నిద్ర లేవని చంద్రయాన్-3 విక్రం, ప్ర‌జ్ఞాన్

విజయవంతంగా భూమి నుండి బయలుదేరి చంద్రుడు దక్షిణ దృవం మీద అడుగు పెట్టిన చంద్రయాన్-3 మిషన్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చంద్రయాన్ మిషన్ కు సంబంధించి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇంకా నిద్రపోతున్న క్రమం కనిపిస్తోంది. ఇస్రో ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ, వాటి నుంచి ఎటువంటి సిగ్నల్స్ అందట్లేదంటూ వెల్లడించింది. అంతేకాకుండా కమ్యూనికేట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ చంద్రయాన్-3 డివైసెస్ తో ఇస్రో ఎటువంటి కమ్యూనికేషన్ చేయలేకపోయిందని, బహుశా అవి డెడ్ అయి ఉంటాయని […]

Share:

విజయవంతంగా భూమి నుండి బయలుదేరి చంద్రుడు దక్షిణ దృవం మీద అడుగు పెట్టిన చంద్రయాన్-3 మిషన్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చంద్రయాన్ మిషన్ కు సంబంధించి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇంకా నిద్రపోతున్న క్రమం కనిపిస్తోంది. ఇస్రో ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ, వాటి నుంచి ఎటువంటి సిగ్నల్స్ అందట్లేదంటూ వెల్లడించింది. అంతేకాకుండా కమ్యూనికేట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ చంద్రయాన్-3 డివైసెస్ తో ఇస్రో ఎటువంటి కమ్యూనికేషన్ చేయలేకపోయిందని, బహుశా అవి డెడ్ అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు ఏజెన్సీ. 

ప్రశ్నలకు తావిస్తున్న పరిస్థితి: 

సెప్టెంబరు 30న జరగనున్న తదుపరి చంద్ర సూర్యాస్తమయం వరకు, ల్యాండర్ మరియు రోవర్‌తో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇస్రో తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ల్యాండర్ మరియు రోవర్ పార్క్ చేసిన శివశక్తి పాయింట్‌లో సూర్యోదయం వచ్చిన వెంటనే, చంద్రయాన్ 3 డివైసెస్ తప్పకుండా తిరిగి మేలుకుంటాయంటూ ఏజెన్సీ ఇప్పటికీ ఆశాభావంతో ఉంది. అయితే, ప్రస్తుతానికి, చంద్రయాన్-3 డివైసెస్ తో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది ఇస్రో. విక్రం లాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు తమ మొదట టాస్కులు పూర్తి చేసుకున్న అనంతరం సెప్టెంబర్ 2న స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. 

అంతేకాకుండా ప్రజ్ఞాన్ రోవర్ సుమారు శివశక్తి పాయింట్ నుంచి 100 మీటర్లు ప్రయాణించి, అక్కడ సల్ఫర్, ఐరన్ ఆక్సిజన్, అంతేకాకుండా ఇతర ఎలిమెంట్స్ ఉన్నట్లు సమాచారం అందించింది. అయితే చంద్రుడు మీద సూర్యోదయం అయ్యే క్రమంలో సిగ్నల్ అందాల్సి ఉందని, అయితే ప్రస్తుతం అక్కడ నుంచి ఎటువంటి సిగ్నల్స్ రాలేనందున, వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్. అయితే అక్కడ ఉన్న చల్లని వాతావరణం కారణంగా, నిద్రలోకి జారుకున్న డివైసెస్ మళ్లీ తిరిగి లేచేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని, ఒకవేళ లేవకపోయినా, ఇప్పటికే డివైసెస్ చేయాల్సిన పనులు పూర్తి చేసుకుని విజయవంతం అయ్యాయని గుర్తు చేశారు.

దక్షిణ ధ్రువం ప్రత్యేకతలు: 

1960 సంవత్సరంలో చంద్రుడు మీద కలెక్ట్ చేసిన కొన్ని శాంపిల్స్ అనేవి పరీక్ష చేశారు. పరీక్ష చేసిన తర్వాత అందులో హైడ్రోజన్ నిలువలు ఉన్నట్లు తేలింది. అంటే కచ్చితంగా చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ ధ్రువంలో నీటి వనరులు తప్పకుండా ఉంటాయని నిర్ధారించారు. అయితే అప్పటి నుంచి చంద్రుడు మీదకు ముఖ్యంగా దక్షిణ ధ్రువం వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి ప్రపంచ దేశాలు. 

ముఖ్యంగా చంద్రుడు మీద నీటి వనరులు ఉన్నట్లయితే, ఆ వనరులను ఉపయోగించుకుని మరో గ్రహం గా పిలువబడుతున్న మార్స్ ప్రయాణం సులభతరం చేసుకోవచ్చు అనేది ప్రస్తుతం పరిశోధకుల ముఖ్య ఆలోచన. 

చంద్రయాన్-3: 

ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ఇప్పటికే సగం పని పూర్తి చేసుకుందని చెప్పుకోవాలి. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్య(ఆర్బిట్)లోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ చివరి కక్ష్య (ఆర్బిట్)లోకి ప్రవేశించడమే కాకుండా ఆగస్టు 23 సాయంత్రం సమయంలో, చంద్రుడు మీద అడుగు పెట్టి యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది.

ఆదిత్య L1: 

సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి జ‌రిగిన ఆదిత్య ఎల్ 1 లాంచ్ ఆల్మోస్ట్ విజ‌య‌వంతం అయిపోయింది. ఇప్పుడు ఆదిత్య ఎల్ 1 సూర్యుడి కొన్ని కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ 1 పాయింట్‌లో ఉంది.  ఇది అంతరిక్షంలో భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ. 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థలోని మొదటి ‘లాగ్రాంజ్ పాయింట్’ (L1) చుట్టూ హాలో ఆర్బిట్ లో తిరుగుతోంది ఆదిత్య L1.