హైదరాబాదులో అంబులెన్స్ హడావిడి

ఒక ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ హారన్ తో ట్రాఫిక్ మధ్యలో నుంచి హడావిడిగా వెళ్లి పక్కన సమోసా తిందామని ఆపాడు. అవునండి మీరు విన్నది నిజమే కేవలం ఆ డ్రైవర్ స్నాక్స్ తిందామని అంబులెన్స్ మధ్యలో నుంచి హడావిడిగా దూసుకు వెళ్లి కాసేపు అలా పక్కన ఆపేవైనా తిందామని అక్కడ వెహికల్ ఆపడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కొన్ని నిమిషాలపాటు ఉన్న వాహనదారులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. మామూలుగా […]

Share:

ఒక ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్ అంబులెన్స్ హారన్ తో ట్రాఫిక్ మధ్యలో నుంచి హడావిడిగా వెళ్లి పక్కన సమోసా తిందామని ఆపాడు. అవునండి మీరు విన్నది నిజమే కేవలం ఆ డ్రైవర్ స్నాక్స్ తిందామని అంబులెన్స్ మధ్యలో నుంచి హడావిడిగా దూసుకు వెళ్లి కాసేపు అలా పక్కన ఆపేవైనా తిందామని అక్కడ వెహికల్ ఆపడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

దీంతో కొన్ని నిమిషాలపాటు ఉన్న వాహనదారులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం.

మామూలుగా అయితే కారణం లేకుండా అలా ఒక అంబులెన్స్ వాహనాన్ని ఎక్కడపడితే అక్కడ అనవసరంగా వాడటం చట్ట విద్య నేరం మరియు తగిన జరిమానా కూడా పడుతుంది. అలా చేయడం వల్ల చాలామంది జనాలకు ఇబ్బంది కలుగుతుంది ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతాయి. దీనివల్ల పోలీసు వారికి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మరింత కష్టమవుతుంది. అంతేకాకుండా అందరి టైం కూడా చాలా వృధా అవుతుంది. అందుకే ప్రజల ప్రాణాలు కాపాడే అంబులెన్స్ ని సొంత ప్రయోగాలకు మాత్రం వాడకూడదు. 

అసలు ఇంతకీ ఈ కథలో ఏమైంది అంటే ట్రాఫిక్ పోలీస్ చెప్పిన సమాచారం ప్రకారం, డ్రైవర్ అంబులెన్స్ ట్రాఫిక్ మధ్యలో నుంచి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలా వస్తుందో అలా హారన్ కొట్టుకుంటూ ట్రాఫిక్ మధ్యలో నుంచి వచ్చి కొన్ని మీటర్లు ముందుకెళ్లాక పక్కకి నిలిపి వేశాడు. ట్రాఫిక్ పోలీస్ పరిగెత్తుకుని వెళ్లి ఆ అంబులెన్స్ డ్రైవర్ ని ప్రశ్నించగా, అతడు చెప్పిన సమాధానం విని ట్రాఫిక్ పోలీస్ షాక్ అయ్యాడు!. అంబులెన్స్ డ్రైవర్ స్నాక్స్ కొనడం కోసం తన వాహనాన్ని పక్కకు ఆపాడని చెప్పాడు. అంబులెన్స్ లో ఏ పేషెంట్లు లేరు కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. అయితే ట్రాఫిక్ పోలీస్ వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కేవలం ఎమర్జెన్సీ సమయంలో తప్ప మిగతా సమయంలో ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కానీ కలిగించకూడదని, అలా కలిగిస్తే చట్ట విద్య నేరమని తెలిపారు.

అసలు ఏం జరిగింది:

ఈ సంఘటన సోమవారం రాత్రి బషీర్బాగ్ జంక్షన్లో చోటు చేసుకుంది. ఆ సమయంలో చాలా బిజీగా ఉంటుంది ఎక్కడికక్కడ వాహనాలు హడావిడిగా తిరుగుతూనే ఉంటాయి ఆ సమయంలో హఠాత్తుగా ఒక అంబులెన్స్ హారన్ కొట్టుకుంటూ చాలా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ లాగా ట్రాఫిక్ మధ్యలో నుంచి దూసుకెళ్లింది ఆ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ నీ ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్ కి దారి ఇచ్చాడు. ఒక 100 మీటర్ల దాటిన తర్వాత పక్కకు నిలిపాడు. ట్రాఫిక్ పోలీస్ వెంటనే పరిగెత్తుకొని వెళ్లి ప్రశ్నించగా అంబులెన్స్ డ్రైవర్ కేవలం నొక్కుకుందామని పక్కకి ఆపడం చెప్పాడు.

సీసీటీవీలో రికార్డు అయిన ఘటన:

ఈ సంఘటన మొత్తం సిసి టీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా రికార్డయింది. ట్రాఫిక్ పోలీస్ చెప్పిన వివరాల ప్రకారం అంబులెన్స్ డ్రైవర్ కేవలం చి కొనుక్కోవడం కోసమే ఆపాడని ఎటువంటి ఎమర్జెన్సీ లేదని కేవలం అంబులెన్స్ లో తనతో పాటు ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారని చెప్పాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే అతని అదుపులోకి తీసుకుని తగిన ఆధారాలను కూడా సేకరించి అతనిపై కేసు నమోదు చేశారు.

అంబులెన్స్ కేవలం ఎమర్జెన్సీ సమయంలో తప్ప మిగతా సమయంలో ఎటువంటి అంతరాయం కలిగించకూడదు. అలా కలిగించినట్లయితే అది చట్ట విద్య నేరం అలా చేసినట్లయితే పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుంది ట్రాఫిక్ వైలేషన్స్ కింద కేసు కట్టి చట్టం ముందు ప్రవేశపెడుతుంది. అలా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించడం వల్ల అతనిపై కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా భారీ జరిమానా కూడా పడుతుంది. ఇలా చేయడం చట్ట విద్య నేరం