కార్గిల్ వార్ గురించి ఆసక్తికరమైన అంశాలు

ప్రతి సంవత్సరం జూలై 26వ తారీకున కార్గిల్ విజయ్ దివాస్ ని జరుపుకుంటాము. ఇది మన దేశం కోసం పోరాడిన జవాన్లు కు అంకితం. కార్గిల్ వార్ భారతదేశంలోనే చాలా కీలకమైన అంశం ఇది పాకిస్తాన్ కి భారత్ కి మధ్య ఉన్న బోర్డర్లో జరిగిన యుద్ధంలో 500 మహావీరులు తమ ప్రాణాలు దేశం కోసం అర్పించారు. అలాంటి మహావీరులను గుర్తు చేసుకునే క్రమంలో వారికి అశ్రునివాళి అర్పించే రోజే కార్గిల్ విజయ్ దివాస్. 1999 వ […]

Share:

ప్రతి సంవత్సరం జూలై 26వ తారీకున కార్గిల్ విజయ్ దివాస్ ని జరుపుకుంటాము. ఇది మన దేశం కోసం పోరాడిన జవాన్లు కు అంకితం. కార్గిల్ వార్ భారతదేశంలోనే చాలా కీలకమైన అంశం ఇది పాకిస్తాన్ కి భారత్ కి మధ్య ఉన్న బోర్డర్లో జరిగిన యుద్ధంలో 500 మహావీరులు తమ ప్రాణాలు దేశం కోసం అర్పించారు. అలాంటి మహావీరులను గుర్తు చేసుకునే క్రమంలో వారికి అశ్రునివాళి అర్పించే రోజే కార్గిల్ విజయ్ దివాస్.

1999 వ సంవత్సరం పాకిస్తాన్కి భారత్కు మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్ లో లడక్ లో ఉన్న కార్గిల్ బోర్డర్ మధ్యలో చర్చలు జరిగాయి. అయితే పాకిస్తాన్ వాళ్ళ దేశంలో, కార్గిల్ బోర్డర్ ప్రాంతాన్ని కలుపు కోవటానికి ప్రయత్నించగా, మన భారతదేశం అందుకు అంగీకరించలేదు. ఈ విషయంపై చర్చలు జరపగా అది భారతదేశానికి చెందిందని అది మేము వదలబోమని తెలిపారు. అయితే పాకిస్తాన్ వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు.

లడక్ ప్రాంతం మొత్తం భారత సైన్య దళాలతో, పాకిస్తాన్ నుంచి దేశానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణగా నిలబడింది. యుద్ధం జరిగే సమయంలో పాకిస్తాన్ దాటి చాలా దళాలు భారతదేశం వైపు ప్రవేశించినట్లు, అయితే వారిని భారత దళాలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. లడక్ బోర్డర్ ప్రాంతంలో పాకిస్తాన్ వర్గాలు చాలా క్యాంపులను పెట్టినట్లు వాటిని తొలగించడానికి ఆపరేషన్ విజయ్ ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

ఆపరేషన్ విజయ్ లో భారత దళాలు తమ ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా పాకిస్తాన్ తో పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఈ యుద్ధంలో దాదాపు 1000 పైగా పాకిస్తాన్ దళాలను ముట్టడి చేశాయి. ఈ ఆపరేషన్ లో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రథమ పాత్ర పోషించారు. దాదాపు 18 వేల అడుగుల ఎత్తు నుంచి పాకిస్తాన్ వర్గాలపై దాడులు చేశారు. ఈ యుద్ధంలో చాలా పాకిస్తాన్ దళాల ధ్వంసం అయ్యాయి.

కార్గిల్ వార్ లో భారతదేశం చాలా ఆయుధాలను ఉపయోగించింది. దాదాపుగా రెండు లక్షల 50 వేలకు పైగా రాకెట్లను లాంచ్ చేసింది. 300కు పైగా గన్నలు మరియు మోటర్లు మొదలగు చాలా ఆయుధాల్ని ఉపయోగించి పాకిస్తాన్ వర్గాల్ని ధ్వంసం చేసి విజయాన్ని చేయి దక్కించుకుంది. ఈ యుద్ధంలో భాగంగా ఇజ్రాయిల్ నుంచి యూఏవీస్ భారతదేశానికి పంపిణీ చేశారు. ఆ యుద్ధంలో ఉపయోగించడానికి చాలా ఉపయోగకరమని చెప్పారు.

ఈ యుద్ధం మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ప్రతి అప్డేట్ లైవ్ టెలికాస్ట్ లో తెలిపారు. ఇది చాలా ఆసక్తికరంగానూ..అంతే ప్రాణాంతకరమైనది. యుద్ధంలో దాదాపు 500 కు పైగా జవాన్లు తమ ప్రాణాలను అర్పించినట్లు చెప్పారు. అంతేకాకుండా పాకిస్తాన్ వర్గాలను, వారి క్యాంపైన్లను ధ్వంసం చేసినట్లు భారత ఆర్మీ చెప్పింది.

ఈ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన కెప్టెన్ విక్రమ్ భద్ర ఈ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. వారి కుటుంబానికి పరమవీరచక్రా అందించి వారిపై గౌరవాన్ని తెలిపారు.

జులై 26వ తారీఖున దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ లను గుర్తు చేసుకుంటూ వారు చేసిన సాహస పోరాటాలను. దేశం పట్ల వారికి ఉన్న గౌరవమును, భక్తిని గుర్తు చేసుకుంటూ కార్గిల్ విజయ్ దివాస్ ని జరుపుకుంటాము. ఈరోజు భారతదేశ కి చాలా ముఖ్యమైన రోజు, ఈరోజు దేశం కోసం 500 జవాన్లు తమ ప్రాణాల్ని అర్పించారు. అలా అర్పించిన మహావీరుల ప్రాణ త్యాగమే భారతదేశ భవిష్యత్తు.