లాండర్ ఫోటోను షేర్ చేసి డిలీట్ చేసిన ఇస్రో

చంద్రయాన్-3 విజయం తర్వాత భారతదేశం ఆనంద సంబరాలలో మునిగిపోయింది. చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ ధృవం మీద అడుగు పెట్టిన చంద్రయాన్-3 విక్రం ల్యాండ‌ర్‌కి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఫోటోలను ఇస్రో కి పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే విక్రమ్ ల్యాండర్ కు సంబంధించి కొన్ని ఫోటోలు ట్విట్టర్ లో పెట్టి డిలీట్ చేసేసింది ఇస్రో.  చంద్రయాన్-2 కెమెరా:  ట్విట్టర్ లో ఇస్రో పోస్ట్ చేసిన విక్రం లాండర్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా […]

Share:

చంద్రయాన్-3 విజయం తర్వాత భారతదేశం ఆనంద సంబరాలలో మునిగిపోయింది. చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ ధృవం మీద అడుగు పెట్టిన చంద్రయాన్-3 విక్రం ల్యాండ‌ర్‌కి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఫోటోలను ఇస్రో కి పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే విక్రమ్ ల్యాండర్ కు సంబంధించి కొన్ని ఫోటోలు ట్విట్టర్ లో పెట్టి డిలీట్ చేసేసింది ఇస్రో. 

చంద్రయాన్-2 కెమెరా: 

ట్విట్టర్ లో ఇస్రో పోస్ట్ చేసిన విక్రం లాండర్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. చంద్రయాన్ 2కి అమ‌ర్చిన‌ ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా ఇప్పుడు చంద్ర‌యాన్ 3 మిష‌న్‌కు వాడారు. చంద్ర‌యాన్ 2 పేలిపోయింది కాబ‌ట్టి.. అదే కెమెరాను త‌యారు చేసి చంద్ర‌యాన్ 3కి పెట్టారు. అయితే చంద్ర‌యాన్ 2 కెమెరా చంద్ర‌యాన్ 3కి సంబంధించిన‌ ఫొటోల‌ను ఇస్రో ట్విట‌ర్‌లో షేర్ చేసింది. కానీ కొద్దిసేప‌టికే ఆ ఫొటోల‌ను ఇస్రో డిలీట్ చేసింది.

చంద్రయాన్-3 బడ్జెట్ :

చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ అంటూ ప్రస్తావించారు మాజీ ఇస్రో చీఫ్ మాధవన్. ఇంకా చెప్పాలంటే మునుపు తయారు చేసిన చంద్రయాన్-2 బడ్జెట్ విషయానికి వస్తే సుమారు 978 కోట్లు ఖర్చు అయిందని, మరి ఇక చంద్రయాన్-3 విషయానికి వస్తే కేవలం 620 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశం గర్వించదగ్గ మిషన్ తయారు చేశారు అంటూ భారతదేశ శాస్త్రవేత్తలను మెచ్చుకున్నారు మాజీ ఇస్రో చీఫ్.  

చంద్రయాన్-3 విశేషాలు: 

భూమి నుంచి చంద్రుడిని చేరుకోవటానికి సుమారు ఒక నెల రోజులపాటు సమయం పట్టింది. అంటే ఆగస్టు 23 వ తారీఖున, లాంచ్ చేసిన మిషన్ చందమామ మీద అడుగు పెట్టింది. అయితే చందమామ మీద లాంచ్ అయిన అనంతరం సుమారు 14 రోజులు రీసర్చ్ కండక్ట్ చేయడం స్టార్ట్ అయింది. 14 రోజులు అంటే చందమామ మీద ఒక రోజుతో సమానం. ముఖ్యంగా అక్కడ చందమామ మీద ఉండే లూనార్ మట్టి మీద పరిశోధన జరుగుతుంది. అంతే కాకుండా 14 రోజులపాటు చందమామ మీద కొన్ని విశేషాలను సేకరిస్తారు. 

GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌పై అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. ఈ శక్తివంతమైన మూడు-దశల మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ISRO ద్వారా పంపిస్తున్న అత్యంత బలమైన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ LVM-3 లిఫ్ట్‌ఆఫ్ మిషన్ సుమారు 43.5 మీటర్ల ఎత్తులో మరియు 4 మీటర్ల వ్యాసంతో, 640 టన్నుల బరువు ఉంటుంది. దీని స్ట్రెంత్ 8,000 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను రవాణా చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. అంతేకాకుండా ఇది సుదూర గమ్యస్థానాలకు, ఇది సుమారుగా 4,000 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, మునుపు తయారు చేసిన చంద్రయాన్-2 బడ్జెట్ 900 కోట్లు , మరి ఇప్పుడు విజయవంతంగా చంద్రుడు మీద అడుగుపెట్టిన చంద్రయాన్-3 బడ్జెట్ 600 కోట్లు.

ISRO ప్రకారం, ఇటీవల డెవలప్ చేసిన ఈ అద్భుతమైన మిషన్ పార్ట్స్ అనేవి కొన్ని క్లిష్టమైన సందర్భంలో కూడా విజయవంతమైన ల్యాండింగ్‌ జరిగేలా చూస్తాయని సైంటిస్టు నొక్కి చెప్పిన విధంగానే ఇప్పుడు ఇస్రో సాధించి చూపించింది. సెన్సార్ పనిచేయకపోవడం, ఇంజిన్ బ్రేక్‌డౌన్, అల్గారిథమిక్ గ్లిచ్‌లు అంతేకాకుండా ఇంక ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ, అది చేయాల్సిన పని మాత్రం విజయవంతంగా చేసేందుకు ఆటోమేటిక్ రిపేర్ సిస్టం కూడా ఉండడం వల్ల మిషన్ విజయవంతమైంది.