ఒక రైలులో వెళ్తూ మ‌రో రైలులోని ప్యాసెంజ‌ర్ల‌ను చిత‌క‌బాదాడు

బీహార్లో ఒక రైల్లో వెళ్తున్న ప్యాసింజర్ ని మరో రైల్లో వెళుతున్న ప్యాసింజర్ బెల్టుతో కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక రైల్లో నుండి మరో రైల్లో వెళుతున్న వ్యక్తిని బెల్టుతో కొట్టడం మనం చూడొచ్చు.  యాక్షన్ తీసుకుంటామని చెప్పిన ఇండియన్ రైల్వేస్ వేరే ప్యాసింజర్  ని కొట్టిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటామని ఇండియన్ రైల్వే తెలియజేసింది. ఈ అజ్ఞాత వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటామని ఇండియన్ రైల్వే ప్రామిస్ […]

Share:

బీహార్లో ఒక రైల్లో వెళ్తున్న ప్యాసింజర్ ని మరో రైల్లో వెళుతున్న ప్యాసింజర్ బెల్టుతో కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక రైల్లో నుండి మరో రైల్లో వెళుతున్న వ్యక్తిని బెల్టుతో కొట్టడం మనం చూడొచ్చు. 

యాక్షన్ తీసుకుంటామని చెప్పిన ఇండియన్ రైల్వేస్

వేరే ప్యాసింజర్  ని కొట్టిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటామని ఇండియన్ రైల్వే తెలియజేసింది. ఈ అజ్ఞాత వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటామని ఇండియన్ రైల్వే ప్రామిస్ చేసింది. ఈ 29 సెకండ్ల వీడియోలో ఒక అజ్ఞాత వ్యక్తి చేతిలో బెల్ట్ తో వేరే ట్రైన్ లో వెళ్తున్న వాళ్ళని కొట్టి నవ్వుతూ ఉండడం మనం గమనించొచ్చు. రెండు ట్రైన్లు కూడా చాలా స్పీడ్ లో వెళుతున్నాయి. అందువల్ల బెల్ట్ దెబ్బ కూడా చాలా గట్టిగానే తగులుతుంది. ఈ వీడియో షేర్ చేస్తే ఒక యూజర్ ఏమన్నాడంటే ఇదంతా నిజమా డోర్ దగ్గర నిలబడి వేరే వాళ్ళని కొట్టడం సాధ్యమా? అని అన్నాడు. ఇలా కొడుతున్నప్పుడు కిందపడి చనిపోయే అవకాశం కూడా ఉంటుందని దీని మీద యాక్షన్ రైల్వే వాళ్లను కోరాడు. సెంట్రల్ రైల్వే దీని మీద రెస్పాండ్ అయ్యి మేము ఈ విషయంలో యాక్షన్ తీసుకుంటామని తెలియజేసింది. ఒక వ్యక్తి కొడుతుంటే మరో వ్యక్తి వీడియో తీసాడు. 

వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.తను సైకో అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి 46 వేల వ్యూస్ వచ్చాయి. ఒక యూజర్ వీడొక సైకో అని ట్విట్టర్లో రాశాడు. వీడికి పనిష్మెంట్ తప్పకుండా ఇవ్వాలని కోరాడు. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి ఆగుతాయని యూజర్లు కామెంట్ చేస్తున్నారు. 

మారుతున్న తీరు: 

ఒకప్పుడు రైలు ప్రయాణం అంటే చాలామంది ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు పెరుగుతున్న ప్రమాదాల కారణంగా సగం మంది రైల్వేకి దూరం అవుతున్నారు. అసలే రైల్వేలో ఫుడ్ బాగుండదు. ఇంకా ప్రమాదాలు. ఇవి కాకుండా ఇలాంటి ఘటనలు. ఒక రైలు నుండి మరో రైల్లో వెళ్లే వ్యక్తిని కొట్టడం అంటే మనుషులు ఎంత సైకోల్లా మారుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కాలక్రమేణా మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కూడా చుట్టూ చాలా మంది ఉండే ఉంటారు.వాళ్లలో ఎవరూ ఇది ఆపకపోవడం మనుషులు ఏ విధంగా తయారవుతున్నారో అర్థం చేసుకునేలా చేస్తుంది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కొందరు దీన్ని ఆపినా ఇలాంటి వాళ్ళ ఆగడాలు తగ్గిపోతాయి. ఇలాంటి సైకోలని రైళ్ల లోకి ఎక్కనివ్వకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా కనిపించినా టీసీకి కంప్లైంట్ ఇస్తే వాళ్లని వెంటనే రైల్లో నుంచి బయటకు పంపిస్తారు. అలా చేయడం వల్ల కూడా ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎవరూ అలా స్పందించలేదు. ఒకవేళ అలా స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఏది ఏమైనా జరిగిన ఘటన చాలా క్రూరమైన ఘటన. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే రైల్వే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే రైల్లో ప్రయాణించే వాళ్ళు కూడా కాలక్రమమైన తగ్గిపోతారు.