Niveda Singh: సీఎం వ్యాఖ్యలకు కన్నీళ్లు పెట్టుకున్న బీజేపీ మహిళా నాయకురాలు

Niveda Singh: బీహార్‌ అసెంబ్లీలో జనాభా నియంత్రణ(Population control) గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌(CM Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా మహిళా ప్రజా ప్రతినిధులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు నివేదా సింగ్(Niveda Singh) కన్నీళ్లు పెట్టుకున్నారు. Read More: Aditya L-1: సూర్యుడి కాంతిని క్యాప్చర్ చేసిన  ఆదిత్య L-1 బిహార్‌(Bihar) అసెంబ్లీలో […]

Share:

Niveda Singh: బీహార్‌ అసెంబ్లీలో జనాభా నియంత్రణ(Population control) గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌(CM Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా మహిళా ప్రజా ప్రతినిధులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు నివేదా సింగ్(Niveda Singh) కన్నీళ్లు పెట్టుకున్నారు.

Read More: Aditya L-1: సూర్యుడి కాంతిని క్యాప్చర్ చేసిన  ఆదిత్య L-1

బిహార్‌(Bihar) అసెంబ్లీలో నితీష్‌ కుమార్‌(Nitish Kumar) జనాభా నియంత్రణ(Population control) గురించి మాట్లాడుతూ ‘ఒక మహిళ కోరుకుంటే, ఆమె జనాభాను నియంత్రించగలదు’ అని చెప్పాలనుకున్నారు. కానీ ఆయన అంతటితో ఆగలేదు. ‘మహిళ కోరుకుంటే తన భర్తను సెక్స్‌ చేయకుండా ఆపగలదు’ అంటూ వివాదాన్ని రాజేశారు. నితీష్‌ కుమార్‌ చేసిన ఈ ప్రకటన తీవ్ర కలకలాన్ని సృష్టించింది. సభ లోపల కూడా నిరసన జ్వాలలు ఆగలేదు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి మరీ గోల చేశారు. సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతూ రాజీనామా(Resignation) చేయాలంటూ డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నితీశ్‌ కుమార్‌(Nitish Kumar) తన వ్యాఖ్యలపై అసెంబ్లీలోనే వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలకు తానే సిగ్గుపడుతున్నానని అన్నారు. ‘నన్ను నేను విమర్శించుకుంటున్నాను. నా వ్యాఖ్యల పట్ల సిగ్గుపడటమే కాకుండా విచారం కూడా వ్యక్తం చేస్తున్నాను. నేను మహిళలకు అండగా ఉంటాను. తాను కేవలం మహిళా విద్య గురించే మాట్లాడాను. మహిళలు చదువుకుంటే జనాభా పెరగదు అన్నదే తన మాటల అర్థం’ అంటూ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ కొందరు సమర్థించినప్పటికీ.. తాను తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 

నితీష్ కుమార్(Nitish Kumar) వ్యాఖ్యలు మహిళలకు ఇబ్బందికరంగా ఉన్నాయని బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్(Bihar Legislative Council) సభ్యురాలు నివేదితా సింగ్(Niveda Singh)  విమర్శించారు. ఇలాంటి ప్రకటనలు విని తట్టుకోలేక మరికొందరు మహిళా శాసనసభ్యులతో కలిసి ఆమె అసెంబ్లీ(Assembly) నుంచి వాకౌట్(Walkout) చేశారు. ఈ సందర్భంగా ఆమె పాట్నా(Patna)లో విలేకరులతో  మాట్లాడుతూ.. అసెంబ్లీ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని, ప్రజలు చూడడానికి, వినడానికి తగినవిగా లేవని అన్నారు. 

జనాభా పెరుగుదలకు చెక్ పెట్టేందుకు బాలికల విద్య ఆవశ్యకతను ఎత్తిచూపుతూ నితీష్ కుమార్(CM Nitish Kumar) గ్రాఫిక్ వివరాలతో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మీరందరూ దీన్ని ప్రత్యక్షంగా చూశారు…మహిళలను ఇబ్బంది పెట్టే ఇలాంటి క్లిప్‌లు చూడకూడదు, వినకూడదు. శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మమ్మల్ని ఇబ్బంది పెట్టింది’ అని నివేదా సింగ్(Niveda Singh) అన్నారు.

‘నేను నన్ను నేను నియంత్రించుకోలేక సభ నుండి బయటకు వెళ్లిపోయాను. మరో ఏడెనిమిది మంది మహిళా శాసన సభ్యులు(Women Legislators) ఉన్నారు. బహుశా వారు తమ నాయకుడి మాటలను వినాలని కోరుకున్నారు. దానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అలాంటి ప్రకటనలు వినడానికి నాలో శక్తి లేదని, అందుకే నేను బయటకు వెళ్లాను’ అని ఆమె తెలిపింది. పాట్నాలో విలేకరులతో మాట్లాడిన బీజేపీ నేత కన్నీళ్లు పెట్టుకున్నారు. మూసిన తలుపుల వెనుక ఏమి జరుగుతుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. నేటి యువతరం మొబైల్ ఫోన్లు, యూట్యూబ్ వాడుతున్నారు…సెక్స్ ఎడ్యుకేషన్(Sex education) ఎవరికి తెలియదు? నితీష్ కుమార్(Nitish Kumar) ఎవరికి బోధించడానికి ప్రయత్నిస్తున్నాడు? అని బీజేపీ(BJP) నేత ప్రశ్నించారు.

కేంద్ర విద్యుత్‌ శాఖ(Central Electricity Department) మంత్రి ఆర్కే సింగ్‌( Minister RK Singh) కూడా నితీశ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అసభ్యకరంగా ఆయన మాట్లాడారని నిందించారు. ‘థర్డ్‌ గ్రేడ్‌’ వ్యాఖ్యలుగా అభివర్ణిస్తూ నితీశ్‌ మతిస్థిమితం కోల్పోయారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి అశ్విని కుమార్‌ చౌబే(Ashwini Kumar Choubey) కూడా నితీశ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. చట్టసభల సభ్యతను మంటగలిపారని, ఆయన ముందు రాజీనామా చేసి వెంటనే ఓ వైద్యుణ్ణి సంప్రదించాలని సూచించారు. మొత్తమ్మీద ఇంత వివాదాన్ని సృష్టించిన ఆయన వ్యాఖ్యలు మహిళా నేతలనే కాదు, మహిళా ఓటర్లను కూడా ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు.

 రాజకీయాల్లో ‘మాట తెచ్చే చేటు’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పదవులు కోల్పోయిన ఘటనలు, ఎన్నికల్లో ఓడిపోయిన ఉదంతాలు దేశంలో అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నితీశ్‌ కుమార్‌(Nitish Kumar) తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరినప్పటికీ.. అవి ప్రజల్లోకి దావాగ్నిలా వ్యాపించాయి. వాటిపై ఆయన ఇచ్చిన వివరణ కంటే ముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఎక్కువ మందికి చేరతాయి. దీంతో క్షమాపణతో నష్ట నివారణ సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.