బిడ్డ‌కు శాపంగా మారిన క‌న్న‌త‌ల్లి

కన్నా తల్లే బిడ్డని చంపిన ఘటన వైజాగ్ నగరంలోని మంగళపాలెంలో చోటు చేసుకుంది. పసిబిడ్డ అని చూడకుండా 18 నెలల పసికందుని చంపి పాతి పెట్టారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వెలుగులోకి రావడం జరిగింది. పసిబిడ్డ తల్లి అలాగే తన బాయ్ ఫ్రెండ్ కలిసి నిన్ను ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నట్టు పోలీసులు వారు నిర్ధారించారు.  పోలీసులు చెప్పినదాని ప్రకారం:  అందిన సమాచారం ప్రకారం, శనివారం పాక్షికంగా కుళ్లిపోయిన చిన్న పాప మృతదేహాన్ని, […]

Share:

కన్నా తల్లే బిడ్డని చంపిన ఘటన వైజాగ్ నగరంలోని మంగళపాలెంలో చోటు చేసుకుంది. పసిబిడ్డ అని చూడకుండా 18 నెలల పసికందుని చంపి పాతి పెట్టారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వెలుగులోకి రావడం జరిగింది. పసిబిడ్డ తల్లి అలాగే తన బాయ్ ఫ్రెండ్ కలిసి నిన్ను ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నట్టు పోలీసులు వారు నిర్ధారించారు. 

పోలీసులు చెప్పినదాని ప్రకారం: 

అందిన సమాచారం ప్రకారం, శనివారం పాక్షికంగా కుళ్లిపోయిన చిన్న పాప మృతదేహాన్ని, పాతిపెట్టిన స్థలం నుంచి వీధికుక్కలు బయటకు లాగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన బాలికను గీతశ్రీగా గుర్తించారు. పాప తల్లి బంగారు స్నేహ అలాగే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎన్. రమణ, ఇద్దరూ కలిసి జూలై 17న బాలికను కనికరం లేకుండా చంపి, పొదల్లో పాతిపెట్టారని పోలీసులు తెలిపారు.

ఎందుకు ఈ పాపానికి పాల్పడ్డారు: 

వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందిన స్నేహ కొన్నేళ్ల క్రితం తన ప్రియుడు సాయితో కలిసి పారిపోయి, విజయవాడలో ఇద్దరు కలిసి ఉంటున్నట్లు విచారణలో తేలింది. అయితే సంవత్సరం క్రితమే ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. స్నేహ బాయ్ ఫ్రెండ్ అయిన సాయి, మద్యానికి బానిసై స్నేహతో గొడవలు పడేవాడు. వేధింపులు భరించలేక, స్నేహ తన కూతురు గీతాశ్రీతో కలిసి మూడు నెలల క్రితం వైజాగ్ నగరానికి తిరిగి వచ్చింది. అంతేకాకుండా నగరంలోనే ఆమె తన మాజీ ప్రియుడు రమణతో జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఆడబిడ్డతో పాటు స్నేహ అలాగే తన మాజీప్రియుడు రమణతో కలిసి వైజాగ్ నగరంలోని మంగళపాలెంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే వారిద్దరి బంధానికి, సంతోషానికి స్నేహ కి పుట్టిన ఆడబిడ్డ అడ్డుగా ఉందని భావించారు ఆ జంట. అందుకే ఒక కఠినమైన, దుర్మార్గమైన ఆలోచన చేశారు. 

అయితే తనకు పుట్టిన బిడ్డను ఎప్పటినుంచో అడ్డు తొలగించుకోవాలని తలచిన స్నేహ, పాపం ఆ పసికందు మీద కోపాన్ని పెంచుకోసాగింది. జులై 15న బాలిక ఏడుస్తున్న సమయంలో స్నేహ పసికందును అన్నం గరిటెతో కొట్టడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఇదంతా తెలుసుకున్న రమణ, స్నేహ తో కలిసి ఆ పసికందు మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు. ప్లాన్ లో భాగంగా ఆ పసిబిడ్డని పొదల్లో పాతిపెట్టి పరారయ్యారు. అయితే తప్పు ఎంత కాలం ఉండదు కాబట్టి, శనివారం రోజున, పాక్షికంగా కుళ్లిపోయిన చిన్న పాప మృతదేహాన్ని, పాతిపెట్టిన స్థలం నుంచి వీధికుక్కలు బయటకు లాగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన బాలికను గీతశ్రీగా గుర్తించారు. పాప తల్లి బంగారు స్నేహ అలాగే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎన్. రమణ, ఇద్దరూ కలిసి జూలై 17న బాలికను కనికరం లేకుండా చంపి, పొదల్లో పాతిపెట్టారని పోలీసులు తెలిపారు. స్నేహ, రమణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని దువ్వాడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. 

భారతదేశంలో ఇప్పటికే ఎన్నో నేరాలు-ఘోరాలు ప్రతిరోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో ఎన్నో చట్టాలు తీసుకు వచ్చినప్పటికీ, ఏదో ఒక చోట పుట్టిన బిడ్డల బలైపోతుంది. ఒకపక్క టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, మరో పక్క ఇలాంటి అవాంఛిత కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అసలు దీనంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే.. మనుషులం అనే మర్చిపోవడం. వారి సంతోషం కోసం, తమ మధ్యలో అడ్డు వస్తుంది అని చెప్పి ఒక బిడ్డను బలి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్?