తమిళ్ యాక్టర్ విజయ్ కు 500 జరిమానా

దక్షిణ భారతదేశంలో ఎంతో పేరుగాంచిన ప్రముఖ యాక్టర్ తలపతి విజయ్ మనకి తెలిసిన వారే. అయితే వారికి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఎంతో మంచి పేరు ఉంది. తమిళనాడులో ఎవ్వరిని అడిగినా అతని పేరు తెలియని వారు ఉండరు వివిధ దేశాలలో కూడా ఇతను ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను తెలుగు తమిళ కన్నడ చిత్రాలలో నటించారు. ఇతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అలా ఇతని గురించి చెప్పుకుంటూ పోతే చాల […]

Share:

దక్షిణ భారతదేశంలో ఎంతో పేరుగాంచిన ప్రముఖ యాక్టర్ తలపతి విజయ్ మనకి తెలిసిన వారే. అయితే వారికి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఎంతో మంచి పేరు ఉంది. తమిళనాడులో ఎవ్వరిని అడిగినా అతని పేరు తెలియని వారు ఉండరు వివిధ దేశాలలో కూడా ఇతను ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను తెలుగు తమిళ కన్నడ చిత్రాలలో నటించారు. ఇతనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అలా ఇతని గురించి చెప్పుకుంటూ పోతే చాల సినిమాల్లో ఈయన నటించిన పాత్ర ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ యాక్టర్ జీవితంలో ప్రస్తుతం జరిగిన ఒక ఘటన వైరల్ అవుతుంది..

500 ఫైన్ ఎందుకు పడింది?

తలపతి విజయ్ కేవలం ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించినందుకు ఫైన్ పడింది. జులై 11 వ తారీకున తలపతి విజయ్ మక్కల్ ఎక్కంలో తన రాజకీయ ప్రవేశం కోసం తన ఫాలోవర్స్ ని కలవడం కోసం వచ్చాడు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లే దారిలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడి ఉన్న సరే దాటుకుంటూ వెళ్ళిపోతాడు. అతను ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించినందువలన అతని వాహనంపై 500 జరిమానా పడుతుంది. విజయ్ అభిమానులు తనతో పాటు తనయూర్ లోని నీలంగరై రెసిడెన్స్ వరకు వస్తారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ:

విజయ్ తన రాజకీయ ప్రవేశం 2026 లో జరిగే ఎలక్షన్స్ సంబంధించిన మీటింగ్ ను ముగించుకొని తిరిగి వెళ్లే దారిలో ఈ సంఘటన జరుగుతుంది. అది తెలుసుకున్న తన అభిమానులు ఇంటి  వరకు ఫాలో అవుతూ వెళ్తారు.

ఇక తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ తన అభిమాన సంఘం మక్కల్ ఇయక్కంతో సమావేశమయ్యారు. ఇది తమిళ రాజకీయాల్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ సిద్ధమైయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కోసమే ఈ సమావేశంలో చర్చ జరిగిందని చర్చల్లో పాల్గొన్న అభిమానులు తెలిపారు.  

విజయ్ పొలిటికల్ ఎంట్రీ జరిగితే అతనికి విజయ్ అభిమానులే కాకుండా అజిత్, రజనీకాంత్, ఇతర హీరోల అభిమానులు కూడా మద్దతుగా నిలుస్తారని చెప్పారు, ప్రపంచ వ్యాప్తంగా విజయ్ కి అభిమానులు ఉన్నారనీ వారంతా విజయ్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని వీఎంఐ తెలిపింది. 

అయితే ఫ్యాన్స్ తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి రావాలని తెలపడం, అభిమాన సంఘాలతో సమావేశాలు జరపడం లాంటివే తప్ప ఇప్పటివరకూ విజయ్ తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన విషయాలు పబ్లిక్ లో చెప్పింది లేదు. సో దళపతి నోటివెంట పొలిటికల్ ఎంట్రీ మాట వచ్చేవరకూ అభిమానులు వెయిట్ చేయక తప్పదు.

ఒకవైపు విజయ రాజకీయాల్లోకి రావడానికి తమ సర్వశక్తులూ ఉపయోగిస్తామంటున్న ఫ్యాన్స్ కి ఇకపై తమ అభిమాన హీరోను తెరమీద చూసే అవకాశం ఉండకపోవడం తమకు బాధ కలిగించే విషయమని చెప్తున్నారు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తే తమ అభిమాన హీరో పాటలు, ఫైట్లు, సినిమాలు అన్ని మిస్ అవుతాం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా కూడా తమ హీరో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని తమ భావిస్తున్నామన్నారు. ఇది తమ చిరకాల కల అని కూడా తెలిపారు. ప్రస్తుతం విజయ్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వీటి షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత తన రాజకీయ రంగ ప్రవేశం కోసం అభిమానులకు క్లారటీ వచ్చే అవకాశం ఉంది.  ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న దళపతి 68 విజయ్ నటించే చివరి సినిమా అయ్యే అవకాశం ఉంది.