GHMC ఆఫీసులో పాము కలకలం

ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించి తన పనిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అధికారుల దగ్గరికి వెళ్ళగా, గంటల తరబడి నిలబడడమే తప్ప తన ప్రశ్నకు సమాధానం దొరకలేదని కోపంతో, హైదరాబాదులోని అల్వాల్ కి చెందిన ఒక వ్యక్తి, తన ఇంటిలో దొరికిన పాముని జిహెచ్ఎంసి ఆఫీస్ లో వదిలిపెట్టడం జరిగింది.  అసలు విషయం ఏమిటి?:  అలవాల్లో నివాసం ఉంటున్న సంపత్ కుమార్ అనే వ్యక్తి, ప్రతి పనికి అధికారులు […]

Share:

ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించి తన పనిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అధికారుల దగ్గరికి వెళ్ళగా, గంటల తరబడి నిలబడడమే తప్ప తన ప్రశ్నకు సమాధానం దొరకలేదని కోపంతో, హైదరాబాదులోని అల్వాల్ కి చెందిన ఒక వ్యక్తి, తన ఇంటిలో దొరికిన పాముని జిహెచ్ఎంసి ఆఫీస్ లో వదిలిపెట్టడం జరిగింది. 

అసలు విషయం ఏమిటి?: 

అలవాల్లో నివాసం ఉంటున్న సంపత్ కుమార్ అనే వ్యక్తి, ప్రతి పనికి అధికారులు చేస్తున్న ఆలస్యానికి విసిగిపోయి తన ఇంట్లోకి ప్రవేశించిన ఒక పాముని తీసుకుని వెళ్లి జిహెచ్ఎంసి ఆఫీస్ లో వదిలేశాడు. తన ఇంట్లో పాము చొరబడింది అని సహాయం కోసం అధికారులను సంప్రదించినప్పటికీ వారికి సరైన సమయానికి స్పందించకపోగా, అసలు ఏం జరిగింది అనే ప్రశ్న కూడా అడగనందువలన, సహాయం కోసం గంటల తరబడి వేచి చూసిన సంపత్ కుమార్ విసిగిపోయి, వెంటనే తన ఇంట్లోనికి ప్రవేశించిన పామును తీసుకుని వెళ్లి జిహెచ్ఎంసి ఆఫీస్ లో వదిలేసాడు. 

మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటన జిహెచ్ఎంసి లోని కొంతసేపు భయోందోళనకు గురిచేసింది. అయితే, తమ కుటుంబ సభ్యులతో సహా ఆఫీసుకు వెళ్లిన తమకి నిరాసే ఎదురైందని, అసలు తమకు సహాయం కోరేందుకు ఆఫీసుకు వెళ్లిన తమకి గంటల తరబడి నిలబడడమే తప్పిస్తే అధికారులు స్పందించే అవకాశం కనిపించలేనట్లు తమ కుటుంబ సభ్యులు వాపోయారు. అయితే ప్రశ్నించడానికి వెళ్లిన తమకి నిరాశే ఎదురైందని, అందుకే తమ ఇంట్లోకి చొరబడిన పాముని ఆఫీసులో వదిలి పెట్టాము అని కుటుంబ సభ్యులు చెప్పారు. 

సంపత్ కుమార్ మాట్లాడుతూ, రోజురోజుకీ అధికారుల నిర్లక్ష్యం మితిమీరుతోందని. ఈ పాము విషయంలోనే కాకుండా ఇతర విషయాలు అంటే పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, ఇంకా అనేక ముఖ్యమైన విషయాలులో కూడా జిహెచ్ఎంసి అధికారులు ఇదే తీరులో తమ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. 

లంచానికి లోబడుతున్న అధికారులు: 

ఎంతోమంది చిన్న పని చేయడానికి కూడా లంచం తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఒక గవర్నమెంట్ అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. దొరికిపోయాను అని తెలిసిన అనంతరం ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్న 5000 రూపాయలను, ఆ అధికారి వెంటనే నోట్లో వేసుకొని మింగే ప్రయత్నం చేశాడు. 

హజరీబాగ్ లో గవర్నమెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మిథాలీ శర్మ కోపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్టర్ గా జాయిన్ అయ్యారు. ఇది ఆమె విధుల్లో జాయిన్ అయిన మొదటి రోజే ఒక 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరో కి చిక్కినట్లు ఆధారాలతో పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపింది.

చట్టం ప్రకారం లంచం తీసుకోవడం ఇవ్వడం కూడా నేరమే. ఇలాంటి సంఘటనలు దేశం అంతా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గవర్నమెంట్ అధికారులు నుంచి కొంతమంది పోలీసు అధికారుల వరకు చాలా సందర్భాల్లో లంచం తీసుకున్నట్లు యాంటీ కరప్షన్ బ్యూరో తెలిపింది. కఠిన చర్యలు కూడా తీసుకున్నట్లు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయినట్లు రికార్డ్స్ లో ఉన్నట్లు తెలిపింది. దురాశ దుఃఖానికి చేటు అంటే ఇదేనేమో, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా లంచం తీసుకుని పోలీసుల చేతిలో చిక్కడం నిజంగా అవమానకరం.