మరో మారు చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్ర‌మ్ ల్యాండ‌ర్

చంద్రయాన్-3 ని ఇస్రో ఏ ముహూర్తాన ప్రయోగించిందో కానీ అప్పటి నుంచి ఇస్రోకు అన్నీ శుభవార్తలే. చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రయోగించడమే కాదు. దానిని సక్సెస్ ఫుల్ గా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కూడా ల్యాండ్ చేసింది. తద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డు నెలకొల్పింది. చంద్రయాన్-3 సక్సెస్ అవడంతో మన ఇండియన్లు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలు ఇస్రోను కీర్తిస్తున్నారు. దీంతో ఇస్రో మరింత రెట్టించిన […]

Share:

చంద్రయాన్-3 ని ఇస్రో ఏ ముహూర్తాన ప్రయోగించిందో కానీ అప్పటి నుంచి ఇస్రోకు అన్నీ శుభవార్తలే. చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రయోగించడమే కాదు. దానిని సక్సెస్ ఫుల్ గా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కూడా ల్యాండ్ చేసింది. తద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డు నెలకొల్పింది. చంద్రయాన్-3 సక్సెస్ అవడంతో మన ఇండియన్లు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలు ఇస్రోను కీర్తిస్తున్నారు. దీంతో ఇస్రో మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ సూర్యుడి మీద ప్రయోగాలు చేసేందుకు కూడా సిద్ధమైంది. సూర్యుడి మీద ప్రయోగాల కోసం ఆదిత్య ఎల్-1 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 125 రోజుల ప్రయాణం తర్వాత ఈ రాకెట్ అనుకున్న నిర్దేశిత ప్రాంతానికి చేరనుంది. అక్కడ ఎలా సాఫ్ట్ ల్యాండ్ అవుతుందో కానీ ప్రస్తుతానికైతే ఇస్రో విజయం సాధించింది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అతి తక్కువ బడ్జెట్ లో చంద్రయాన్ మిషన్ చేపట్టడమే కాదు. దానిని సక్సెస్ చేసి కూడా చూపెట్టింది. మరోమారు ఆదిత్య ఎల్-1 మిషన్ ను కూడా అతి తక్కువ ఖర్చుతో రూపొందించి ప్రయోగించింది. దీంతో అంతా ఇస్రోను అభినందిస్తున్నారు. ఇప్పటికే చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలం మీద సేఫ్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. 

మరో మారు ల్యాండింగ్ 

చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ అయిన రోజు అంతా ఉద్వేగానికి లోనయ్యారు. ఆ రోజును భారతీయులే కాకుండా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ అందరూ ఇస్రోను అభినందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో మరో శుభవార్త చెప్పింది. నేడు విక్రమ్ ల్యాండర్ ను మరో మారు చంద్రుని ఉపరితలం మీద ల్యాండ్ చేసినట్లు ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలను అధిగమించింది మరియు “హాప్ ప్రయోగాన్ని” విజయవంతంగా పూర్తి చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఈ మిషన్ దానిలో ఉన్న ఇంజిన్స్ ను బర్న్ చేసుకుంటూ దాదాపు 40 సెం. మీ ఎత్తుకు ఎగిరిందని అంతే కాకుండా 30-40 సెం. మీ ముందుకు ప్రయాణించి సురక్షితంగా ల్యాండ్ అయిందని ఇస్రో తెలిపింది. 

కొత్త పరిశోధనలకు ఊతం

చంద్రయాన్-3 ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ మిషన్ సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. భవిష్యత్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తున్నారు. విక్రమ్ సిస్టమ్స్ ఆరోగ్యవంతంగా ఉన్నాయని, నామమాత్రంగానే పనిచేస్తున్నాయని స్పేస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. పోయిన వారం చంద్రయాన్-3 మిషన్ యొక్క ప్రజ్ఞాన్ రోవర్ “స్లీప్ మోడ్‌” లోకి వెళ్లింది. అది భారతదేశ చంద్ర రాయబారిగా ఎప్పటికీ నిలిచి ఉంటుందని  అంతరిక్ష సంస్థ తెలిపింది. 

అప్పటి ఫెయిల్యూర్ నుంచి పాఠాలు

ఇస్రో చంద్రయాన్-2 మిషన్ ను 2019లో పరీక్షించింది. కానీ అప్పుడు ఇస్రో చివరి మెట్టు మీద బోల్తాపడింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తలు మరింత కసిగా పని చేశారు. కేవలం నాలుగు సంవత్సరాలలోనే తక్కువ ఖర్చులో మరో కొత్త ప్రాజెక్టును తయారు చేసి దానిని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు. ఓ వైపు రష్యా ప్రయోగించిన ఉపగ్రహం కుప్పకూలిన తర్వాత మన ల్యాండర్ అక్కడ సేఫ్ ల్యాండ్ అయింది. ఖగోళ శాస్త్రంలో మేము ఎంతో గ్రేట్ అని చెప్పుకునే దేశాలకు కూడా ఈ ప్రయోగంతో భారత్ ధీటుగా బదులిచ్చింది. ఇస్రో మూడు రోజుల క్రూడ్ మిషన్‌ను వచ్చే ఏడాది నాటికి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇది 2025 నాటికి చంద్రునిపైకి మరొక ప్రోబ్‌ను పంపడానికి జపాన్‌తో ఉమ్మడి మిషన్‌ను మరియు రాబోయే రెండేళ్లలో వీనస్‌కు కక్ష్య మిషన్‌ను కూడా ప్లాన్ చేస్తుంది. ఇస్రో ఇలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ భారత కీర్తిని మువ్వన్నెలా జెండాను ఇలాగే రెపరెపలాడించాలని అంతా కోరుకుంటున్నారు.