాదం గురించి తెలుసుకోవాలన్నారు. పిల్లలు వారి పర్యవేక్షణలో సందేశాత్మక వీడియోలను చూడటానికి అనుమతించాలే కానీ… వారికి వినోదం కోసం మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని అన్నారు. ఈ రోజుల్లో మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రతి చోటా అశ్లీల వీడియోలు సులభంగా అందుబాటులో ఉన్నాయని జస్టిస్ కున్హికృష్ణన్ అన్నారు. మైనర్లు అశ్లీల వీడియోలు చూడటం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.