నకిలీ పత్రాలతో భూములను ఆక్రమించిన వ్యక్తిని అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో అతిపెద్ద నగరంగా మారింది.. రోజురోజుకు మహానగరంగా మారిపోతూ స్మార్ట్‌గా అభివృద్ధి చెందుతోంది.. దీంతో భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.  ఫలితంగా భూకబ్జాలు కూడా పెరిగిపోతున్నాయి.. స్థలం కనిపిస్తే చాలు కొంతమంది వాటిపై కన్నేస్తూ అందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  ముఖ్యంగా చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని నకిలీ పత్రాలను సృష్టిస్తూ రైతులను అన్యాయం చేస్తూ.. భూ విక్రయాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి దందాలు బాగా […]

Share:

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో అతిపెద్ద నగరంగా మారింది.. రోజురోజుకు మహానగరంగా మారిపోతూ స్మార్ట్‌గా అభివృద్ధి చెందుతోంది.. దీంతో భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.  ఫలితంగా భూకబ్జాలు కూడా పెరిగిపోతున్నాయి.. స్థలం కనిపిస్తే చాలు కొంతమంది వాటిపై కన్నేస్తూ అందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  ముఖ్యంగా చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని నకిలీ పత్రాలను సృష్టిస్తూ రైతులను అన్యాయం చేస్తూ.. భూ విక్రయాలు జరుపుతున్నారు.

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి దందాలు బాగా పెరిగిపోయాయి.. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథన్‌కు భూ వివాదాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తూ ఉండడం గమనార్హం. వీటికి చెక్ పెట్టడానికి ఆయన టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. భూ కబ్జాదారులపై దృష్టి సారించిన పోలీసులు కబ్జాదారుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 42 మంది వరకు భూకబ్జాలకు పాల్పడినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు.. అయితే వీరికి ఎవరు సహకరించారనే కోణంలో విచారణ చేపడుతూ ఉండడం గమనార్హం. అనుమానితులను తమ కార్యాలయానికి రావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.  దీంతో కొంతమంది రాజకీయ నాయకుల రంగ ప్రవేశం కూడా చేయడం జరిగింది.  ముఖ్యంగా తమ వారిని పిలవద్దు అని కూడా చెబుతున్నారట.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి భూకబ్జా కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు.  అసలు విషయంలోకి వెళ్తే నకిలీ పత్రాలను సృష్టించి శేరల్ చంద్రమౌళి అనే వ్యక్తికి సంబంధించిన భూములను వ్యాపారి గడ్డం యుగంధర్ అక్రమంగా ఆక్రమించుకున్నాడు.  ఈ విషయంపై శేరల్ చంద్రమౌళి పోలీసులను ఆశ్రయించగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అతడిని అరెస్టు చేసి అతని నుంచి రూ.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శేరల్ చంద్రమౌళికి చెందిన 20 గుంటల భూమిని నకిలీ పత్రాలతో తన పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.

ఇటీవల బాధితురాలు వరంగల్ సిపి ఏవి రంగనాథ్‌ను ఆశ్రయించడంతో ఆయన టాస్క్ ఫోర్సును ఏసీపి ఎం జితేందర్ రెడ్డిని విచారణకు ఆదేశించారు. కొంత భూమిని తమ కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో బాధితురాలికి సహకరించిన యుగంధర్ నకిలీ పత్రాలు సృష్టించి చంద్రమౌళి కుమారుల సంతకాలను ఫోర్జరీ చేసి భూమిని 2015 తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు విచారణలో తేలింది. అంతేకాదు మరో 3.25 ఎకరాల భూమిని అమ్మాలని చంద్రమోహన్ నీ ఆయన భార్య మణెమ్మలను బలవంతం పెట్టి వారి దగ్గర నుంచి సుమారుగా రూ.13 లక్షల నగదును అప్పుగా తీసుకున్నాడు.

ఇక చంద్రమౌళి నకిలీ ఋణ పత్రాలతో మణెమ్మను కూడా మోసం చేశాడని ఆరోపించారు.  ఇకపోతే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో యుగంధర్‌పై ఇప్పటికీ ఎనిమిది కేసులు నమోదు కాగా తదుపరి చర్యల నిమిత్తం అతడిని మిల్స్ కాలనీకి టాస్క్ఫోర్స్ వారు అప్పగించడం జరిగింది. ఇక ఇంతలా అన్యాయం వరంగల్లో బాగా జరుగుతోందని చెప్పాలి.  ఇటీవల హనుమకొండ ఠానా పరిధిలోని కాకతీయ కాలనీలో కూడా భూ వివాదంలో జోక్యం చేసుకొని ఎదుటి వ్యక్తి భూమిని విక్రయించాలని ఒత్తిడి తెచ్చిన ప్రజా ప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.